Jump to content

వికీపీడియా:రచ్చబండ

వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: వికీ రిఫైన్ - ఎడిట ధాన్ టాపిక్‌లో 6 గంటల క్రితం. రాసినది: Vjsuseela
అడ్డదారి:
WP:VP
రచ్చబండసహాయంపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలువార్తలుఇతరత్రా..

హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన 2026-27లో తెలుగు వికీపీడియా అవుట్‌రీచ్ కార్యక్రమం

ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో నిర్వహించే జాతీయ పుస్తక ప్రదర్శనలో తెలుగు వికీపీడియన్లు, తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ (TWUG) ఆధ్వర్యంలో తెలుగు వికీపీడియా అవుట్‌రీచ్ స్టాల్‌ను స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న విషయం సభ్యులందరికీ తెలిసిందే. మనలో చాలామంది ఈ స్టాల్‌ను సందర్శిస్తూ, కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ వస్తున్నారు.

తెలుగు వికీపీడియా గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, వికీపీడియాలో అందుబాటులో ఉన్న ఉచిత విజ్ఞానాన్ని పరిచయం చేయడం, కొత్తవారిని వికీపీడియా, ఇతర వికీ ప్రాజెక్టుల వైపు ఆకర్షించడం, అలాగే కొత్త సభ్యులను సముదాయంలోకి తీసుకురావడంలో ఇటువంటి అవుట్‌రీచ్ కార్యక్రమాలు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన 2026-27లో తెలుగు వికీపీడియా స్టాల్‌ను మరింత ఆకర్షణీయంగా, సమాచారాత్మకంగా, ప్రభావవంతంగా నిర్వహించేందుకు అవసరమైన కార్యక్రమాలు, ప్రచార సామగ్రి, ఇతర అవుట్‌రీచ్ కార్యకలాపాల కోసం వికీమీడియా ఫౌండేషన్ నుంచి గ్రాంట్ పొందేందుకు దరఖాస్తు సమర్పించాను.

ఈ దరఖాస్తును గురించి WikiConference India 2026 సముదాయంతో ఫౌండేషన్ వారితో చర్చించిన తరువాత ఆన్ వికీ చర్చించి సమర్పించడానికి ఉన్న కొన్ని కాల పరిమితుల కారణంగా, నేరుగా దరఖాస్తు చేయాల్సి వచ్చింది. అయితే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం, ప్రయోజనం, అమలు మాత్రం తెలుగు వికీమీడియా సముదాయం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే విధంగా ఉంటాయి. ఇప్పుడు, జరిగే చర్చలోని అంశాలను కార్యక్రమ రూపకల్పనలో, మెరుగుదలలో ఉపయోగిస్తాము.

అందువల్ల గ్రాంట్ దరఖాస్తును పరిశీలించి, దానికి తమ మద్దతును ప్రకటించవలసిందిగా తెలుగు వికీమీడియా సముదాయ సభ్యులందరినీ కోరుతున్నాను. మీ మద్దతు ఈ కార్యక్రమానికి మరింత బలం చేకూర్చడంతో పాటు, తెలుగు వికీపీడియా గురించి విస్తృత ప్రజానీకానికి అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుంది.

గ్రాంట్ దరఖాస్తు: లింక్ ఇంకా పబ్లిష్ కాలేదు, లింక్ తరువాత చేరుస్తాము : https://meta.wikimedia.org/wiki/Community_Resources_and_Partnerships/India_Rapid_Project

మీ సూచనలు, అభిప్రాయాలు, మద్దతును కూడా స్వాగతిస్తున్నాము.

ఇట్లు

--Batthini Vinay Kumar Goud (చర్చ) 07:38, 17 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

@Batthini Vinay Kumar Goud గారూ, హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన 2026-27లో తెలుగు వికీపీడియా అవుట్‌రీచ్ కార్యక్రమం అనేది మంచి కార్యక్రమం. తెలుగు వికీపీడియా అవుట్‌రీచ్ స్టాల్ ద్వారా ప్రజలకు తెలుగు వికీపీడియా, ఉచిత విజ్ఞానం, వికీమీడియా ప్రాజెక్టుల గురించి అవగాహన కల్పించడం ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం. కొత్తవారిని వికీ సముదాయంలోకి తీసుకురావడంతో పాటు, ఇప్పటికే ఉన్న సభ్యుల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ఇటువంటి అవుట్‌రీచ్ కార్యక్రమాలు మంచి అవకాశాన్ని కల్పిస్తాయి. గ్రాంట్ ద్వారా స్టాల్‌ను మరింత ఆకర్షణీయంగా, సమాచారాత్మకంగా నిర్వహించేందుకు చేపట్టే కార్యక్రమాలు తెలుగు వికీమీడియా సముదాయానికి తప్పకుండా ఉపయోగపడతాయని భావిస్తున్నాను. తెలుగు వికీపీడియా అవుట్‌రీచ్‌ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ గ్రాంట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమానికి నా పూర్తి మద్దతు ఇస్తున్నాను. దరఖాస్తును పరిశీలించి, అవసరమైన సూచనలు, అభిప్రాయాలు అందించేందుకు నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:45, 20 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@:Batthini Vinay Kumar Goud గారు అలాగే. తప్పకుండా చేయండి. అభినందనలు. పబ్లిష్ చేయలేదంటున్నారు. ఇంకా సమయం ఉందా మరి. V.J.Suseela (చర్చ) 07:07, 25 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ముఖ్యమైన కార్యక్రమం. గ్రాంటు పరిస్థితి ఎంతవరకు వచ్చిందో వివరాలు ఏమైనా తెలిస్తే వివరించగలరు. యర్రా రామారావు (చర్చ) 11:30, 25 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Batthini Vinay Kumar Goud గారూ, గ్రాంటు లింక్ ఇంకా తయారుకాలేదా? పైన ఇతర సభ్యులు కూడా అడుగుతున్నారు. దయచేసి లింక్ ఇవ్వగలరు. పవన్ సంతోష్ (చర్చ) 04:27, 28 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

తెవికిబడి పునః ప్రారంభం?

2024, 2025ల లో తెవికీ సభ్యుల సూచనల మేరకు తెవికిబడి వేదికగా ఆన్లైన్ మీట్ లో తరగతులు నిర్వహించడం జరిగింది . తరువాత కూడా ఇంటర్న్షిప్స్, వివిధ ఔట్రీచ్ కార్యక్రమాలలో వికీలో నమోదు చేసుకున్న వారికీ అప్పుడప్పుడు తరగతులు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని విషయాలలో శిక్షణ కొరకు సూచిస్తున్నారు. కాబట్టి తెవికీ బడి తరగతులు తిరిగి ప్రారంభించవచ్చు. ఈ సందర్భంలో సభ్యుల అభిప్రాయం కోరుతున్నాము. సభ్యులు తమ అభిప్రాయం లేదా అంగీకారం, శిక్షణాంశం, శనివారం లేదా ఆదివారం, తరగతి సమయం మొదలైన వివరాలు ఈ పేజీ లో ఇవ్వవలసినది. ధన్యవాదాలు. తెలుగు వికీమీడియన్ల యూజర్ గ్రూప్ </nowiki> V.J.Suseela (చర్చ) 08:20, 20 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

ధన్యవాదాలు @Vjsuseela గారు. చర్చపేజీలో నా అభిప్రాయం రాశాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:41, 20 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

వికీపీడియా:రచ్చబండ#మొదటి_పేజీ_నిర్వహణ అందరు నేర్చుకునే విషయమా కాదా అనేది కొంచెం వివరించండి. నేర్చుకునేది అయితే త్వరలో అమలు చేయాలి కాబట్టి ఈ ఆదివారం లేదా శనివారం తరగతి నిర్వహించవచ్చు. ధన్యవాదాలు. V.J.Suseela (చర్చ) 06:53, 25 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

ఇది నేర్చుకునే అంశమే. క్లాసులు పెట్టాలి.
చర్చలో ఓ వాడుకరినీ ఉద్దేశించి రాస్తున్నపుడు,ఆ వాడుకరి పేజీకి లింకు ఇచ్చి ప్రస్తావించాలనే ప్రాథమిక అంశం కూడా మనలో కొంతమందికి తెలియదు. కొంతమందికి సంతకం చెయ్యడం కూడా తెలీదని నేను గమనించాను. అంచేత మొదటి పేజీ నిర్వహణ గురించి పాఠాలు చెప్పాల్సిందే. __ చదువరి (చర్చ • రచనలు) 10:49, 25 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ధన్యవాదాలు @Chaduvari గారు. రవిచంద్ర గారు ఈ ఆదివారం సెషన్ తీసుకుంటాను అన్నారు. మధ్యాహ్నం 2-4 అడిగాను ఇదివరకులో లాగా. V.J.Suseela (చర్చ) 11:22, 25 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అందరూ దానిమీద పనిచేయకపోయినా, చేయాలిసిన అవసరం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి తెలుసుకోవలసిన విషయం.అంచేత మొదటి పేజీ నిర్వహణ గురించి పాఠాలు చెప్పాలి. యర్రా రామారావు (చర్చ) 11:27, 25 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ధన్యవాదాలు యర్రా రామారావు గారు, చదువరి గారు. రవిచంద్ర గారు ఈ ఆదివారం సెషన్ 3-4pm తీసుకుంటాను అన్నారు. సెషన్ మధ్యాహ్నం 2.30-4 pm. మొదలు పెడదాము. --V.J.Suseela (చర్చ) 12:07, 25 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

(Apologies for posting in English. You can help by translating it)

Hello, I’m Danny from Wikimedia Deutschland’s Wikidata For Wikimedia Projects team.
We have been investigating and examining how Wikidata’s use in the Special:RecentChanges and Special:Watchlist pages can be made to be more useful, or less ‘noisy’ (fewer edits that have little value to the reader).

We are currently exploring to make a change in the volume and the type of Wikidata edits that appear in these pages, and we need your feedback to help us ensure this is a positive change for the Wikis and won’t disrupt your workflows.
Language links are also known as sitelinks or interlanguage links and describe when a Wikidata item is connected to a Wiki, adding it to the language dropdown tool for other connected Wikis.

A variety of "Language Link" edits as seen in the Recent Changes feed

The request for feedback is whether you support the removal of these language link edits from the Recent Changes and Watchlist feed, or would you oppose such a change and if so, why? Please share you thoughts on the dedicated metawiki Talk page.

Further information about this change: m:Wikidata_For_Wikimedia_Projects/Hide_Language_Link_edits

Thank you for any participation or feedback you give, -- User:Danny Benjafield (WMDE) 15:16, 22 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

వికీమీడియా నిర్వహణ, ఇతర ఎక్స్‌టెండెడ్ హక్కుల గురించిన సర్వేలో పాల్గొనండి

వికీమీడియా నిర్వహణలో, నాణ్యతలో చాలా కీలకమైన నిర్వాహక, అధికార, చెక్ యూజర్ మొదలైన ఎక్స్‌టెండెడ్ హక్కుల గురించి మనకు ఉమ్మడిగా ఎంత అవగాహన ఉందో, ఆ అవగాహన పెంచడానికి నిర్వహణా బాధ్యతలు మరింత మంది చేపట్టి విజయవంతంగా పనిచేయడానికి సిద్ధం చేసేందుకు అవసరమైన శిక్షణ, సహకారం ఇచ్చే కార్యక్రమాలు ఎలాంటివి ఉండొచ్చో తెలుసుకునేందుకు ఈ సర్వే వికీమీడియన్, ఓపెన్ నాలెడ్జ్ ఇనీషియేటివ్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నితేష్ గిల్ చేపట్టారు. దయచేసి అందరూ పాల్గొని మీ మీ అభిప్రాయాలు తెలియజేయగలరు https://meta.wikimedia.org/wiki/IIITH-OKI/She_Leads/Lab/Women_with_Extended_Rights/Preliminary_Research#Survey --పవన్ సంతోష్ (చర్చ) 06:55, 23 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

ధన్యవాదాలు @Pavan santhosh.s గారు, వికీమీడియా ప్రాజెక్టులలో ఎక్స్‌టెండెడ్ హక్కులు (నిర్వాహకులు, అధికారులు, చెక్ యూజర్లు ఇత్యాది) కలిగిన వారి సంఖ్య పెరగడం, కొత్తవారికి సరైన శిక్షణ, సహకారం అందించడం సమాజ నాణ్యతాభివృద్ధికి చాలా అవసరం. నితేష్ గిల్ గారు చేపట్టిన ఈ సర్వేలో ఖచ్చితంగా పాల్గొని నా అభిప్రాయాలను నమోదు చేస్తాను. ఈ ముఖ్యమైన వివరాలను సమాజంతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:20, 26 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

కొత్త వాడుకరి గుంపులు అవసరం

తెవికీలో పనిచేసే నిర్వాహకులు తక్కువ. నిర్వాహకత్వానికి చెందిన కొన్ని పనులను ఆసక్తి ఉన్న ఇతరులకు అప్పగిస్తే చురుగ్గా ఉన్న నిర్వాహకులపై పని వత్తిడి తగ్గుతుంది. ఇటీవలి మార్పులపై నిఘా, పేజీల దిగుమతి, ఇంటర్‌ఫేసు నిర్వాహకులు, వగైరాలు ఇందులోకి వస్తాయి. ఈ గుంపుల్లో కొన్ని తెవికీలో ఈసరికే ఉన్నాయి. కొన్నిటిని కొత్తగా తెచ్చుకోవాలి. ఈ గుంపుల గురించి, వాళ్ళు చెయ్యగలిగే పనుల గురించీ వాడుకరులందరికీ చెప్పి, ఆసక్తి ఉన్నవారు తగు అనుమతులు పొందేందుకు అడగమని చెప్పవచ్చు.

ఈ అంశాన్ని గతంలో నిర్వాహకుల దృష్టికి తెచ్చినపుడు, సరే చేద్దాం అని కొందరు నిర్వాహకులు అన్నారు గానీ, ఇంకా అడుగు ముందుకు పడలేదు.__ చదువరి (చర్చ • రచనలు) 06:34, 24 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

@Chaduvari గారూ, నాకు అర్థమైనంతలో దీనికి అవసరమైన పనులు చెప్తాను. మీరు నా అవగాహన సరిగా ఉందో లేదో చెప్పండి.
  1. దిగుమతిదారు (ఇంపోర్టర్), ఇంటర్‌ఫేసు నిర్వాహకులు మాత్రమే మనకు ఇప్పుడు వికీలో ఎనేబుల్ అయివున్న వాడుకరి గుంపు. అదైనా కూడా మనం ఒక పాలసీ చేసుకుని, వెళ్ళి నిర్వాహకులు/అధికారులు కొత్తవారికి ఆ బాధ్యతలు ఇవ్వగలిగేలా అవకాశం ఇమ్మని స్టీవార్డులను అడగాలనుకుంటా. ఒకవేళ, శాశ్వతంగా దిగుమతిదారులను ఉంచాలనుకుంటే దానికొక పాలసీ మనం చేసుకోవాల్సి ఉంటుంది.
  2. ఇటీవలి మార్పులపై నిఘా: దీనికి మన దగ్గర వాడుకరి గుంపు లేదని నేను అనుకుంటున్నాను. దయచేసి నా అవగాహనలో లోపం ఉండి ఉంటే సరిదిద్దగలరు.
ధన్యవాదాలు పవన్ సంతోష్ (చర్చ) 12:24, 25 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ఈ విషయం మధ్యలో ఆపకుండా చివరివరకు క్రియ కట్టే విధంగా తగిన చర్యలు చేపట్టాలి. తెవికీలో చాలా పనులు పెండిగులో ఉన్నవి. చురుకుగా ఉన్న నిర్వాహకులకు పనిభారం తగ్గాలంటే ఇంతకన్నా వేరే మార్గాలు లేవు. యర్రా రామారావు (చర్చ) 13:33, 25 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
తెవికీలో నిర్వహణా కార్యక్రమాలు చేయడానికి ఇప్పుడున్న నిర్వాహకులలో చాలా మంది క్రియాశీలకంగా లేరు. వ్యాసాలు రాయడంపై ఉన్న శ్రద్ధతో పాటు నిర్వహణా కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. అనేక కొత్త వ్యాసాలను పరిశీలించి, సరైన నిర్వహణా ట్యాగులు పెట్టడం, ఇటీవలి మార్పులు పరిశీలించడం, పేజీలను దిగుమతి చేయడం వంటి కార్యక్రమాలు ఉన్న కొంతమంది క్రియాశీల నిర్వాహకులు చేయడం సాధ్యం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా నిర్వాహకుల సంఖ్య క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 10 కి చేరింది. ప్రస్తుతం ఆసక్తి ఉన్న కొత్త వాడుకరులు నిర్వాహకులుగా వస్తే మంచిది. ఆసక్తి ఉన్న వారు వికీ నియామాల ప్రకారం స్వీయ ప్రతిపాదన చేసుకోండి. నిర్వాహణపై పూర్తి ఆసక్తి లేనిచో, నిర్వాహకత్వానికి చెందిన కొన్ని పనులను చేయడానికి ఆసక్తి ఉన్న వారికి అప్పగిస్తే మంచిది. దీనికి సంబంధించిన చర్యలు చేపట్టాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:01, 25 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Pavan santhosh.s గారూ,
1. వికీలో ఎనేబుల్ అయి ఉన్న గుంపులను - ఒకటి రెండు తప్పించి - అధికారులు ఇవ్వగలరనుకుంటానండి. ప్రస్తుత పరిస్థితి తెలియదు గానీ, గతంలో నేను కొన్ని సార్లు ఇంటర్‌ఫేస్ అడ్మిన్ అనుమతులను ఇవ్వడం తీసెయ్యడం చేసాను. 2023 లో ఇతర అధికారులు ఆ పని చేసారు. వీటిని ఇవ్వడానికి వాడుకరి స్వీయ విజ్ఞప్తి చేసుకోవాలి, (దీనిపై పెద్దగా చర్చేమీ జరగదనుకుంటాను), దానిపై అధికారి ఆ వాడుకరి చరిత్రను పరిశోధించి, దానిపట్ల సంతృప్తి చెందితే ఆ వాడుకరికి అడిగిన అనుమతులు ఇస్తారు. అన్నట్టు దిగుమతిదారును ట్రాన్స్‌వికీ దిగుమతిదారు అంటారనుకుంటాను.
2. ఔను, ఈ గుంపు లేదు. ఆ గుంపును మనం తెచ్చుకోవాలి. అభ్యర్థించే ముందు మనం చర్చ చేసి, నిర్ణయం తీసుకోవాలి. దానికంటే ముందు, అభ్యర్థించే ప్రాసెస్ ఏంటో చూడాలి.
__ చదువరి (చర్చ • రచనలు) 01:40, 26 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari గారూ, ఈ వరుసలో పనిచేద్దాం:
  1. నిర్వాహకులు, అధికారులు పరిశీలించి చూసి తెవికీలో ఉన్న ఎక్స్టెండెడ్ రైట్స్ (దీనికి ఏదోక తెలుగు పేరు పెట్టాలి? లేదా ఇప్పటికే ఉందా?) ఏమిటి? వాటిని ఎవరు ఇవ్వగలరు అన్న జాబితాతో పాటుగా ఆయా హక్కుల తాలూకు బాధ్యతలు, పనితీరు ఏమిటన్నది ఒక పేజీ పెట్టి చిన్న లిస్టు వేసుకుందాం.
  2. ఆ తర్వాత రాబోయే తెవికీ బడిలో ఈ అంశాలపై సమగ్రమైన అవగాహన ఉన్న ఎవరైనా స్టీవార్డుని కానీ, ఇతరులను కానీ నేను ఆహ్వానిస్తాను. వారితో ఒక సెషన్ చేసుకుని మన అవగాహన పరిపూర్ణం చేసుకుందాం.
  3. ఈలోగా తెవికీలో ఎవరెవరు ఈ బాధ్యతలు తీసుకోగలరన్నది ఇప్పుడున్నవారి చర్చాపేజీ కాంట్రిబ్యూషన్లు, ఇతరత్రా పనులు పరిశీలించి ముందుకువెళ్ళి ప్రోత్సహిద్దాం.
ఈ బాధ్యతలు మూడుగా ఉన్నాయి కాబట్టి ఒక్కో విభాగానికి కనీసం ఒకరు ఇంకా బావుండాలంటే ఇద్దరు నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్తే పని అవుతుంది. ఈ పద్ధతి ఎలా ఉందనేదీ. ఏ విభాగానికి ఎవరు నాయకత్వం వహిస్తే బావుంటుందో సూచించండి.
ఇక్కడ చర్చలోకి వచ్చిన @K.Venkataramana, @Srinivasrjy, @యర్రా రామారావు గార్లు కూడా ఈ విషయం పరిశీలించగలరు. పవన్ సంతోష్ (చర్చ) 05:12, 26 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari గారూ, నాకు మూసల దిగుమతి, అనువాదం, ఎర్రలింకులు సరిచెయ్యడం, తగిన పేజిలలో చొప్పించడం యందు ఆసక్తి ఉంది. ✥Srinivasrjy✥(📞talk) 16:39, 25 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Srinivasrjy గారూ అనువాదం, ఎర్రలింకులు సరిచెయ్యడం వంటివి చేసేందుకు ప్రత్యేక అనుమతులేమీ అవసరం లేదండి. ఎవరైనా చెయ్యొచ్చు. ఇప్పుడు మీరూ చెయ్యవచ్చు. ఇక దిగుమతి.. బాగా చురుగ్గా దిగుమతులు కావాలని అడుగుతున్న వాడుకరుల్లో మీరొకరు. మీరు ఆ అనుమతి కోరడం సహజమే. అనుమతి కోరేందుకు ఒక పద్ధతి, ఒక పేజీ ఉంటుందనుకుంటాను. నిర్వాహకులు ఆ పేజీని సృష్టించాక, అందులో మీస్వీయ ప్రతిపాదన చేస్తే, అధికారి దాన్ని ప్రసాదిస్తారు. దిగుమతి చెయ్యడంలో కొన్ని అంశాలను గమనించాలి. ఈలోగా వాటి గురించి తెలుసుకోండి సార్.__ చదువరి (చర్చ • రచనలు) 01:43, 26 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari గారూ, మీరన్నది నిజమే! అయితే నేను అడిగింది మూసల దిగుమతి అటుతర్వాత వాటి లింకుల సరిచేతలాంటి మొత్తం కార్యక్రమం కోసం చెపుతున్నాను. వికీలో ఎలా వ్రాయాలో శిక్షణ ఇస్తున్నారు. వికీ వెనక జరిగే సాంకేతికతలు, అనుమతుల ప్రతిపాదనల పద్దతుల కోసం "నిర్వాహణ బడి" లాంటి ఒక శిక్షణ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా సూచన. ✥Srinivasrjy✥(📞talk) 04:12, 26 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
తెవికీ బడిలోనే నిర్వహణ పాఠాలు చెప్పవచ్చు. నిర్వహణ మీద ఆసక్తి ఉన్నవారు ముందుకొచ్చి ఫలానా శిక్షణ కావాలని అడిగితే, ఆ పాఠాలు పెట్టవచ్చండి, మన చేతిలో పనేకదా!__ చదువరి (చర్చ • రచనలు) 16:55, 26 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Srinivasrjy గారూ మీకు కావలసిన శిక్షణాంశం, శనివారం లేదా ఆదివారం, తరగతి సమయం మొదలైన వివరాలు ఈ పేజీ లో ఇవ్వవలసినది. ధన్యవాదాలు. V.J.Suseela (చర్చ) 09:21, 26 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అందరికీ నమస్కారం,
తెవికీలో నిర్వహణా భారాన్ని తగ్గించి, పనులను వేగవంతం చేయడానికి నిర్వాహకత్వానికి చెందిన కొన్ని పనులను ఆసక్తి ఉన్నవారికి 'నిర్వహణ బడి' ద్వారా శిక్షణ ఇవ్వడం చాలా ఆవశ్యకం.
@Chaduvari, @Pavan santhosh.s గార్లు సూచించిన విధంగా ముందుగా మన తెవికీలో అందుబాటులో ఉన్న హక్కులు, అధికారులు ఇవ్వగలిగే అనుమతులు, అలాగే గ్లోబల్/స్టీవార్డ్స్ ద్వారా తెచ్చుకోవాల్సిన కొత్త గుంపుల వివరాలతో ఒక జాబితా, సమాచార పేజీని తయారు చేసుకుందాం.
@Srinivasrjy గారి లాంటి ఉత్సాహవంతులైన సభ్యులు సాంకేతిక అంశాలపై ఆసక్తి చూపడం శుభపరిణామం. రాబోయే 'తెవికీ బడి' లో లేదా ప్రత్యేక సెషన్‌లో స్టీవార్డ్స్/నిపుణుల భాగస్వామ్యంతో అవగాహన కల్పించి, ఈ ప్రక్రియను ఇక్కడితో ఆపకుండా, చివరివరకూ ప్రాసెస్ పూర్తి చేసి అమలులోకి తెచ్చేందుకు మనమందరం కలిసి పనిచేద్దాం. మరింత మంది వాడుకరులు కూడా తమకు వీలైన విభాగాలలో బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రావలసిందిగా కోరుతున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:40, 26 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
పై చర్చలను అనుసరించి తెలుగు వికీపీడియా నిర్వాహకత్వం, వాడుకరి గుంపులు వంటి అంశాల గురించిన శిక్షణ, మార్గదర్శకాలు, విధానాలు గురించిన శిక్షణ తెవికిబడిలో నిర్వహిద్దాము. వీలయితే వచ్చే ఆదివారం అక్టోబరు 4న. శిక్షణ ఎవరు నిర్వహిస్తారో సూచించండి. --V.J.Suseela (చర్చ) 18:15, 26 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
https://w.wiki/VTL9 ఇది వాడుకరి హక్కుల గుంపుల లింక్. ఒకసారి పరిశీలించి గలరు. యర్రా రామారావు (చర్చ) 02:09, 27 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

తెవికీ వర్గాల నామకరణ సమస్యలు-ప్రాథమిక అభిప్రాయాల సేకరణ

తెవికీలో కొన్ని వర్గాల పేర్లు స్థిరంగా లేవు. వాటిలో స్పేసింగ్ తేడాలు, పర్యాయపదాలు, పేరులో వివిధ రూపభేదాలు, వ్యాకరణ దోషాలు వంటి కారణాల వల్ల ఒకే వర్గం రెండు మూడు వేర్వేరు పేర్లుతో ఉనికిలో ఉన్నవి. ఇలాంటివి దాదాపు 80కి పైగా ఉదాహరణలు గుర్తించి వాటిని వర్గాల నామకరణ సమస్యలు/ఒకటికి మించి ఉన్న వర్గాలు పేజీలో సమగ్రవివరాలతో నమోదు చేయుట జరిగింది. ఆ సమస్యలపై సముదాయం నామకరణ విధాన నిర్ణయాలు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. దీనికి ముందు, ఫార్మాట్/ప్రక్రియ సరిగ్గా ఉందో లేదో, సముదాయ సభ్యుల విలువైన ప్రాథమిక అభిప్రాయాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవలిసిన అవసరముంది. సముదాయ సభ్యుల ప్రాథమిక అభిప్రాయాలు, సూచనలు తెలపటానికి వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/వర్గాల సంస్కరణ పేజీని సందర్శించి వాటిలోని సంబందిత వర్గాల సమస్యలను పరిశీలించి ఆ పేజీ దిగువ విభాగంలో మీ అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలు ఒక వారం రోజులలోపు తెలియజేయగలరు. వాటిని పరిగణనలోకి తీసుకుని, సమగ్రంగా క్రోడీకరించి సాధ్యమైనంత త్వరలో మరలా వాటిమీద విధాన నిర్ణయాల నిర్ణయించుటకు చర్చను ప్రవేశపెట్టటానికి మీ అందరి సహకారం కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 16:10, 24 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

వర్గాలలో ఇన్ని సమస్యలు గుర్తించి ప్రస్తావించారు. ధన్యవాదాలు ఇంకో లింకు కూడా ఉందండి. https://w.wiki/Ub6B (వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/చర్చించాల్సిన వర్గాల జాబితా) V.J.Suseela (చర్చ) 18:12, 24 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@సుశీల గారూ ఆ పేజీలో వర్గాలు, మరలా ప్రవేశపెట్టే వి విధాన నిర్ణయాలు నిర్ణయించే చర్చలో తీసుకు వస్తాను. యర్రా రామారావు (చర్చ) 03:50, 25 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అలాగే అండి. ఈ విషయంలో నేను చేయగలిగేది ఏమైనా ఉంటే సూచించండి . V.J.Suseela (చర్చ) 07:08, 25 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@సుశీల మేడమ్ గారూ ధన్యవాదాలు, ఎక్కువమంది చర్చలో అభిప్రాయాలు, సూచనలు తెలియపరిస్తే మరింత నాణ్యతగా వర్గాల నామకరణాలు రూపొందటానికి అవకాశాలు మెండుగా ఉంటాయని నా అభిప్రాయం, వాట్సప్ గ్రూప్ లలో స్పందించినట్లుగా రచ్చబండలో స్పందనలు ఉండటం లేదు, ఏమిచేస్తాం, దురదృష్టం. యర్రా రామారావు (చర్చ) 07:33, 25 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
"వాట్సప్ గ్రూప్ లలో స్పందించినట్లుగా రచ్చబండలో స్పందనలు ఉండటం లేదు"
తెవికీకి సంబంధించినంత వరకూ వాట్సాప్ గ్రూపుల వలన పెద్దగా ప్రయోజనం కలుక్క పోగా, వాటి వలన నష్టం మాత్రం కలుగుతోంది. అసలు వాట్సాప్ గ్రూపులు ఉన్నది, వికీకి ప్రత్యామ్నాయంగా కాదు. వాటిని వికీకి కాంప్లిమెంటరీగా వాడాలి. కానీ మనం, అక్కడ మాత్రమే చర్చిస్తున్నాం. ఇక్కడ చర్చా ఉండదు, నిర్ణయాలూ ఉండవు, పనీ జరగదు.
ఇక్కడ చర్చలు అద్భుతంగా జరుగుతున్నాయనీ, నిర్ణయాలు తెగ తీసుకుంటున్నామనీ, వాటి ఫాలో అప్ పని బాగా జరుగుతోందనీ నేను చెప్పడం లేదు. కానీ అసలు ఎంతోకొంత చర్చంటూ జరిగితే, ఒక నిర్ణయమంటూ తీసుకోకపోయినా, చర్చ మాత్రం శాశ్వతంగా మిగులుతుంది. వాట్సాప్‌లో "మాత్రమే" చేసే చర్చలు నీళ్ళ మీది రాతలే. వాటి వలన తెవికీకి వీసమెత్తు ప్రయోజనం లేదు. __ చదువరి (చర్చ • రచనలు) 10:35, 25 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@చదువరి గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 11:20, 25 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అందరికీ నమస్కారం,
తెలుగు వికీపీడియాలో 80కి పైగా వర్గాల నామకరణ లోపాలను, పునరావృత వర్గాలను గుర్తించి సమగ్రంగా నమోదు చేసినందుకు @యర్రా రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వికీ ప్రాజెక్టు నాణ్యతను పెంచడంలోనూ, విషయ వర్గీకరణను క్రమబద్ధకరించడంలోనూ ఇది చాలా కీలకమైన పని.
రెండు ముఖ్యమైన విషయాలపై నా అభిప్రాయాలు:
  • వర్గాల సంస్కరణ చర్చ: రామారావు గారు ప్రతిపాదించిన పేజీలను వికీపీడియన్లందరూ పరిశీలించి, నామకరణ విధానం సాధారితీకరించడానికి తమ అభిప్రాయాలను నమోదు చేయాలి. ఈ ప్రక్రియ క్రమబద్ధంగా జరగడానికి నా పూర్తి సహకారాన్ని అందిస్తాను.
  • ఆన్-వికీ చర్చల ప్రాముఖ్యత: @Chaduvari గారి అభిప్రాయంతో నేను నూటికి నూరుపాళ్ళు ఏకీభవిస్తున్నాను. వాట్సాప్ వంటి బాహ్య వేదికలలో జరిగే సంభాషణలు కాలక్రమేణా మరుగున పడిపోతాయి, కానీ వికీపీడియా రచ్చబండ లేదా సదరు చర్చా పేజీలలో నమోదయ్యే చర్చలే తెవికీకి శాశ్వతమైన ఆస్తిగా మిగులుతాయి. వికీ నిర్ణయాలు, చర్చలు అధికారికంగా ఆన్-వికీలోనే జరగడం వికీ నియమావళికి, భవిష్యత్తు సూచనలకు అత్యంత ఆవశ్యకం.
సముదాయ సభ్యులందరూ వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/వర్గాల సంస్కరణ పేజీని సందర్శించి తమ విలువైన అభిప్రాయాలను అందించాల్సిందిగా కోరుతున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:43, 26 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@ప్రణయ్ రాజ్ @చదువరి, పవన్ సంతోష్, స్వరలాసిక, కశ్యప్,అభిలాష్, గౌరీపతి, శ్రీనివాస్, కళాసాగర్,వినయ్ కుమార్ గౌడ్, మురళీకృష్ణ, ఉదయ్ కిరణ్ గారలందరూ, ఇంకా ఫైన ఉదహరించని తోటి యూజర్స్ అందరూ వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/వర్గాల సంస్కరణ పేజీని సందర్శించి వాటిలోని సంబందిత వర్గాల సమస్యలను పరిశీలించి ఆ పేజీ దిగువ విభాగంలో మీ అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలు రెండురోజులలోపు తెలియజేయగలరు. మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు, తెవికీ నాణ్యతను మరింత మెరుగైన స్థాయికి చేరగలదనుటలో ఎటువంటి సందేహం లేదు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 05:19, 28 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, స్పందిస్తానండి. ఈ చర్చ తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. ఒక సూచన: ఈ కొత్త చర్చ పేజీ లింకును (వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/వర్గాల సంస్కరణ) వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు పేజీలో తాజా చర్చల్లో చేర్చండి. అలాగే పాత చర్చల లింకులను మీరు వేరే విభాగం లోకి మార్చారు కాబట్టి వాటిని కూడా చూడమని ఆ లింకులున్న విభాగపు లింకును ఇస్తే, పాత చర్చలలో ఏం జరిగిందో వాడుకరులకు తెలుస్తుంది. గత చర్చల్లో నిర్ణయాలు తీసుకున్న అంశాలపై మళ్ళీ చర్చించకుండా నివారించవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 07:47, 28 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అలాగే నండీ. యర్రా రామారావు (చర్చ) 07:53, 28 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
తెలుగు వికీపీడియాలో (తెవికీ) వర్గాల పేర్లు ఏకరీతిలో లేకపోవడం వల్ల, ముఖ్యంగా వ్యాసాలను అనువదించేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి తగిన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. దీనిపై చర్చించిన అనంతరం, కొత్త వర్గాలను సృష్టించే వాడుకరులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేయాలి.
కళాసాగర్ Kalasagary (చర్చ) 15:29, 29 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Kalasagary గారూ, చాలా చురుగ్గా రాస్తున్న వాడుకరుల్లో మీరొకరు. మీకు అవసరమైన సహాయం దొరక్కపోవడం శోచనీయమే. వికీపీడియా:వర్గీకరణ పేజీని చూడకపోతే ఇప్పుడు చూడండి. అందులో మీకు అవసరమైన సహాయం పూర్తిగా దొరకదు గానీ కొంత ప్రాథమిక సమాచారం దొరుకుతుంది.
వర్గాలకు పేర్లు పెట్టే విషయంలో ఒక చిట్కా ఉంది: మీరు ఏ పేజీలో వర్గాన్ని చేర్చాలని భావిస్తున్నారో, అలాంటి పేజీలు మూడో నాలుగో చూడండి. అవి ఏ వర్గాల్లో ఉన్నాయో చూడండి. ఆ వర్గాల్లో ఎక్కువ పేజీలు ఎందులో ఉన్నాయో చూసి, సరిపోతాయనుకుంటే ఆ వర్గాలను మీ పేజీలో కూడా పెట్టండి. లేదంటే ఆ పేర్లు ఎలా ఉన్నాయో చూసి అలాంటి పేర్లనే వాడి మీ పేజీకి తగిన వర్గాన్ని సృష్టించండి. ఉదాహరణకు, మీరు ఒక స్వాతంత్ర్య సమర యోధుడి పేజీ రాస్తే, అల్లూరి, మద్దూరి, భోగరాజు, బోసు, గాంధీ, నెహ్రూ వగైరాలపేజీలు చూడండి. అక్కడి వర్గాలను ఇక్కడ వాడండి.
ఈ కొత్త వర్గానికి కనీసం ఒక మాతృవర్గం ఉండడం మాత్రం తప్పనిసరి.
మార్గదర్శకాలు రూపొందేలోపు, వర్గాలకు సంబంధించి మీకు ఏ ఇతర సహాయం కావాలన్నా నన్ను అడగండి. నాకు తెలిసినంత మేరకు నేను సాయం చేస్తాను. నాకూ తెలియనివి మనిద్దరం కలిసి నేర్చుకుందాం. ఒక నెలలో మనం వర్గాలకు సంబంధించి, ఒక సంతృప్తికరమైన స్థాయికి చేరేలా ప్రయత్నం చేద్దాం. మీ సందేహాలను నా చర్చ పేజీలో రాయండి. నేను సమాధానాలు రాస్తాను. అవసరమైతే, రాత్రి 7 నుండి 10 లోపు మనం ఫోనులో కూడా మాట్లాడుకోవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 01:43, 30 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

వర్గాల చర్చ నిర్ణయం జరిగే అంతవరకు పాత వర్గాల స్థానంలో కొత్త వర్గాలు సృష్టించవద్దు

దయచేసే వర్గాల చర్చ పెండింగ్లో ఉండగా మరలా పాత వర్గాలను పక్కనపెట్టి మన అభిప్రాయం ప్రకారం మరలా కొత్త వర్గం సృష్టించటం కొత్తవాటిని సృష్టించి ఆ వర్గంలో పాత వర్గాల నుండి. వ్యాసాలు బదిలీ చేయడం వికీపీడియా మార్గదర్శకాలకు విరుద్ధం. దయచేసి గమనించగలరు. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 14:21, 26 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

అలాగే అండి V.J.Suseela (చర్చ) 14:34, 27 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అలాగేనండీ @యర్రా రామారావు గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:38, 28 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

తెలుగు వికీపీడియా మొదటి పేజీ నిర్వహణ

సభ్యులకు నమస్కారం

తెలుగు వికికీమీడియన్స్ యూజర్ గ్రూప్ అర్ధర్వ్యం లో తెవికీబడి వేదిక ద్వారా "తెలుగు వికీపీడియా మొదటి పేజీ నిర్వహణ" అనే అంశం మీద రవిచంద్ర  గారు శిక్షణ ఇస్తారు. తేదీ 27.09.2026, సమయం - మధ్యాహ్నం 2.30pm.

గూగుల్ మీట్ లింక్ - https://meet.google.com/kgp-axmz-frf?hs=224.

సభ్యులందరు పాల్గొనవలసినదిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు.

తెలుగు వికికీమీడియన్స్ యూజర్ గ్రూప్ V.J.Suseela (చర్చ) 15:12, 26 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

ఒక పెజిలొ infobox లో Spouse ఎలా మర్చాలో తెలియట్లేదు.

https://l1nk.dev/38cqzdu ఈ వైకొం విజయల క్ష్మి గాయకురాలు పేజీలొ infobox లో Spouse- భార్య పేరు అని ఉంది, భర్త అని ఉండాల్సిన చోట. ఎవరైనా మార్చండి. Svpnikhil (చర్చ) 06:34, 28 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

@Svpnikhil గారూ లింకు తప్పు ఇచ్చారు. __ చదువరి (చర్చ • రచనలు) 07:55, 28 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Svpnikhil గారూ, వచ్చింది లెండి. అవసరమైన మార్పు చేసాను.
తెవికీ లోని పేజీకి లింకు ఇవ్వడానికి [[ ]] -ఇలా వికీలింకు ఇస్తే సరిపోతుంది.__ చదువరి (చర్చ • రచనలు) 08:28, 28 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

ప్రత్యేక పేజీలు లింకు ఏమైందంటే..

గతంలో ప్రత్యేక పేజీలు లింకు సైడుబారులో ఉండేది. ప్రత్యేకపేజీలను చూడడానికి వీలుగా ఉండేది. సుమారొక ఏడాది కిందట, మీడియావికీ సాఫ్టువేరు కొత్త వెర్షనులో దాన్ని తీసేసారు. దాంతో ప్రత్యేక పేజీలను చేరుకోవాలంటే వెతుకుపెట్టెలో ఇచ్చి వెళ్ళాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ లింకు కావాలంటే ఏ వికీకి ఆ వికీలో ఈ లింకును సైడుబారులో పెట్టుకోవాల్సిందే. మనకు ఇది అవసరం కాబట్టి, దాన్ని సైడుబారులో పెట్టాలని నిర్వాహకులకు అభ్యర్థన.__ చదువరి (చర్చ • రచనలు) 05:13, 29 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

నేను బుక్ మార్క్ లో పెట్టుకున్నాను. లింక్ :https://w.wiki/7a4T యర్రా రామారావు (చర్చ) 05:17, 29 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
నాకు తెలిసి వీటి అవసరం చాలామందికి తెలియదనుకుంటున్నాను. వీటి మీద తెవికీ బడిలో ఒకరోజు క్లాసు ఇస్తే బాగుంటుంది.అవకాశముంటే నేను ప్రిపేర్ అవుతాను. మీరు ఇస్తే ఇంకా మంచిది. యర్రా రామారావు (చర్చ) 05:30, 29 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ఇప్పుడు అవసరం, దాన్ని సైడుబారులో పెట్టేందుకు చర్యలు తీసుకోవడం. రెణ్ణిమిషాల పని. కానీ, అది నిర్వాహకులే చెయ్యగలరు.__ చదువరి (చర్చ • రచనలు) 09:20, 29 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ప్రత్యేక పేజీలు లింకు ఎడమవైపు సైడుబారులో ఉంటేనే సులభంగా ఉంటుంది. @Chaduvari గారు సూచించినట్టుగా సైడుబారులో పెట్టుకుందాం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:11, 29 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Pranayraj1985 గారూ, ఔనండి. సైడుబారులో లింకు ఉండాలి. బుక్‌మార్కులు అనేవి వ్యక్తిగతం. లింకు లేకపోతే అలాంటివి ఎవరికి వాళ్ళు చేసుకుంటారు. లింకులుండడం సైటుకు ముఖ్యం.__ చదువరి (చర్చ • రచనలు) 09:24, 29 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari గారు, మీరు సూచించినట్టుగా ఎడమవైపు సైడుబారులో ప్రత్యేక పేజీలు లింకు చేర్చాను. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:15, 29 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ధన్యవాదాలు, @ప్రణయ్ రాజ్ గారు. ఒక సంవత్సరం కిందట, దీని గురించి రచ్చబండలో రాసాను. కానీ, ఆ లింకు ఎందుకు తీసేసారో ఎవరూ పట్టించుకోలేదు, నేనూ పక్కన పడేసాను. ప్రత్యేక పేజీల అవసరం వచ్చినపుడల్లా వాడుకరి:యర్రా రామారావు గారు చెప్పినట్టు ఏదో ఒక పద్ధతి ద్వారా ఆ పేజీకి వెళ్తూండేవాణ్ణి. ఆ లింకు ఎందుకు తీసేసారా అని అనుకుంటూ ఉండేవాణ్ణి. ఇవ్వాళ వెతికాను, ఎందుకు తీసేసారు? ఎవరు తీసేసారు అని. విషయాలు తెలిసాయి. అంచేతనే లింకు పెట్టమని రాసేసాను, మీరు వెంటనే చేసేసారు. ధన్యవాదాలు, మళ్ళీ.__ చదువరి (చర్చ • రచనలు) 10:30, 29 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

కొత్త ట్వింకిల్ గాడ్జెట్‌ను స్థాపించాలి

గతంలో ట్వింకిల్ గాడ్జెట్లో సమస్య వచ్చినపుడు దాన్ని పరిష్కరించడం మనకు సమస్యగా మారింది./ దాని కోడు మొత్తం ఒకటో రెండో ఫైళ్ళలో ఉండడంతో దాన్ని సరిచెయ్యడం తలకు మించిన పనైంది. అప్పుడూ వీవెన్ గారు కొత్తగా రాసేందుకు ప్రయత్నం చేసారెఉ గానీ అది మధ్య లోనే ఆగిపోయింది. దాంతో మనకు ట్వింకిల్ లోని విశేషాలు పనిచెయ్యకుండా అలాగే ఉండిపోయాయి.

ఈలోగా ట్వింకిల్ గాడ్జెట్‌ను దాని డెవలపర్లు సమూలంగా మార్చివేసారు. గతంలో ఉన్న నాలుగైదు ఫైళ్ళ స్థానే 20 కి పైగా ఫైళ్ళను సృష్టించారు. ప్రస్తుతం ఎన్వికీలో అది పని చేస్తోంది. దాన్నే మనం కూడా స్థాపించుకోవాలి. అందుకు గాను, కింది ఫైళ్ళను ఎన్వికీ నుండి దిగుమతి చేసుకోవాలి. ఈ ఫైళ్ళలో మూడో నాలుగో ఈసరికే ఉన్నాయి. వాటిని ఓవర్ రైటు చేస్తూ దిగుమతి చెయ్యాలి. ఇది ఒక ప్రత్యేకమైన పని కాబట్టి దిగుమతి అభ్యర్థనలు పేజీలో కాకుండా ఇక్కడ రాస్తున్నాను. వీటిని దిగుమతి చేసుకున్నాక, గాడ్జెట్ డెఫినిషను, ట్వింకిల్ కాన్ఫిగరేషను వగైరా ఫైళ్ళలో మార్పులు చెయ్యాల్సి రావచ్చు. ముందు కింది ఫైళ్ళను దిగుమతి చేసుకుందాం. నిర్వాహకులు పరిశీలించవలసినది:

  • MediaWiki:Twinkle-pagestyles
  • MediaWiki:Gadget-Twinkle.js
  • MediaWiki:Gadget-twinklearv.js
  • MediaWiki:Gadget-twinklewarn.js
  • MediaWiki:Gadget-twinkleblock.js
  • MediaWiki:Gadget-twinklewelcome.js
  • MediaWiki:Gadget-twinkletalkback.js
  • MediaWiki:Gadget-twinklespeedy.js
  • MediaWiki:Gadget-twinkleprod.js
  • MediaWiki:Gadget-twinklexfd.js
  • MediaWiki:Gadget-twinkleimage.js
  • MediaWiki:Gadget-twinkleprotect.js
  • MediaWiki:Gadget-twinkletag.js
  • MediaWiki:Gadget-twinklediff.js
  • MediaWiki:Gadget-twinkleunlink.js
  • MediaWiki:Gadget-twinklerollback.js
  • MediaWiki:Gadget-twinkledeprod.js
  • MediaWiki:Gadget-twinklebatchdelete.js
  • MediaWiki:Gadget-twinklebatchprotect.js
  • MediaWiki:Gadget-twinklebatchundelete.js
  • MediaWiki:Gadget-twinkleconfig.js
  • MediaWiki:Gadget-Twinkle.css

చదువరి (చర్చ • రచనలు) 11:52, 29 సెప్టెంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:11, 3 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
నేను దిగుమతి చేయటానికి ప్రయత్నించగా మీకు అనుమతిలేదని సందేశం చూపించింది.ఈ విషయంలో అధికారి హోదాలో ఉన్న @వాడుకరి:రవిచంద్ర గారు జోక్యం చేసుకోవలసిందిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 03:51, 5 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
నేను ప్రయత్నిస్తానండీ - రవిచంద్ర (చర్చ) 14:02, 6 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
చదువరి గారూ, యర్రా రామారావు గారూ, దిగుమతి పేజీ ద్వారా ప్రయత్నించాను. అన్నీ మీడియావికీ నేమ్‌స్పేసులోకి దిగుమతి అయ్యాయి. కానీ మొదటిది మాత్రం దిగుమతి విఫలమైంది: దిగుమతి చెయ్యడానికి పేజీలేమీ లేవు. అని చూపిస్తోంది. దాన్ని మళ్ళీ ప్రయత్నిస్తాను. - రవిచంద్ర (చర్చ) 14:17, 6 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@రవిచంద్ర గారూ ధన్యవాదాలు. ఒక్కోసారి అలానే చూపిస్తుంది, మరలా మరలా ట్రై చేయండి, ఒకవేళ అది ఆల్రెడీ దిగుమతి వుండవచ్చు. యర్రా రామారావు (చర్చ) 14:31, 6 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
నిజంగానే ఆంగ్ల వికీలో MediaWiki:Twinkle-pagestyles అనే పేరుతో పేజీ ఏమీ లేదు మనం దిగుమతి చేయడానికి. అది MediaWiki:Gadget-Twinkle-pagestyles అయ్యుండవచ్చని ఊహించి దానిని కూడా దిగుమతి చేశాను. ఇక మనం ట్వింకిల్ ఉపకరణాన్ని వాడటానికి అధికారి హోదాలో చేయవలసిన పనులు ఏమైనా ఉంటే చేయగలను. - రవిచంద్ర (చర్చ) 17:03, 6 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ప్రస్తుతం గతంలో ఉన్న ఆప్షన్స్ నాకు చూపించటంలేదు. మరి మీకు ఎలా చూపిస్తున్నావో... వెంటనే తగిన చర్యలు చేపట్టగలరు. యర్రా రామారావు (చర్చ) 17:09, 6 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@రవిచంద్ర గారూ, పై జాబితాలో MediaWiki:Gadget-twinklearv.js అనే పేజీ దిగుమతి కాలేదు. ఒకసారి మళ్ళీ ప్రయత్నించండి. __ చదువరి (చర్చ • రచనలు) 17:57, 15 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari గారూ, దిగుమతి చేశాను.- రవిచంద్ర (చర్చ) 15:47, 16 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@రవిచంద్ర గారూ, మీడియావికీ:Gadgets-definition పేజీలో browsing లో నాలుగో పాయింటు దగ్గర (ట్వింకిల్ కు సంబంధించినది) ఇప్పుడు ఉన్నదాన్ని తీసేసి, కింది టెక్స్టును చేర్చండి:
Twinkle[ResourceLoader|dependencies=mediawiki.user,mediawiki.util,jquery.ui.dialog,jquery.tipsy,moment|rights=autoconfirmed]|morebits.js|morebits.css|Twinkle.js|twinkleprod.js|twinkleimage.js|twinklebatchundelete.js|twinklewarn.js|twinkleblock.js|twinklespeedy.js|friendlyshared.js|twinklediff.js|twinkleunlink.js|friendlytag.js|twinkledeprod.js|friendlywelcome.js|twinklexfd.js|twinklebatchdelete.js|twinklebatchprotect.js|twinkleconfig.js|twinklefluff.js|twinkleprotect.js|twinklearv.js|friendlytalkback.js చదువరి (చర్చ • రచనలు) 04:14, 7 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@చదువరి గారూ, మార్చాను. - రవిచంద్ర (చర్చ) 14:29, 7 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@చదువరి గారూ నాకు ఓపెన్ అయింది. నేను చేర్చవచ్చా యర్రా రామారావు (చర్చ) 04:19, 7 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ మిమ్మల్ని దిద్దుబాట్లు చెయ్యనిస్తే, చేర్చవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 04:41, 7 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@వాడుకరి:యర్రా రామారావు గారూ, వాడుకరి:Pranayraj1985 గారూ, వాడుకరి:Batthini Vinay Kumar Goud గారూ, TW అనే పేరుతో సవరించు, చరిత్ర వగైరా లింకుల పక్కన కొత్త Twinkle ట్యాబు కనిపిస్తోందా? కనిపిస్తే, అందులో మెనూలు ఏమేం ఉన్నాయో చెప్పండి. నేను ప్రస్తుతం దీనిమీద పనిచేస్తున్నాను. వెంటనే సమాధానమిస్తే పనికొస్తుంది. ధన్యవాదాలు. __ చదువరి (చర్చ • రచనలు) 05:07, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@చదువరి గారూ కనపడుతున్నవి యర్రా రామారావు (చర్చ) 05:12, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
CSD, XFD, PP Last, Unlink, D-Batch,P-Batch, Config ఇవి కనపడుతున్నవి యర్రా రామారావు (చర్చ) 05:14, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@చదువరి గారూ డైలాగ్ బాక్సులు తెరుచుకుంటున్నవి, ఇంకా WEl ఇలాంటివి రావాలనుకుంటాను యర్రా రామారావు (చర్చ) 05:33, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, ధన్యవాదాలు. ఆ warn, wel, block, వంటి మెనూ ఐటములు వాడుకరి, వాడుకరి చర్చ పేజీల్లో మాత్రమే వస్తాయండి. చూడండి. వాటిలో కొన్ని నిర్వాహకులకే (మీకే) కనిపిస్తాయి, నాలాంటి వారికి కనిపించవు.__ చదువరి (చర్చ • రచనలు) 06:03, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
పరిశీలించాను.అవును. యర్రా రామారావు (చర్చ) 06:11, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, ముందు config అనే లింకు నొక్కండి. అప్పుడు తెరుచుకున్న పేజీలో పొడుగాటి ఫారం ఒకటి రావాలి అది వచ్చిందో లేదో చెప్పండి (నాకు రాలేదు). ఆ తరువాత ఒకసారి అన్ని లింకులూ పనిచేస్తున్నాయో లేదో చూడండి.__ చదువరి (చర్చ • రచనలు) 05:16, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు మిగతా లింకులను పరీక్షించేటపుడు - డయలాగ్ బాక్సు తెరుచుకుంటే చాలు. ఆ పై ముందుకు వెళ్ళనక్కరలేదు.__ చదువరి (చర్చ • రచనలు) 05:18, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@చదువరి గారూ స్క్రీన్ షాట్ పంపాను యర్రా రామారావు (చర్చ) 05:25, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari గారు, మీరు చెప్పిన కొత్త.Twinkle ట్యాబు కనిపిస్తోంది. మెనూలో 12 లింకులు ఉన్నాయి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:15, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Pranayraj1985 గారూ, ముందు config అనే లింకు నొక్కండి. అప్పుడు తెరుచుకున్న పేజీలో పొడుగాటి ఫారం ఒకటి రావాలి అది వచ్చిందో లేదో చెప్పండి (నాకు రాలేదు). అలాగే ఆ మెనూలో ఏమేం లింకులున్నాయో కూడా చెప్పండి.
ఆ తరువాత ఒకసారి అన్ని లింకులూ పనిచేస్తున్నాయో లేదో చూడండి. డయలాగ్ బాక్సు తెరుచుకుంటే చాలు. ఆ పై ముందుకు వెళ్ళనక్కరలేదు.__ చదువరి (చర్చ • రచనలు) 05:17, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari గారు, config అనే లింకు నొక్కాను, వేరే పేజీ ఓపెన్ అయ్యింది. కానీ, అందులో ఫారం కనిపించలేదు. మెనూలో ఇంకులన్నీ చెక్ చేసాను. అన్నీ పనిచేస్తున్నాయి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:42, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Pranayraj1985 ంగార్ ధన్యవాదాలు.__ చదువరి (చర్చ • రచనలు) 05:44, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@ప్రణయ్ రాజ్ గారు మెనూలో 12 లింకులు ఉన్నాయి అని అన్నారు, నాకు వ్యాసంపేజీలో 8, వ్యాస చర్చాపేజీలో 3, వాడుకరి చర్చాపేజీలో 13 ఐటమ్సు కనపడుతున్నవి యర్రా రామారావు (చర్చ) 06:17, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ట్వింకిల్, వేరువేరు పనుల కోసం అనేక మూసలను వాడుతుంది. ఇంగ్లీషులో 600 పైనే ఉన్నాయి. మన దగ్గర దాదాపు 500 ఉన్నాయి. అయితే మన దగ్గర అవసరం లేనివి కూడా ఉన్నాయి. ఇంగ్లీషు వికీలో అనే వర్గంలో ఉన్న మూసలన్నిటినీ దిగుమతి (వీటిలో కొన్ని మన దగ్గర ఉన్నాయి. వాటిని ఓవెర్‌రైటు చేద్దాం) చేసుకుందాం. మన దగ్గర ఉన్న్ వర్గం వర్గం:Templates used by Twinkle ఇది ఇంగ్లీషు వర్గానికి అనుసంధానమై ఉంది. నిర్వాహకులెవరైనా ఇంగ్లీషులో ఉన్న వర్గాలన్నిటినీ దిగుమతి చెయ్యవలసినది. దిగుమతి చేసాక, గతంలో మనం చేసుకున్న అనువాదాలను పునరుద్ధరించాలి__ చదువరి (చర్చ • రచనలు) 04:40, 7 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@రవిచంద్ర గారూ, కింది పేజీలను కూడా దిగుమతి చెయ్యండి:
  1. Mediawiki:Gadget-morebits.js
  2. Mediawiki:Gadget-morebits.css
  3. Mediawiki:Gadget-friendlyshared.js
  4. Mediawiki:Gadget-friendlytag.js
  5. Mediawiki:Gadget-friendlywelcome.js
  6. Mediawiki:Gadget-twinklefluff.js
  7. Mediawiki:Gadget-friendlytalkback.js
  8. Wikipedia:Twinkle/Preferences
__ చదువరి (చర్చ • రచనలు) 05:04, 7 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ఇవి కూడా దిగుమతి చేశాను. - రవిచంద్ర (చర్చ) 14:29, 7 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@రవిచంద్ర గారూ, సమస్య పరిష్కారం కానట్టుంది. మరిన్ని వివరాలు చూడాలి. నేను చూ, మీకు చెప్పడం, మీరు చెయ్యడం.. దీనికి టైం పడుతోంది. మీరే వెతికి సమస్య ఎక్కడుందో చూడండి. ఒకవేళ మీకు కుదరని పక్షంలో నాకు తాత్కాలికంగా ఇంటర్ ఫేస్ నిర్వాహకుడు హోదా ఇవ్వండి. నేను చూస్తాను.__ చదువరి (చర్చ • రచనలు) 17:59, 7 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అలా చేస్తే బాగుంటుంది, యిద్దరూ పరిశీలించి తెలుసుకోవటానికి వీలుగా ఉంటుంది. యర్రా రామారావు (చర్చ) 02:21, 8 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@రవిచంద్ర గారూ, నేను నా జావాస్క్రిప్టు ఫైలులో మార్పులు చేసి చూసాను. పనిచేసింది. ట్వింకిల్ ట్యాబు కనిపించింది. అన్ని విశేషాలూ పనిచేస్తున్నాయి (అంటే, మెనూను నొక్కినపుడు చూపించాల్సిన డయాలాగ్ బాక్సులను, వాటి లోని ఫీల్డులతో సహా చూపిస్తోంది. నేను ఆపై యాక్షన్ పార్టుకు పోలేదు.) నాకు అర్థమైనంతలో ఇక్కడ జరిగిన లోపం ఏంటంటే.. Twinkle Preferences ను నొక్కినపుడు Wikipedia:Twinkle/Preferences కు కాకుండా Commons:Twinkle/Preferences అనే పేజీకి పోతోంది. అంచేత ట్వింకిల్ అభిరుచులు సెట్‌ కాలేదు. అది ఒక ముఖ్యమైన సమస్య (బహుశా అది ఒక్కటే సమస్య అయి ఉండవచ్చు కూడా). పోతే, కాన్ఫిగ్ పేజీలోని డేటా అంతా హార్డ్‌ కోడెడుగా కనిపిస్తోంది. అందువలన లోకలైజేషను చేసినపుడు తెలుగు లేబుళ్ళు ఇక్కడికి రాకపోవచ్చు (మన ప్రస్తుత సమస్య ఇది కాదు). మీరే చేస్తే పై మార్పు చేసి చూడండి. అది పనిచెయ్యకపోతే, ఇంకా సమస్యలున్నాయేమో చూడండి. ఒకవేళ నాకు అనుమతులివ్వాలని భావిస్తే, ఇంటర్‌ఫేసు అడ్మిన్‌తో పాటు, ట్రాన్స్‌వికీ దిగుమతిదారు అనుమతి కూడా ఇవ్వండి.__ చదువరి (చర్చ • రచనలు) 10:27, 8 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@చదువరి గారూ, మీకు ఒక వారం పాటు ఇంటర్‌ఫేసు అడ్మిన్ అనుమతి ఇచ్చానండీ. ట్రాన్స్ వికీ దిగుమతి దారు అనుమతి మాత్రం నేను ఇవ్వలేనని చెబుతోంది. అది కావాలంటే నేను దిగుమతి చేయగలను. క్షమించాలి. నేను సమయం లేక పరిశీలించలేక పోతున్నాను. - రవిచంద్ర (చర్చ) 15:41, 8 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@రవిచంద్ర గారూ, మరొక పద్ధతి, మెరుగైన పద్ధతి ఏంటంటే, Github నుండి నేరుగా స్థాపించుకోవడం. మీరు దీన్ని చూసే ఉండవచ్చు బహుశా. అయితే దీని ద్వారా స్థాపించాలంటే నాకు కాస్త గీకు పరిజ్ఞానం కావాలనుకుంటాను. మానవికంగా చేసేది కాకపోతే అప్పుడు అది ప్రయత్నించవచ్చు. మానవికంగా చెయ్యగలిగినా కూడా ఆ తరువాత ఆ మెరుగైన పద్ధితికి మారితేనే మంచిది.. అది ఫ్యూచర్-ప్రూఫ్ అనుకుంటాను.__ చదువరి (చర్చ • రచనలు) 10:34, 8 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

తెలుగు వికీపీడియా: విస్తరణ ప్రణాళిక-2027

సభ్యులకు నమస్కారం

తెలుగు వికీపీడియా వ్యాసాలు, వ్యాసాల నాణ్యతను విస్తరించడానికి, గూగుల్ ఇప్పుడు అంటే 2025-26 సంవత్సరాలకి అందిస్తున్న సహకారానికి కొనసాగింపుగా, తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ తరపున రాబోయే 2027 సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదన సమర్పించవలసి ఉంది. వివరాలు ఈ పేజీలో చూడగలరు. చూసి తమ అభిప్రాయాన్ని త్వరలో తెలియచేయగలరు.

ధన్యవాదాలు. తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్. V.J.Suseela (చర్చ) 04:05, 2 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

అలాగేనండీ @Vjsuseela గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:49, 2 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

అధికారులు కావాలి

మనకు నలుగురు అధికారులుండేవారు. వారిలో ఇద్దరికి, జూన్ 11 న ఆ అనుమతులను తీసేసారు- కారణం తెలీదు. ఆ పని చేసింది, మెయింటెనెన్స్ స్క్రిప్ట్ అనే ఆటోమాటిక్ వాడుకరి.

ప్రస్తుతం మనకు ఇద్దరే అధికారులున్నారు. మామూలుగా అయితే, మనలాంటి వికీకి ఇద్దరు సరిపోతారు. కానీ వాళ్ళలో ఒకరు చాలాకాలంగా చురుగ్గా లేరు. మిగిలిన ఆ ఒక్కరు చురుగ్గా లేని పక్షంలో పనులు ఆగుతాయి. అంచేత కనీసం మరొక్కరు అధికారిగా ఉండాలనేది నా ప్రతిపాదన. ప్రస్తుతం చురుగ్గా ఉన్న నిర్వాహకుల్లో ఒకరు అధికారిగా స్వీయ ప్రతిపాదన చేసుకోవడం ఒక మార్గం. లేదంటే, ఇటీవల తొలగింపుకు గురైన ఆ ఇద్దరు అధికారుల్లో కనీసం ఒకరు, ఇకపై చురుగ్గా పనిచేస్తామని సముదాయానికి విశ్వాసం కలిగిస్తే, వాళ్ళు తిరిగి ప్రతిపాదన చేసుకోవడం. పరిశీలించవలసినది.__ చదువరి (చర్చ • రచనలు) 05:21, 3 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

పనులుకు అంతరాయం లేకుండా ఉండాలంటే అదనంగా ఇప్పుడు ఉన్న ఇద్దరు కాకుండా మరో ఇద్దరు అధికారులు తప్పనిసరిగా, అత్యవసరంగా స్యీయప్రతిపాదన చేసుకోవటానికి ముందుకురావాలి. వారే నిర్వాహకత్వ బాధ్యతలకు కూడా స్వీకరించాలి. యర్రా రామారావు (చర్చ) 05:42, 3 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అవునండీ @Chaduvari గారు. మూసలు దిగుమతి చేయాలని ప్రత్నించినపుడు, మెయింటెనెన్స్ స్క్రిప్ట్ అనే ఆటోమాటిక్ వాడుకరి నా అధికారి హోదా అనుమతులను తీసేసారని గమనించాను. ఎందుకు తీసేసారనే కారణం తెలియలేదు. అనుమతులను తీసేయడానికి ముందు నోటీస్ లాంటిది ఇచ్చుంటే బాగుండేది. అయితే, ఇకపై నేను అధికారిగా చురుగ్గా పనిచేయాలనుకుంటున్నాను. నేను తిరిగి అధికారి హోదా పొందడానికి సభ్యులు సహకరించాలని కోరుతున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:35, 3 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Pranayraj1985 గారు గత నెలలో 22 నిర్వాహక పనులు చేసినట్లు చూసాను. + ఇకపై చురుగ్గా ఉంటానని చెబుతున్నారు. కాబట్టి ఆయన తిరిగి అధికారి అవడంలో నాకు అభ్యంతరం లేదు.__ చదువరి (చర్చ • రచనలు) 01:20, 4 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@ప్రణయ్ రాజ్ గారు తిరిగి అధికారిగా కొనసాగటానికి నాకు అభ్యంతరంలేదు. ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 03:37, 5 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari, @యర్రా రామారావు గార్లు ధన్యవాదాలు. అధికారి హోదా కోసం మళ్ళీ స్వీయ ప్రతిపాదన చేసుకుంటాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:07, 7 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

తెవికీ వర్గాల నామకరణ సమస్యలు-ప్రాథమిక అభిప్రాయాల సేకరణ

ఈ చర్చలో చర్చ కొరకు వర్గాలు/వర్గాల సంస్కరణ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయటానికి వారం రోజులు గడువు ముగుస్తుంది. ఇంకా ఆసక్తిఉన్న తెవికీ సమూహం సభ్యులు వెంటనే వారి అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు రాయగలరు, వాటి అన్నిటినీ క్రోడీకరించి విధాన నిర్ణయ చర్చాపేజీని మరలా సముదాయం దృష్టికి తీసుకునిరావటానికి సహకరించగలరు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:54, 3 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

అలాగేనండీ @యర్రా రామారావు గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:41, 3 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

యూజర్‌ ఇంటర్‌ఫేసులో వాడుకరుల కృషికి లింకులు

తెవికీలో మనం చేసే దిద్దుబాట్ల పేజీకి ఇచ్చే లింకులు రకరకాలుగా ఉన్నాయి.

  • వాడుకరి డ్రాప్‌డౌను జాబితాలో "నా మార్పులు" అని ఉంది.
  • వాడుకరి, వాడుకరి చర్చ పేజీల్లో ఉండే సైడుబారులో ఇది "వాడుకరి రచనలు" అని ఉంది
  • మన దిద్దుబాట్లను చూపే పేజీ శీర్షికలో "ఫలానావాడుకరి కు వాడుకరి రచనలు" అని ఉంది.

వీటలో మార్పులు, రచనలు వగైరాలను ఒకే పేరుకు తేవాలి అని భావించి, వాటిని కింది విధంగా మారుద్దామని నా ప్రతిపాదన.

  • నా మార్పులు - తోడ్పాట్లు
  • వాడుకరి రచనలు: వాడుకరి తోడ్పాట్లు
  • ఫలానావాడుకరి కు వాడుకరి రచనలు - ఫలానావాడుకరి కు వాడుకరి తోడ్పాట్లు

వీటిపై అభిప్రాయం రాయవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 09:52, 3 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

నమస్కారం @Chaduvari గారు,
వాడుకరి "మార్పులు" లేదా "రచనలు" అనే పదాల కంటే "తోడ్పాట్లు" అనే పదం మరింత సముచితంగా ఉంటుంది. వికీపీడియాలో కేవలం వ్యాసాలు రాయడమే కాకుండా, దిద్దుబాట్లు చేయడం, వ్యాకరణ దోషాలు సరిదిద్దడం, చిత్రాలు చేర్చడం వంటి ఎన్నో రకాల పనులు జరుగుతుంటాయి కాబట్టి, వీటన్నింటికీ "తోడ్పాట్లు" అనేది చక్కని పర్యాయపదం. ప్రస్తుతం డ్రాప్‌డౌన్ మెనూలో ఒకటిగా, సైడ్‌బార్‌లో మరొకలా, పేజీ శీర్షికలో వేరేలా ఉండటం వల్ల కొత్త వాడుకరులకు కాస్త గందరగోళంగా అనిపించవచ్చు. మీ సూచన ప్రకారం అన్నిచోట్లా ఒకేపేరు ఉంటే ఇంటర్‌ఫేస్ చాలా స్పష్టంగా, ఒకే ప్రమాణంతో కనిపిస్తుందని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:08, 3 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ఇక్కడఒక వివరణ ఇవ్వాలి.. తోడ్పాటు అనేది ఎక్కడ చూసినా ఏకవచనం గానే చూస్తాం, తోడ్పాట్లు అనే వాడుకను నేను చూళ్ళేదు. ఇక్కడ కూడా తోడ్పాటు అనేది వాడొచ్చు గానీ, బహువచనంగా ఉంటే ఎక్కడైనా ఏకవచన రూపం అవసరమైనపుడు వీలుగా ఉంటుందని ఇలా రాసాను.__ చదువరి (చర్చ • రచనలు) 01:11, 4 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అందించిన సవరణలు లేదా అందించిన అనే పదంతో కలిపి మరోది ఏమైనా అర్థవంతంగా ఉంటే బాగుంటుంది. లేదా ఇంకా మెరుగైన పదం మన కంటపడేదాకా ఉన్నవాటిని ఏకరూపతగా మార్చటం. యర్రా రామారావు (చర్చ) 03:46, 5 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, "అందించిన సవరణలు" అంటే తోడ్పాట్లే గదా! పైన @Pranayraj1985 గారు చెప్పినట్టు, మనం ఇక్కడ చేసేది సవరణలు మాత్రమే కాదు, చిత్రాలు చేర్చడం వంటి ఇతర పనులు కూడా ఉన్నాయి. తోడ్పాట్లు అనేది వాడుకరుల కృషిని మెరుగ్గా చూపిస్తోంది. పైగా ఇంటర్‌ఫేసులో వాడే పదాలు వీలైనంత క్లుప్తంగా ఉండాలి. అంచేత, ఈ రెంటిలో తోడ్పాట్లు అనేది మెరుగు అనిపిస్తోంది. పరిశీలించండి__ చదువరి (చర్చ • రచనలు) 07:26, 7 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అలాగే కానివ్వండి, నా అభిప్రాయం అర్థవంతమైన పదంతో ఏకరూపత పాటించాలనేదే నా ప్రధాన అభిప్రాయం యర్రా రామారావు (చర్చ) 07:34, 7 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

వ్యాసాలలో మూకుమ్మడిగా వర్గాలు చేర్చే టూల్

ఈ టూల్ గతంలో సృష్టించిన వ్యాసాలకు చేరని వర్గాలు అంటే వికీడేటాకు లింకు కలిపి, ఇంకా వ్యాసంలో చేరని వర్గాలను ఎన్నిటినైనా ఒకే క్లిక్ తో చేర్చటానికి ఈ టూల్ బాగా పనిచేస్తుంది.దీనిని అమర్చుకోవటానికి ఈ దిగువన వివరించబడింది.

  1. ప్రతి యూజరు కామన్ JS పేజీ సృష్టించుకునే అవకాశం ఉంది. లోగడ సృష్టించుకోని వారు ఇప్పుడు సృష్టించుకోవాలి.
  2. ఇది వాడుకరి పేజీకి అన్ని అనుబంధపేజీలులాగనే ఈ పేజీకూడా ఉంటుంది. వాడుకరి:యూజరు పేరు/common.js అని సృష్టించుకోవాలి.
  3. పేజీలో mw.loader.load('//meta.wikimedia.org/w/index.php?title=User:Saroj/CatSync.js&action=raw&ctype=text/javascript'); ఈ లింకును కాపీ చేసి, పేస్ట్ చేయాలి.
  4. లింకును చేర్చిన తరువాత షిప్ట్ కీని నొక్కి పెట్టి రీలోడ్ బటన్ నొక్కండి, లేదా Ctrl-shift-R నొక్కండి (యాపుల్ మాక్‌ బుక్ లో Cmd-shift-R నొక్కండి. ఈ సందేశం కామన్ JS పైన ఉంది పరిశీలించగలరు.
  5. ఏదేని ఒక వ్యాసాన్ని ఎంచుకోండి.
  6. ఆ వ్యాసం పైన చదువు, సవరించు, చరిత్ర వ్యూ టాబ్ మోడ్ లో చివరన ⋮ ఇలా మూడు చుక్కల మీద క్లిక్ చేయండి.
  7. క్లిక్ చేయగానే టూల్ బాక్స్ డ్రాప్ డౌన్ ఆప్సన్లు కనపడతాయి, వాటిలో ఈ టూల్ కు చెందిన Sync categories అనే యాక్షన్ బటన్ ఉంటుంది.
  8. Sync categories క్లిక్ చేసిన వెంటనే ఒక పాప్ అప్ ఆ వ్యాసంలో చేరని వర్గాలను గుర్తించి జాబితాగా మన ముందు పెడుతుంది.
  9. పాప్ అప్ పైన ADD అనే బటన్ మీద క్లిక్ చేయాలి. దానిని క్లిక్ చేయగానే అన్ని వర్గాలు స్యయంచాలకంగా వ్యాసంలోని వర్గాల బార్ లో చేరతాయి, అయితే ఆ వ్యాసం వికీడేటాకు లింకు అయిఉండాలి, చేర్చే వర్గాలు తెలుగు వికీపీడియాలో సృష్టించి వికీడేటాకు లింకు కలిపి ఉండాలి. మనం వికీపీడియాలో ఏదేని వ్యాసం సవరించేటప్పుడు దీని ద్వారా ఆ వ్యాసానికి చేరాలిసిన వర్గాలను చేర్చవచ్చు. దీనిని అందరూ ఉపయోగించుకొనగలరు.

దీనిమీద మీ స్పందనలు తెలియజేయగలరు. ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 12:28, 4 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

బ్రౌజరు కాషె తీసిన తరువాత పని చేస్తోంది అండి. ధన్యవాదాలు. V.J.Suseela (చర్చ) 13:44, 4 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, చాలా ఉపయోగకరమైన టూల్ పరిచయం చేశారు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:26, 4 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అనువాద పరికరంలో ఉన్నట్లే, ఇక్కడ కూడా, ఏ వర్గాలకైతే భాషాలింకులు ఉంటాయొ< ఆ వర్గాలను చూపిస్తుంది. వ్యాసానికి కూడా భాషా లింకులు ఉండాలి. బాగుంది వాడుకరి:యర్రా రామారావు గారు. మీరు ఇలాంటి వాటి గురించి తెవికీబడిలో శిక్షణ ఇస్తే బాగుంటుంది. (అప్‌కోర్స్, నేర్పేందుకు మీరు సిద్ధంగానే ఉన్నా, నేర్చుకోవాలనే ఆసక్తి ఉండి, శిక్షణకు హాజరయ్యే తీరిక ఓపిక ఉన్నవాళ్ళం ఉండాలనుకోండి.)__ చదువరి (చర్చ • రచనలు) 04:37, 5 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@చదువరి గారూ మీ ప్రోత్సాహమే మాకు బలం, ధన్యవాదాలు 🙏 యర్రా రామారావు (చర్చ) 04:40, 5 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, ఈ రచ్చబండను పాత చర్చల లోకి తరలించాక, దీన్ని రిఫరు చెయ్యడం కాస్త కష్టంగా ఉంటుంది. వీటిని వికీపీడియా:వాడుకరులకు సూచనలు వంటి పేజీలో చేరిస్తే బాగుంటుంది. రిఫరెన్సు పరంగా ఇలాంటివి మెరుగైన పేజీలు.__ చదువరి (చర్చ • రచనలు) 04:41, 5 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@చదువరి గారూ ఇందులో నా గొప్పేమీ లేదు. ఇది నేను మరోచోట నుండి సేకరించింది. యర్రా రామారావు (చర్చ) 04:44, 5 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
మీరు చేర్చటానికి నాకేమీ అభ్యంతరం లేదు యర్రా రామారావు (చర్చ) 04:46, 5 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
నాకు తెలుసు మీకు అభ్యంతరం ఉండదని. :-) కానీ, నేను చేర్చను, మీరే చేర్చండి.__ చదువరి (చర్చ • రచనలు) 04:48, 5 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అలాగే సార్ యర్రా రామారావు (చర్చ) 04:54, 5 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, మంచి టూల్ ని తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు 🙏 ✥Srinivasrjy✥(📞talk) 06:40, 5 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@శ్రీనివాస్ గారూ ఎవరో చేసినది సేకరించి మీ ముందు ఉంచాను. యర్రా రామారావు (చర్చ) 06:44, 5 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, మంచి టూల్ గూర్చి తెలియజేసినందుకు ధన్యవాదాలు➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:25, 6 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
చాలా ఉపయోగకరమైన పరికరం. రామారావు గార్కి ధన్యవాదాలు--Rajasekhar1961 (చర్చ) 15:37, 6 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@గురువులు యర్రా రామారావుగారికి ధన్యవాదాలు.. చక్కని టూల్ నేర్పించారు.. ఇలా మరికొన్ని పరిచయం చేస్తే, ఆలస్యంగానైనా (వీలు చూసుకుని) తప్పకుండా నేర్చుకుంటాను -Muralikrishna m (చర్చ) 02:28, 7 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

కొత్త వాడుకరులు, కొన్ని మెరుగుదలలు

@MYADAM ABHILASH: గారూ, మీరు తెవికీలోకి కొత్త వాడుకరులను తీసుకువస్తున్నారని మీరు గతంలో రాసిన సమాచారాన్ని ఆధారం చేసుకుని భావిస్తున్నాను. ఈ విషయంలో మీకు అభినందనలు. అయితే, కొత్తవారికి మొదట్లో తెవికీలాంటి ప్లాట్‌ఫాంలో నేర్చుకోవాల్సింది చాలానే ఉంటుంది. నేను చూసినంతలో వారి వ్యాసాలు సరిదిద్ది, వాటిని ఉదాహరణగా చూపిస్తూ వాడుకరి చర్చ పేజీల్లో ఎలా మెరుగుపరుచుకోవచ్చో రాయాలనుకుంటున్నాను. ఒకరిద్దరితో మొదలుపెట్టాను. ఈ వాడుకరి మీరు తీసుకువచ్చినవారేనా? వాడుకరి_చర్చ:Mamatha123#సూచనలు,_అభినందనలు ఒకవేళ మీరు తీసుకొచ్చినవారే అయితే, వీరి వాడుకరి పేర్ల జాబితా ఏదైనా వికీపీడియా నేమ్‌స్పేస్‌లో కార్యక్రమం గురించి వివరిస్తూ రాస్తారా? అలాగైతే, సహాయం అందించేందుకు వీలుగా ఉంటుంది. --పవన్ సంతోష్ (చర్చ) 11:11, 5 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

@MYADAM ABHILASH గారూ, దయచేసి ఈ అంశం మీద ప్రతిస్పందించండి. పవన్ సంతోష్ (చర్చ) 16:26, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Pavan santhosh.s గారు ఆలస్యంగా స్పందిస్తున్నందుకు చింతిస్తున్నాను. వాడుకరుల జాబితా కొరకు ఈ ఔట్రీచ్ డ్యాష్ బోర్డ్ చూడండి! మీ సహాయానికి ధన్యవాదాలు - అభిలాష్ మ్యాడం (చర్చ) 04:52, 25 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

వికీమీడియా సదస్సులకు హాజరైన వాడుకరులకు

వికీమీడియా ఫౌండేషను, తాను నిర్వహించే ప్రాజెక్టులకు సంబంధించి పలు సదస్సులను నిర్వహిస్తూ ఉంటుంది. తెవికీ తరపున కూడా ఈ సదస్సులకు వాడుకరులు హాజరౌతూ ఉంటారు. అక్కడ వారు అనేక విషయాలు నేర్చుకుంటారు. వారు అక్కడి విశేషాలను, తమతమ అనుభవాలను, తాము నేర్చుకున్న సంగతులనూ తెవికీలో రాస్తే ఆ సదస్సుకు హాజరవని తోటి సభ్యులకు ఉపయోగకరంగా ఉంటుంది. పరిశీలించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 08:19, 7 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

అవును @Chaduvari గారు, అందుకోసం తెవికీలో ప్రత్యేకంగా ఒక వేదిక లాంటిది ఏర్పాటుచేసుకొని అందరూ ఆ వేదికలో రాస్తే బాగుటుంది. ఎవరైనా చూడాలి అనుకున్నా అన్నీ ఒకేచోట లభిస్తాయి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:11, 7 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ఒక వేదిక ఏర్పాటుచేయమని మనవి. సదస్సులకు హాజరైన సభ్యులు ఇందులో వివరాలు, అనుభవాలు రాద్దాము.--Rajasekhar1961 (చర్చ) 11:43, 7 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
మంచి ఆలోచన యర్రా రామారావు (చర్చ) 11:47, 7 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari గారూ, ఈ ఆలోచన నాకు పదేళ్ళ కిందటే వచ్చింది. 2016లో చంఢీగడ్ లో జరిగిన వికీకాన్ఫిరెన్స్ ఇండియా సదస్సుకు వెళ్ళినపుడు అక్కడి విషయాలను క్లుప్తంగా వికీకాన్ఫిరెన్స్ ఇండియా 2016లో తెవికీబృందం అని నా ప్రయోగశాలలో రాసుకున్నాను. తరువాత దానిని వివరణాత్మకంగా రాయాలి అనుకున్నా కుదరలేదు. ఇకపై నేను హాజరయ్యే వికీమీడియా సదస్సుల గురించి తప్పకుండా రాస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:15, 7 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Pranayraj1985 గారూ, సమగ్రంగా రాసారు, బాగుంది. మీరు దీనికి ఆద్యులు కాబట్టి, మీరే ఆ వేదికను మొదలుపెట్టి రాయండి.
ఎప్పటివో ఇప్పుడెందుకు అనుకోకుండా, పాతవాటి గురించి కూడా గుర్తున్నంతలో రాద్దాం. ఈ పేజీ వికీపీడియా పేరుబరిలో ఉంటుంది. దానికి ఉపపేజీలుగా ఒక్కో సదస్సు గురించి రాస్తాం. ఉదాహరణకు:
  • ప్రధానపేజీ: వికీపీడియా:వికీమీడియా సదస్సులు
  • ఉపపేజీ: వికీపీడియా:వికీమీడియా సదస్సులు/2016 వికీ కాన్ఫరెన్స్ ఇండియా, చండీగఢ్
ఈ ఉపపేజీ లింకులను ప్రధానపేజీలో పెడతాం. ఒకరి కంటే ఎక్కువ మంది హాజరైనపుడు, అదే ఉపపేజీలో వేరువేరు విభాగాల్లో తమ అనుభవాలను రాస్తారు. ఏమంటారు? అవసరమనుకుంటే ప్రధాన పేజీకి మరింత మెరుగైన పేరు పెట్టండి.__ చదువరి (చర్చ • రచనలు) 05:04, 8 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ధన్యవాదాలు @Chaduvari గారు, మీరు సూచించనట్టుగానే పేజీని పెడుదాం. అయితే, 'వికీపీడియా:వికీమీడియా సదస్సులు' అని పెడితే, వికీ సదస్సుల వివరాలు ఉండే పేజీ అనుకునే అవకాశం ఉంది. అయితే మనం రాసేది వికీ సదస్సుల వివరాలే కాబట్టి ఆ పేరు సరిపోతుంది. కానీ మనం వాడుకరుల అనుభవాలు కూడా రాస్తున్నాం కనుక 'వికీపీడియా:వికీమీడియా సదస్సులు-వాడుకరుల అనుభవాలు', 'వికీపీడియా:వికీమీడియా సదస్సుల అనుభవాలు', లాంటి పేర్లు ఉంటే బాగుంటుందేమో, ఇతర సభ్యుల అభిప్రాయాలు రాసాకా పేజీ పెడుదాం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:28, 8 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
సూపర్, @Pranayraj1985 గారూ, మీరు చెప్పినదే కరెక్టు. అలాగే పెడదాం.__ చదువరి (చర్చ • రచనలు) 07:40, 8 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@ప్రణయ్ రాజ్ గారు సూచించిన పైరెండు పేర్లు అర్థవంతంగానే ఉన్నవి. ఏదైనా పర్వాలేదనిపిస్తుంది. యర్రా రామారావు (చర్చ) 07:48, 8 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Pranayraj1985 గారూ, పేజీ ఒపెట్టెసి రాసెయ్యండి సార్. అంతగా అయితే, ఆ తరువాత తరలించుకోవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 11:53, 8 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ఆలోచన చాలా బావుంది. 'వికీపీడియా:వికీమీడియా సదస్సులు-వాడుకరుల అనుభవాలు' పేరు సమగ్రంగా ఉంది.--V.J.Suseela (చర్చ) 13:20, 8 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari, @Rajasekhar1961, @యర్రా రామారావు, @Vjsuseela గార్లకు... వికీపీడియా:వికీమీడియా సదస్సుల అనుభవాలు అని ప్రధాన పేజీ సృష్టించాను. పరిశీలించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:24, 8 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ధన్యవాదాలు.@ప్రణయ్ రాజ్ గారూ ఈ మధ్యకాలంలో అలా వెళ్లినవారు మీ దృష్టిలో ఉంటే వారి వాడుకరి చర్చాపేజీలో కోరగలరు. యర్రా రామారావు (చర్చ) 13:58, 8 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, ఇటీవల జరిగిన వికీ కాన్ఫరెన్స్ ఇండియాలో పాల్గొన్న తెవికీ సభ్యుల చర్చాపేజీలో రాశాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:50, 8 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/ప్రణయ్‌రాజ్-2

సభ్యులకు నమస్కారం, మీ అందరి మద్దతుతో 2023 జూలైలో నేను తెలుగు వికీపీడియా అధికారి హోదా పొంది, బాధ్యతలు నిర్వర్తించాను. 2025 ఏప్రిల్ నుండి 2026 ఆగస్టు వరకు 16 నెలలపాటు నా వ్యక్తిగత కారణాల వల్ల తెవికీ నిర్వహణలో క్రియాశీలకంగా పని చేయలేకపోయాను.

మెయింటెనెన్స్ స్క్రిప్ట్ అనే ఆటోమాటిక్ వాడుకరి, వికీలో క్రియాశీలకంగా లేని అధికారులును తొలగించే క్రమంలో 2026 జూన్ 11న నా అధికార అనుమతులను కూడా తీసేసారు. అయితే, ఇకపై నేను అధికారిగా చురుగ్గా పనిచేయాలనుకుంటున్నాను కాబట్టి, తెవికీ నిమయాలను అనుసరించి నేనే మళ్ళీ అధికార హోదా కొరకు విజ్ఞప్తి చేస్తూ వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/ప్రణయ్‌రాజ్-2 పేరున మరో ఉపపేజీ తయారుచేశాను. ఆ ఉపపేజీని పరిశీలించి 2026 అక్టోరు 15వ తేదిలోపు తమ మద్దతును తెలుపవలసిందిగా సముదాయ సభ్యులను కోరుతున్నాను. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:51, 8 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

  1. :సరే నండి. V.J.Suseela (చర్చ) 09:37, 8 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
  2. హండ్రెడ్‌ వికీడేస్‌ చాలెంజ్‌ టైటిల్ విన్నర్ పవన్‌ సంతోష్‌ గారు ఆదర్శంగా పది సంవత్సరాలు ప్రతి రోజూ ఒక ఆర్టికల్‌ రాసిన ఘనత సాధించిన మీకు ముందుగా శుభాకాంక్షలు. అదే స్పూర్తితో నేను రోజుకో వ్యాసం రాస్తూ ఐదవ సంవత్సరంలో కొనసాగుతున్నాను. అధికార హోదా కొరకు ప్రణయ్ రాజ్ 2.O గారికి నా సంపూర్ణ మద్దతు - Muralikrishna m (చర్చ) 01:39, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
    బావుందండి. అభినందనలు. V.J.Suseela (చర్చ) 07:07, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
    ధన్యవాదాలు మేడం గారు..! Muralikrishna m (చర్చ) 08:39, 10 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

కొత్త ట్వింకిల్

కొత్త ట్వింకిల్ గాడ్జెట్ స్థాపన పూర్తయింది. అందరికీ అది అందుబాటులో ఉంది. దానికి గుర్తు ఏంటంటే..

  1. . పైన ఉండే పేజీ లింకుల చివర TW అనే అనే లింకు పక్కన డౌన్ యారోతో కనిపిస్తుంది. దాన్ని నొక్కితే మెనూ కనిపిస్తుంది. పక్కనున్న బొమ్మ చూడండి.
  2. . ఆ మెనూలో ఏయే లింకులు ఉంటాయి అనేది మీరు ఉన్న పేజీని బట్తి ఉంటుంది. అంటే వ్యాసం పేజీలో ఉండే మనూకు, వాడుకరి పేజీలో ఉండే మెనూకూ తేడా ఉంటుందన్న మాట.
  3. . ఆ మెనూ లోని లింకులను నొక్కినపుడు, సంబంధిత పనికి సంబంధించిన పేజీ తెరుచుకుంటుంది (ఉదా: config) లేదా డయలాగు పెట్టె తెరుచుకుంటుంది (ఉదా:CSD)
  4. . config నొక్కినపుడు, కాన్ఫిగరేషను పేజీ తెరుచుకుంటుంది. అందులో పొడుగాటి కాన్ఫిగ్ ఫారము తెరుచుకుంటుంది. అందులో మీ సెట్టింగులను పెట్టుకోవచ్చు. ఆ ఫారానికి దిగువన ఉన్న Save changes బొత్తాన్ని నొక్కినపుడు ఆ సెట్టింగులు మీ స్వంత twinkleoptions.js అనే పేజీలో సేవవుతాయి. ఆ సెట్టింగులను మార్చుకున్నపుడల్లా ఆ పేజీలో సేవవుతూ ఉంటాయి.

రవిచంద్ర గారూ, యర్రా రామారావు గారూ, ప్రణయ్ రాజ్ గారూ కాన్ఫిగ్ లింకును కూడా పరీక్షించండి. ఈ పనిలో పాల్గొన్న మీకు ధన్యవాదాలు. __ చదువరి (చర్చ • రచనలు) 07:55, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

@చదువరి గారూ ఎంతో కాలం నుండి మూలనపడ్డ ట్వింకిల్ ఆప్షన్స్ శ్రమ తీసుకుని పునరుద్ధరణ గావించినందుకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 09:08, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
డైలాగ్ పెట్టెలు తెరవడం వరకూ ఫంక్షనాలిటీ పనిచేస్తోంది. కానీ అక్కడి నుండి ముందుకు పోతే లోపం తలెత్తుతోంది. దాదాపుగా అన్నీ కూడా ఒకే లోపం. చాట్‌గుప్తా గారిని అడుగుతున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 10:02, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ఇది కూడా పరిష్కారమైంది. నేను రెండు మూడు పరీక్షలు చేసాను, బాగానే పని చేసాయి. మీరు కూడా పరీక్షించండి. సమస్యలుంటే ఇక్కడ రాయండి.__ చదువరి (చర్చ • రచనలు) 10:27, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అలాగేనండీ @Chaduvari గారు, ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:49, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
స్వాగత మూస, PROD ట్యాగులను చేర్చినపుడు అవి పనిచేయడం లేదు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:52, 10 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
నాకు కూడా పలుమార్లు ప్రయత్నం చేసినా ఫలించలేదు యర్రా రామారావు (చర్చ) 14:59, 10 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, ఏది ఫలించలేదు? మిగతావి కూడా పరీక్షించారా? కొంచెం వివరంగా రాయవలసినది.__ చదువరి (చర్చ • రచనలు) 15:07, 10 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@చదువరి గారూ నేను కొత్తవాడుకరికి వాడుకరి చర్చ:Palle Bheemsen స్వాగత సందేశం పంపించటానికి WEL చెప్పటానికి ప్రయత్నించగా {{subst:undefined}} అనే మూస చేరుతుంది. గతంలో మనకు వచ్చే సందేశం రాలేదు. ఒకవేళ నేను ఏమైనా తప్పు చేసానా? యర్రా రామారావు (చర్చ) 15:12, 10 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ wel నొక్కినపుడు వచ్చిన డయలాగ్ పెట్టెలో ఏ మూసను ఎంచుకున్నారు?__ చదువరి (చర్చ • రచనలు) 15:23, 10 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, మీ సమాధానం కోసం చూస్తున్నాను. అదే పేజీలో నేను స్వాగత సందేశం పెట్టాను. నాకు లోపం తలెత్తలేదు. __ చదువరి (చర్చ • రచనలు) 16:28, 12 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, మీరు సమాధానం రాసే లోగా నేను మీ twinkleoptions.js ను చూసాను. అందులో మీరు welcome చేసేందుకు ఒక మూస పేరు కనబడలేదు నాకు. వికీపీడియా:Twinkle/Preferencesపేజీ తెరిచి అందులో వికీపీడియా:Twinkle/Preferences అనే చోట స్వాగతం మూస పేరు ఇవ్వండి. సేవ్ చేసి అప్పుడు మళ్ళీ ప్రయత్నించండి.
మిగతా విశేషాలు పరీక్షించారో లేదో, అవి పనిసేస్తున్నాయో లేదో మీరు రాయలేదు. వాటి సంగతి కూడా రాయండి.__ చదువరి (చర్చ • రచనలు) 16:53, 12 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@చదువరి గారూ సందేశం ఇవ్వటానికి ఆలస్యం అయినందుకు క్షమించాలి.Type of welcome:Non-English Welcomes అనే ఆప్సన్ ఎన్నుకున్నాను.వాడుకరి చర్చాపేజీలో ఇలా వస్తుంది. {{subst:welcomeen}} ఈ మూసలో welcomeen చివరి en ను తొలగిస్తే అప్పుడు మామూలుగా ఆహ్వాన సందేశ చూపిస్తుంది. వికీపీడియా:Twinkle/Preferencesపేజీ తెరిచి అందులో వికీపీడియా:Twinkle/Preferences అనే చోట స్వాగతం మూస పేరు ఇవ్వండి. ఈ మార్పులు నేను చేయలేకపోయాను. యర్రా రామారావు (చర్చ) 03:36, 13 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, Type of welcome లో Non-English Welcomes అనేది ఎంచుకున్నారా? బహుశా అదే సమస్యబయి ఉండవచ్చు. ఇతర మెనూ అయిటములు పని చేస్తున్నాయో లేదో చూడండి. అన్నీ పరీక్షించండి సార్.__ చదువరి (చర్చ • రచనలు) 04:35, 13 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు మస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరిద్ధాం సార్.__ చదువరి (చర్చ • రచనలు) 04:37, 13 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@చదువరి గారూ కాస్త సమయం పడుతుంది, నేను సందర్బాన్నిబట్టి పరీక్షించి ఒకచోట నోట్ చేసి చర్చలో ప్రవేశపెడతాను. గతంలో డైలాగ్ బాక్స్ లో ఎంపికలు ఎంచుకునే పనిలేదు. నేరుగా WEL క్లిక్ చేసి SUBMIT నొక్కగానే సందేశం చూపించేది. అది ఎవరికైనా సులభంగా ఉండేది. యర్రా రామారావు (చర్చ) 05:08, 13 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
సర్లే @సార్.__ చదువరి (చర్చ • రచనలు) 05:13, 13 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@K.Venkataramana గారూ స్వాగతం పనిచేసింది. తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (ద-ధ) అనే పేజీలో csd, prod రెండూ పెట్టాను. ఇప్పుడు ఆ పేజీని రామారావు గారు తొలగించారు. మిగతావి కూడా పరీక్షించవలసినది.__ చదువరి (చర్చ • రచనలు) 15:09, 10 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
యర్రా రామారావు గారూ wel నొక్కినపుడు {{subst:undefined}} అని వస్తుంది. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 07:49, 11 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@K.Venkataramana గారూ, wel నొక్కినపుడు వచ్చిన డయలాగ్ బాక్సులో ఏ వికల్పాన్ని ఎంచుకున్నారు?__ చదువరి (చర్చ • రచనలు) 16:25, 12 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@K.Venkataramana గారూ, మీ వాడుకరి:K.Venkataramana/twinkleoptions.js పేజీని ఇంకా సృష్టించలేదు. మీరు వికీపీడియా:Twinkle/Preferences పేజీలో ఉన్న ఫారంలో వికల్పాలను ఎంచుకుని సేవ్ చేంజెస్ నొక్కండి. అప్పుడు వాడుకరి:K.Venkataramana/twinkleoptions.js పేజీ ఉనికి లోకి వస్తుంది. అప్పుడు మళ్ళీ ట్వింకిల్ మెనూను పరీక్షించండి.__ చదువరి (చర్చ • రచనలు) 16:39, 12 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అందరికీ ఒక విన్నపం. ట్వింకిల్ పనిచేస్తోంది. దానికి గుర్తు - ప్రతి పేజీ లోనూ TW అనే ట్వింకిల్ ట్యాబు కనిపిస్తుంది.
  • దాని కింద మెనూ ఉంటుంది. ఆ మెనూ లో ఉండే ఐటములు పేజీని బట్టి మారుతాయి. వ్యాసం పేజీలో కొన్ని ఐటములుంటే, వాడుకరి పేజీలో వేరే ఐటములుంటాయి.
  • ఆ మెనూ ఐటముల్లో చివర config అనే ఐటము ఉంటుంది.
  • ముందు దాన్ని నొక్కి, అప్పుడు వచ్చే పేజీలోని ఫారములో మీ అభిరుచులను ఎంచుకోండి. welcome అనే విభాగంలో కొత్త వాడుకరులని స్వాగతించే మూస పేరును ఇవ్వండి.
  • ఆ ఫారాన్ని భద్రపరచండి.
  • ఇక ఏదో ఒక పేజీ తెరిచి, మెనూ లోని అంశాలను పరీక్షించండి. (పరీక్షించే ముందు, మెనూ ఐటము ఏం పని చేస్తుందో తెలుసుకుని, అది సరైన పని అయితేనే పరీక్షించండి.)
ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ రాయండి. ముఖ్యంగా ఇబ్బందులు ఎదురైతే తప్పకుండా రాయండి.__ చదువరి (చర్చ • రచనలు) 17:02, 12 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
వాడుకరి:యర్రా రామారావు, User:Pranayraj1985, వాడుకరి:K.Venkataramana గార్లకు - కొత్త ట్వింకిల్‌లో చేసిన పరీక్షల వివరాలను వికీపీడియా చర్చ:ట్వింకిల్/కొత్త ట్వింకిల్ 2026 పేజీలో రాయవలసినది. __చదువరి (చర్చ • రచనలు) 06:21, 13 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అలాగేనండీ యర్రా రామారావు (చర్చ) 06:51, 13 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అలాగేనండి @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:35, 13 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

(Apologies for cross-posting in English, translating it will help spread the message)

Earlier last month, all Wikis were contacted for feedback on our proposal to remove language link changes, this change has already been deployed to Wikisource, Wikibooks, Wikivoyage, Wikiquote, Wikiversity and Wiktionary.

The same change is now being rolled out globally to all Wikipedias on October 13, 07:00 UTC. Editors will no longer see notifications after this time on their Recent Changes and Watchlist when a link to another language version of a page is added, removed, or changed in its Wikidata item (it does not affect language link notifications to the home wiki). There will then be a two-week monitoring period to observe if a reduction of high-volume but low-value notifications takes place, or if higher-value changes become easier to identify. Editors who rely on these notifications should be aware of the change and can share feedback or concerns on the Wikidata For Wikimedia Projects talk page.
Wikidata's own Recent Changes page is not affected as it serves as the repository for these changes.

Please reach out if you have any questions, or if your wiki would like to opt-out, thank you! -- Danny Benjafield (WMDE) (talk) sent via MediaWiki message delivery (చర్చ) 09:29, 9 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

నాకు ఇచ్చిన ఎక్స్టెండెడ్ అనుమతులు

వాడుకరి:రవిచంద్ర గారూ, కొత్త ట్వింకిల్‌ స్థాపన పూర్తైంది. నాకు ఎక్స్టెండెడ్ అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పరీక్షల్లో అన్ని మెనూలూ పనిచేస్తున్నై. అయితే, కొన్ని మెనూలు నిచెయ్యడం లేదని కొందరు అన్నారు. అవి పనిచెయ్యకపోవడానికి కారణం, ట్వింకిల్ లోపం కాదని నేను అనుకుంటున్నాను. పరీక్షలో వివిధ వికల్పాలను ఎంచుకుని చూడడానికీ, అలాగే అన్ని అంశాలనూ పరీక్షించడానికీ ఇంకా సమయం పట్టేట్టుంది. అవన్నీ చేసాకనే సమస్యపై స్పష్టత వస్తుంది. అప్పుడు మీడియావికీ పేజీల్లో మార్పులెమైనా చెయ్యాల్సి వస్తే, నాకు మళ్ళీ ఎక్స్టెండెడ్ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. లేదా ఇప్పుడే పొడిగించాలి. గమనించవలసినది. ధన్యవాదాలు.__చదువరి (చర్చ • రచనలు) 06:27, 13 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

కొంతకాలం పొడిగిస్తేనే మంచిదని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 08:01, 13 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
మళ్ళీ ఎక్స్టెండెడ్ అనుమతులు ఇవ్వడం కంటే, ఇప్పుడిచ్చిన అనుమతుల కాలం పొడగిస్తే సరిపోతుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:38, 13 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ఇదే సమయంలో @చదువరి గారు అవకాశం ఉంటే ట్వింకిల్ ఆప్షన్స్ మీద ఒక క్లాస్ తీసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఈ మధ్య కాలంలో ట్వింకిల్ వాడటం తగ్గింది. యర్రా రామారావు (చర్చ) 13:21, 13 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
సరే సార్___ చదువరి (చర్చ • రచనలు) 13:23, 13 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
మీ అంగీకారం తెలిపినందుకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 14:22, 13 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@చదువరి గారు ధన్యవాదాలు. ఈ ఆదివారం వీలవుతుందా? V.J.Suseela (చర్చ) 13:38, 14 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Vjsuseela గారూ, అలాగేనండి.__ చదువరి (చర్చ • రచనలు) 03:57, 15 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari గారూ, మరో నెల రోజులు మీకు ఇంటర్‌ఫేస్ అడ్మిన్ బాధ్యతలు పొడిగించాను. ట్వింకిల్ ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దండి. - రవిచంద్ర (చర్చ) 16:55, 14 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Pranayraj1985, @యర్రా రామారావు,@Vjsuseela, @K.Venkataramana@రవిచంద్ర: Wel, Warn మెనూలు కూడా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ట్వింకిల్ అభిరుచులు సెట్ చేసుకోకపోయినా అవి పనిచేస్తాయి. వాటిని మళ్ళీ పరీక్షించవలసినది. అలాగే ఇతర మెనూలను కూడా మళ్ళీ పరీక్షించండి; తద్వారా ఇప్పుడు చేసిన మార్పుల వలన ఇదివరలో పనిచేసినవి, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయని నిర్థారించుకోవచ్చు. ఫలితాలను, మామూలుగానే వికీపీడియా చర్చ:ట్వింకిల్/కొత్త ట్వింకిల్ 2026 పేజీలో రాయండి. ధన్యవాదాలు. __ చదువరి (చర్చ • రచనలు) 09:06, 15 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ఈ రోజు చూస్తే Wel పనిచేస్తోందండి. ఇంతకు ముందు చేయలేదు. ధన్యవాదాలు. V.J.Suseela (చర్చ) 09:15, 15 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
గతంలో పనిచేసిన విధంగా యిప్పుడు పనిచేస్తుంది. యర్రా రామారావు (చర్చ) 09:19, 15 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ఇప్పుడు Wel, Warn మెనూలు, వ్యాసాలలో tag మెనూ కూడా పనిచేస్తున్నాయి. ఇదివరకు పనిచేయలేదు. ధన్యవాదాలు ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 10:56, 15 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ఎస్‌వి ఇన్ఫో టెక్నాలజీస్ వ్యాసంలో PROD, XFD ట్యాగులను చేర్చాను. వ్యాస పేజీలో, వాడుకరి చర్చా పేజీలో వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఎస్‌వి ఇన్ఫో టెక్నాలజీస్ లింకు వచ్చింది. అదే విధంగా మూసను చేర్చినపుడే వికీపీడియా:Articles for deletion/ఎస్‌వి ఇన్ఫో టెక్నాలజీస్ పేరుతో కొత్త పేజీ సృష్టించబడింది. ఏదైనా ఒకటి ఉండేటట్లు సరిచేయండి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:26, 15 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari గారూ, ఇప్పుడు వాడుకరి పేజీలో Wel, Warn మెనూలు, వ్యాసాలలో tag మెనూ కూడా పనిచేస్తున్నాయి. అయితే, వెల్ కం చెప్పినపుడు నా సంతకం రాలేదు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:41, 15 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Pranayraj1985 గారూ, అది మూస సమస్య అండీ, ట్వింకిల్‌ది కాదు. వెల్కం మూసలు చాలానే ఉన్నాయి గదా, మీరు ఏ మూసను ఎంచుకున్నారో ఒకసారి చూడండి. క్లుప్తస్వాగతం వంటి మూసల్లో సంతకం ఉండదనుకుంటాను.__ చదువరి (చర్చ • రచనలు) 15:04, 15 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@K.Venkataramana గారూ, కొత్త ట్వింకిల్ కోసం అనేక పేజీలను దిగుమతి చేసుకున్నాం. గతం లోని ఫైలులో చేసుకున్న అనేక అనువాదాలను ఈ కొత్త ఫైళ్ళలో తిరిగి చేసుకోవాలి. అవి ఇంకా చెయ్యలేదు. ముందు అన్ని మెనూలు పనిచేసే స్థితికి తెచ్చాక, అనువాదాలు, వికీకరణ, తెవికీకరణ చేద్దామనుకున్నాను.
అలాగే, అనేక మూసలను కూడా దిగుమతి చేసుకోవాల్సి ఉంది. బహుశా వాటిలో కొన్ని మూసలను కూడా అనువదించాల్సి ఉంది. (వాటి అనువాదం నేను ఒక్కడినే చెయ్యలేను. అందరూ తలా ఒక చెయ్యివెయ్యాలి.) అవి కూడా దిగుమతి అయ్యాక, అన్నీ ఒకసారే చేద్దామని అనుకున్నాను.
ప్రస్తుతానికి అన్ని మెనూలు పనిచేస్తున్నట్లే రిపోర్టులు వస్తున్నాయి కాబట్టి, ఇక అనువాదాలు చెయ్యడం మొదలెట్టవచ్చు. ప్రస్తుతం మీరు చూపిన పేజీ పేరును ఎన్వికీ నుండి తెవికీ పేజీ పేరుకు మార్చాను. ఒకసారి మళ్ళీ పరీక్షించి చూడండి.__ చదువరి (చర్చ • రచనలు) 15:34, 15 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
చదువరి గారూ, వ్యాసాలలో XFD ట్యాగు చేర్చినపుడు, వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పెద్ద భాషా నమూనాలు తో పాటు వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/Log/2026 October 16 పేజీలు సృష్టించబడ్డాయి. అందులో వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/Log/2026 October 16 పేజీలో వికీపీడియా:Articles for deletion/పెద్ద భాషా నమూనాలు అని వస్తుంది. దానిని సరిచేయగలరు. వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/Log/2026 October 16 పేజీకి సరైన వర్గం కూడా చేర్చేటట్లు సరిచేయగలరు. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 02:27, 16 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
పి. సుధీర్ కుమార్ వ్యాసంలో XFD ట్యాగు చేర్చినపుడు, వాడుకరి చర్చా పేజీలో Wikipedia:Articles for deletion/పి. సుధీర్ కుమార్ పేజీ లింకు వస్తుంది. దానిని కూడా సరిచేయగలరు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 02:33, 16 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

వికీపీడియా:చేయాల్సిన పనులు - పేజీ సృష్టింపు

తెవికీలో చేయాల్సిన పనులను ఒకే చోట నమోదు చేయడానికి వికీపీడియా:చేయాల్సిన పనులు పేజీని సృష్టించాను. సభ్యులు తమకు తెలిసిన లేదా గుర్తుకు వచ్చిన పనులను ఆ పేజీలో చేర్చవలసిందిగా కోరుతున్నాను. ఇలాంటి పేజీ ఆంగ్ల వికీపీడియాలో కూడా ఉంది. పేజీ నిర్వహణకు అంటే సమాచారం ఎలా చేర్చాలి పట్టికలో లేక ఇతరత్రా మార్గాలు ఏమైనా ఉంటే తెలుపగలరు (en:Wikipedia:To-do list). యర్రా రామారావు (చర్చ) 13:07, 14 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

అలాగే అండి. మొదలు పెట్టాను మెల్లగా. ధన్యవాదాలు V.J.Suseela (చర్చ) 19:44, 14 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అలాగేనండీ @యర్రా రామారావు, ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:41, 15 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ఒక వివరణ:
ఇక్కడ మన సృష్టించుకున్న వికీపీడియా:చేయాల్సిన పనులు పేజీలో చూపిస్తున్నది వేరు, {{To do}} జాబితా, దాని లక్ష్యం, దాన్ని సృష్టించే పద్ధతి ఇవన్నీ వేరు. ఈ టుడూ జాబితాను పేజీకి ఉపపేజీగా సృష్టిస్తాం. ఉదాహరణకు అల్లూరి సీతారామరాజు పేజీకి టుడూ జాబితా తయారు చేసేందుకు చర్చ:అల్లూరి సీతారామరాజు అనే పేజీకి చర్చ:అల్లూరి సీతారామరాజు/To do అనే ఉపపేజీని సృష్టిస్తాం (ఈ ఉపపేజీని చర్చ పేజీకి అనుబంధంగా సృష్టిస్తాం, వ్యాసం పేజీకి కాదు. వ్యాసం పేజీకి ఉపపేజీలుండవు). ఆ తరువాత చర్చ:అల్లూరి సీతారామరాజు పేజీలో {{To do}} అనే మూసను చేరుస్తాం. ఆ ఉపపేజీలో రాసిన సమాచారాన్ని ఈ చర్చ పేజీలో ఒక పెట్టెలో కనబడుతుంది. ఉదాహరణ కోసం వాడుకరి చర్చ:Chaduvari పేజీ చూడవచ్చు:
ఈ జాబితా, ప్రధానబరి లోని పేజీల్లో కొలాబొరేషనుకు తోడ్పడుతుంది. en:Wikipedia:To-do list పేజీలో ఈ పద్ధతిని వివరించారు. అందుకోసం వాళ్ళు ఆ పేజీకి అనుబంధంగా en:Wikipedia:To-do list/to do అనే ఉపపేజీని సృష్టించి, అందులో రాసిన జాబితాను en:Wikipedia:To-do list పేజీలో చూపించారు.__ చదువరి (చర్చ • రచనలు) 11:33, 20 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@చదువరి గారూ ఈ విషయం గురించి ట్వింక్విల్ శీక్షణాతరగతులలో కూడా @సుశీల మేడమ్ గారిని ఉద్దేశించి ప్రస్తావించారు. నా వివరణ ఇవ్వటానికి ఎందుకో ఆడియో పనిచేయలేదు. మరలా వివరంగా చర్చాపేజీలో వివరించినందుకు ధన్యవాదాలు. en:Wikipedia:To-do list కు కలిపిన వికీడేటా లింకు తొలగించాను.వికీపీడియా:చేయాల్సిన పనులు అనే శీర్షికను దారిమార్పులేకుండా ఆ పేజీని దానిలో ఉన్న వివరాలకు అనుగుణంగా వికీపీడియా:వ్యాసాల నాణ్యత పనుల మార్గసూచిక గా మార్చాను. ఆ పేజీ ప్రధాన ఉద్దేశ్యం కూడా వివరించాను. నేను 2019 డిసెంబరు నుండి ఇలాంటి సమస్యలను వాడుకరి:యర్రా రామారావు/పరిశీలించవలసిన పేజీలు అనే సాండ్ బాక్స్ పేజీలో నోటు చేస్తున్నాను. నా పేజీలో రాస్తే ఎవ్వరూ చూడరని, ఇలాంటి సమస్యల పరిష్కారం ఏ ఒక్కరివల్లనో కావనే ఉద్దేశ్యంతో వికీపీడియా:వ్యాసాల నాణ్యత పనుల మార్గసూచిక పేజీలో రాసాను. ఈ పేజీని గురించి మీరు ఇంకా ఏమైనా సూచనలు ఇవ్వగలరని ఆశిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 07:16, 21 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, టుడూ పేజీ ఉద్దేశం ఏమిటనేది వివరించదలచాను తప్ప, మీరు సృష్టించిన పేజీ అవసరం లేదని కాదు. ఆ పేజీని అదే పేరుతో ఉండనివ్వండి.__ చదువరి (చర్చ • రచనలు) 07:43, 21 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
వికీపీడియా:వ్యాసాల నాణ్యత పనుల మార్గసూచిక ఇలా మార్చానండీ, ఎందుకంటే ముందు, ముందు, en:Wikipedia:To-do list/to do దీనికి అవరోధంకాకుండా ఉండాలి. ఇలా ఉన్నా వికీపీడియా:వ్యాసాల నాణ్యత పనుల మార్గసూచిక పర్వాలేదు అనుకుంటున్నాను. యర్రా రామారావు (చర్చ) 08:31, 21 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

తెవికీబడి-తెలుగు వికీపీడియా నిర్వహణ అంశాలు-ట్వింకిల్

సభ్యులకు నమస్కారం

తెలుగు వికికీమీడియన్స్ యూజర్ గ్రూప్ అర్ధర్వ్యం లో తెవికీబడి వేదిక ద్వారా " తెలుగు వికీపీడియా నిర్వహణ అంశాలు-ట్వింకిల్" అనే అంశం మీద చదువరి గారు శిక్షణ ఇస్తారు. తేదీ 18.10.2026, సమయం - మధ్యాహ్నం 2.30pm. గూగుల్ మీట్ లింక్ - https://meet.google.com/kgp-axmz-frf?hs=224.

సభ్యులందరు పాల్గొనవలసినదిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు.

తెలుగు వికిమీడియన్స్ యూజర్ గ్రూప్ V.J.Suseela (చర్చ) 09:40, 16 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

మాడ్యూల్:User కంటెంట్ మోడల్ మార్చాలి.

మాడ్యూల్:User అనేది సరిగ్గా పనిచెయ్యడం లేదు. అది వాడినపుడు, Script error: No such module "user".. అనే లోపాన్ని చూపిస్తోంది. కారణం తెలియలేదు. కానీ దాని కంటెంటు మోడలు "వికీపాఠ్యం" అని ఉంది. ఇతర మాడ్యూళ్ళ మోడలు Scribunto module అని ఉంది. బహుశా ఇదే కారణం కావచ్చు. దాని కంటెంటు మోడలును మార్చే అనుమతులు నాకు లేవు. ఆ మార్పు చెయ్యవలసినదిగా నిర్వాహకులకు అభ్యర్థన. __ చదువరి (చర్చ • రచనలు) 07:48, 17 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

@Chaduvari గారు, దీనిని ఎలా చేయాలో చెబితే నేను చేస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:41, 20 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
నేను చేసాను. చేసి కూడా 4 రోజులకు పైగా అయింది.యర్రా రామారావు (చర్చ) 02:30, 21 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

వర్గాల నామకరణ విధాన నిర్ణయాల ప్రతిపాదనలు — మొదటి దఫా చర్చకు ఆహ్వానం

తెవికీలో వర్గాల నామకరణంలో స్థిరత్వం లోపించడం వల్ల, ఒకే విషయానికి సంబంధించిన వర్గాలు రెండు, మూడు వేర్వేరు పేర్లతో విడిపోతున్న సమస్యపై, తగిన విధాన నిర్ణయాలు ప్రతిపాదించే ఉద్దేశంతో గౌరవ సముదాయ సభ్యులు ఇక్కడ ఇప్పటికే ప్రాథమిక అభిప్రాయాలు వెల్లడించిన సంగతి మనందరికి తెలుసు. అందులో గుర్తించిన సమస్యలు చాలానే ఉన్నాయి. అయితే వాటన్నింటినీ ఒకేసారి చర్చకు పెడితే గందరగోళం, అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉందని భావించి, ప్రస్తుతానికి మూడు విభాగాలపై మాత్రమే విధాన నిర్ణయాల ప్రతిపాదనలు చర్చను ప్రవేశపెడుతున్నాను. దీనిపై గౌరవ సముదాయ సభ్యులు ప్రతిపాదిత వర్గాలపై, విధివిధాన నిర్ణయాలపై స్పందించగలరని కోరుచున్నాను.

గమనిక:ఈ చర్చ ఈ రోజు నుండి 2026 అక్టోబరు 31 వరకు 2 వారాల పాటు తెరిచి ఉంటుంది. ఆలోపు వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఏకాభిప్రాయం ఏర్పడిన నిర్ణయాలను అధికారిక విధానంగా నమోదు చేస్తాం. యర్రా రామారావు (చర్చ) 15:08, 17 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

అలాగేనండీ @యర్రా రామారావు గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:03, 17 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

"from నెల సంవత్సరం" లాంటి ట్రాకింగు వర్గాలు

మనకు అనేక ట్రాకింగు వర్గాలున్నాయి. ఇవి దాదాపుగా అన్నీ మూసల ద్వారానో, మాడ్యూళ్ళ ద్వారానో పేజీల్లో చేరేవే. ఎన్వికీ నుండి ఆయా మూసలను దిగుమతి చేసుకుని, వాటిని వాడినపుడు ఈ వర్గాలు ఆటోమాటిగ్గా పేజీల్లో చేరతాయి. వీటి పేర్లు చాలావరకు ఇంగ్లీషు లోనే ఉంటాయి, తెలుగీకరించినవి బహు తక్కువ; అవసరం కూడా అంతగా లేదు. వీటిలో కొన్ని వర్గాలు ఎర్రవర్గాలు కాగా, కొన్ని నీలి వర్గాలు.

కొన్ని ఉదాహరణలు:

  • వర్గం:Articles containing potentially dated statements
  • వర్గం:Articles with dead external links
  • వర్గం:All articles needing additional references
  • వర్గం:Articles with unsourced statements
  • వర్గం:మౌలిక పరిశోధన కలిగివున్నాయని అనుమానమున్న వ్యాసాలు
  • వర్గం:ప్రచార ధోరణిలో ఉన్న వ్యాసాలు
  • వర్గం:శుద్ధి చేయవలసిన వ్యాసాలు

ఇలాంటి వర్గాలన్నీ తెవికీకి ప్రయోజనం కలిగించేవే. తెవికీ నిర్వహణలో ఉపయోగపడేవే. వీటితో మనకు సమస్య లేదు, ఇవి ఉండాల్సిందే.

అయితే ఇదే ప్రయోజనం కోసం ఉద్దేశించిన వర్గాలు వేరేవి కూడా ఉన్నాయి. అవి కూడా ఇవే పేర్లతో ఉంటాయి, కాకపోతే చివర్లో from జనవరి 2025, from మే 2022 ఇలాంటివి చేర్చి ఉంటాయి. వి కూడా మూసల ద్వారానే వస్తాయి. ఉదాహరణకు -

  • వర్గం:Articles containing potentially dated statements from జనవరి 2025
  • వర్గం:Articles with dead external links from మే 2018
  • వర్గం:All articles needing additional references from జనవరి 2012
  • వర్గం:Articles with unsourced statements from జనవరి 2025
  • వర్గం:మౌలిక పరిశోధన కలిగివున్నాయని అనుమానమున్న వ్యాసాలు from జనవరి 2025
  • వర్గం:ప్రచార ధోరణిలో ఉన్న వ్యాసాలు from జనవరి 2025
  • వర్గం:శుద్ధి చేయవలసిన వ్యాసాలు from జనవరి 2025

నిర్వహణ పని ఆలస్యమై, పేరుకుపోయిన పనులను అవగొట్టేందుకు గాను, సీనియారిటీని బట్టి ప్రయారిటీ ఇచ్చేందుకు ఈ వర్గాలు పనికొస్తాయి. అంటే వర్గం:Articles with unsourced statements from జనవరి 2012 అనే వర్గంలో ఉన్న వ్యాసాలు ఎప్పుడో 2012 జనవరి నుండి మెరుగుదల కోసం వేచి చూస్తున్నాయన్నమాట. ఇంగ్లీషు వికీలో నిర్వహణ సరిగా చెయ్యకపోతే బ్యాక్‌లాగు బాగా పెరిగిపోతుంది కాబట్టి, వాళ్ళు ఈ ఏర్పాటు చేసుకున్నారు. అలా చాన్నాళ్ళుగా వేచి చూస్తున్నవాటిపై ఎక్కువ దృష్టి పెట్టి వాటిలో తగు సవరణలు చేసి, సంబంధిత మూసను తీసేస్తారు, తద్వారా ఆ పేజీ ఈ వర్గం లోంచి పోతుంది. ఆ విధంగా ఈ వర్గం ఖాళీ అయ్యాక దాన్ని తొలగిస్తారు. ఇక ఆ వర్గంలోకి కొత్తగా వ్యాసాలు వచ్చి చేరే అవకాశమే లేదు కాబట్టి (2012 జనవరి ఇక ఎప్పటికీ తిరిగి రాదు కదా!) ఆ వర్గం అవసరమే లేదు ఇక.

అవే మూసలను మనమూ దిగుమతి చేసుకున్నాం కాబట్టి, ఆ మూసలను వాడినపుడు తెవికీలోనూ ఆటోమాటిగ్గా ఆ వర్గాలు పుట్టుకొస్తాయి. కానీ, వీటి అవసరం మనకు ఉందా అంటే, ఖచ్చితంగా లేదు అని చెప్పలేం గానీ, వాటి వలన కలుగుతున్న ప్రయోజనం బహు స్వల్పం. వాటి వలన ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవి:

  • మనకు బ్యాక్‌లాగులు ఉంటాయి గానీ, వాటిలో ఉండే వ్యాసాల సంఖ్య బహుస్వల్పం. ఇలాంటి ట్రాకింగు వర్గాలు మనకు దాదాపు 900 ఉంటే వాటిలో దాదాపు 700 వర్గాల్లో ఉన్న పేజీలు 10 లోపే.
  • వీటి వలన మనకు నిర్వహణ పని ఎక్కువౌతోంది.
    • ఈ వర్గాలను ఖాళీ చేసాక, తొలగింపు మూస పెట్టాలి
    • వాటిని తొలగించాలి.
ఈ పని చెయ్యడానికి ఎన్వికీలో బాట్లున్నై.
  • ఈ వర్గాల్లోని పేజీలన్నీ మూల వర్గంలో ఎలాగూ ఉంటాయి. అంటే, "వర్గం:Articles containing potentially dated statements from జనవరి 2025" అనే వర్గం లోని పేజీలన్నీ "వర్గం:Articles containing potentially dated statements" అనే వర్గంలోనో "వర్గం:All Articles containing potentially dated statements" అనే వర్గం లోనో ఉంటాయి. కాబట్టి, ఈ "from నెల సంవత్సరం" వర్గాలు లేకపోయినా పర్లేదు.
  • పైగా, పై 900 "from నెల సంవత్సరం" వర్గాల్లో దాదాపు 800 వర్గాలకు అసలు పేజీయే లేదు అంటే అవన్నీ ఎర్రవర్గాలే!

ఈ కారణాల వలన ఈ వర్గాలు అనవసరం అనీ, ప్రస్తుతమున్నవాటిని తొలగించవచ్చనీ, ఇకముందు సృష్టించనక్కరలేదనీ నా ఉద్దేశం. తొలగించడానికి పెద్దగా శ్రమ పడేది కూడా ఏమీ లేదు. పరిశీలించవలసినది.__ చదువరి (చర్చ • రచనలు) 09:40, 19 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

చాలా ముఖ్యమైన విషయంపై చర్చను లేవదీసినందుకు @చదువరి గార్కి ధన్యవాదాలు. నేను, ఈరోజు ఉపయోగించని వర్గాలు ప్రత్వేక పేజీలలోని ఇలాంటి 28 ఖాళీ వర్గాలకు CSD మూస పెట్టాను. నేరుగా తొలగించవచ్చు, కానీ ఇంకొకరు తొలగించగలరు అని మూస పెట్టాను. అయితే మీరు చెప్పే కోరిన వర్గాలు పేజీలో ఎక్కువ భాగం ఎర్రలింకులతో వ్యాసపేజీలకు లింకులు ఉన్నవి, లేదా నేరుగా వ్యాసాలలో కనపడుతుంటాయి. కొన్నిటికి ఎవరోఒకరు సృష్టించిన వర్గాలు సుమారు 60 వర్గాలకు పైగా ఉనికిలో ఉన్నవి.ఇవి దాచిన వర్గాలలో ఉన్నవి. దీనిమీద మీరు మార్గనిర్దేశనం ఇవ్వగలరు. ఈ పనికి నావంతు సహకారం అందించగలను. వ్యాసాలలో అనవసరమైన నిర్వహణ వర్గాలు కనపడే భాద తప్పి వ్యాసాలు నాణ్యతగా ఉండగలవు. ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 11:36, 19 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అలాగే.. ఫలానా భాషలో మూలాలు ఉన్న పేజీలు, ఫలానా భాషలో పాఠ్యమున్న పేజీలు అంటూ కొన్ని వర్గాలున్నాయి. ఇవి మొత్తం 677 ఉన్నాయి. వీటిలో 448 వర్గాలు, వ్యాసంలో ఫలానా భాషలో పాఠ్యం ఉంది అని చెప్పేవి కాగా మిగతా 229, ఫలానా భాషలో మూలాలున్న వ్యాసాలు అనే వర్గాలు. వీటిలో 535 ఎర్రవర్గాలు. ఫలానా భాషలో మూలాలుంటే ఏంటి? అది తెలిస్తె తెవికీకి ఏవిధంగా ఉపయోగం? వీటిని బట్టి మనం ఏమైనా నిర్వహణ పనులు చేస్తామా? లాటిన్ భాషలో పాఠ్యమున్న పేజీలు 143 ఉన్నాయంట. ఈ సమాచారాన్ని బట్టి ఏ చర్యలు తీసుకుంటాము? ఇతర భాషల లోని మూలాన్ని తీసేసి దాని స్థానంలో తెలుగు మూలాన్ని చేరిస్తే ప్రయోజనమే గానీ, ఆ పని చేస్తున్నామా అనేది ఆలోచించాలి.
ఇపుడు కింది వర్గాలు చూడండి:
  • CS1_ఇంగ్లీష్-language_sources_(en) - 44723 పేజీలు
  • CS1_అమెరికన్_ఇంగ్లీష్-language_sources_(en-us) - 7008 పేజీలు
  • CS1_Indian_English-language_sources_(en-in) - 4887 పేజీలు
  • CS1_బ్రిటిష్_ఇంగ్లీష్-language_sources_(en-gb) - 2449 పేజీలు
దాదాపు గత దశాబ్దంగా మనం రాస్తూ ఉన్న వ్యాసాల్లో 90% కి పైగా ఎన్వికీ నుండి అనువదించినవే అయినపుడు మూలాలు ఇంగ్లీషులో ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. పైన ఇచ్చినవి పేజీల సంఖ్యలు, మూలాల సంఖ్యలు కాదు. ఒక్కో పేజీలో సగటున 5 మూలాలు ఉన్నాయనుకున్నా, మార్చాల్సిన మూలాలు లక్షల్లో ఉంటాయి. వీటిని తీసేసి, తెలుగు మూలాలను చేరుస్తామా?
ఎన్వికీలో సాధారణంగా ఇంగ్లీషు మూలాలే చాలా ఎక్కువగా ఉంటాయి. అంచేత ఇతర భాషల్లోని మూలాలను ట్రాకు చేస్తే వాటిని వీలైనపుడు మార్చుకోవచ్చు. కానీ మనకు అలాక్కాదు, మనకు తెలుగులో ఉండే మూలాలు చాలా తక్కువ, ఇంగ్లీషు మూలాలే ఎక్కువగా ఉంటాయి. వీటి స్థానంలో తెలుగు మూలాలు చేర్చడంపై సమయం పెట్టడం వలన తెవికీకి కలిగే ప్రయోజనం తక్కువ అని నా ఉద్దేశం. పైగా ఆ మూలాలు తెలుగులో దొరకవు; మహా అయితే ఒక ఐదారు శాతం దొరుకుతాయేమో! ఒక పని చేయగలమా అనేది మాత్రమే కాదు, ఆ పని చేయడం వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుంది, దానికి ఎంత సమయం వెచ్చించాలి అనేది కూడా మనం ఆలోచించాలి.
వీటిపై పనిచేసి (ఉదాహరణకు 535 ఎర్రవర్గాలకు పేజీలు సృష్టించడం), అనవసరమైన నిర్వహణ పనులకు సమయం వెచ్చించకుండా ఉండటమే నా ప్రతిపాదన లోని ఉద్దేశం.
రెండు ముఖ్యమైన గమనికలు
  1. ఈ వర్గాలు ఉన్నందువలన తెవికీకి లాభమేదైనా కలుగుతుందేమో తెలీదు గానీ, నష్టమైతే ఏమీ లేదు.
  2. ఇపుడు ఈ వర్గాలు తీసేయడం గానీ తిరిగి కావాలనుకుంటే మళ్ళీ పెట్టుకోడం గానీ - మహా అయితే ఒక అరగంట పని, అంతే. (మళ్ళీ పెట్టినపుడు అన్ని వర్గాల్లో పేజీలు కనబడ్డానికి కొన్ని గంటలు సమయం పట్టొచ్చు.)
పైన చూపిన హేతువుల మేరకు, ఈ వర్గాలను తొలగించాలని నా అభిప్రాయం. పరిశీలించండి__ చదువరి (చర్చ • రచనలు) 11:03, 20 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@ చదువరి గారూ క్షమించాలి, పై విషయాలన్నీ చదివాను, కానీ చివరకు అసలు చర్చ ముగింపు ఉద్దేశ్యం నేను అర్థం చేసుకోలేకపోయాను. ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 07:21, 21 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, ఈ వర్గాలను తొలగించాలనేదే నా ఉద్దేశమండి. తొలగించాలని మధ్యలో రాసాను గానీ, "ఈ వర్గాలు ఉన్నందువలన తెవికీకి లాభమేదైనా కలుగుతుందేమో తెలీదు గానీ, నష్టమైతే ఏమీ లేదు." అనే వాక్యాన్ని రాయడంతో కొంత అయోమయం ఏర్పడి ఉండవచ్చు. అది రాయడంలో నా ఉద్దేశం- ఆ వర్గాలను తీసేసినందువలన/ఉంచినందువలన కలిగే లాభనష్టాలు రెంటినీ చూపించడమే. అన్నీ రాసాక, చివర్లో నా ఉద్దేశాన్ని మళ్ళీ రాసి ఉంటే స్పష్టంగా ఉండేది. ఇపుడు రాస్తాను. దీన్ని చూపినందుకు ధన్యవాదాలు.__ చదువరి (చర్చ • రచనలు) 07:48, 21 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@చదువరి గారూ నా అభిప్రాయం కూడా అదే, మీ అభిప్రాయాలతో నేనూ ఏకీభనిస్తున్నాను. చర్చతో ముగించకుండా సాధ్యమైనంత త్వరలో తదుపరి చర్యలు తీసుకోగలందులకు మిమ్మల్ని కోరుచున్నాను. ఈ పని మీరు చేపడితేనే బాగుంటుందని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 08:36, 21 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ఈ ప్రతిపాదనను వాడుకరి:యర్రా రామారావు గారు ఒక్కరే సమర్థించారు. కానీ, ఎవరూ వ్యతిరేకించలేదు. ఒక్కరు వ్యతిరేకించినా మరింత చర్చ జరపకుండా ముందుకెళ్ళేవాణ్ణి కాదు. అంచేత తేదీతో కూడిన నిర్వహణ వర్గాలను తీసేసాను. వివరాలు వికీపీడియా:తేదీతో కూడిన నిర్వహణ వర్గాల తీసివేత పేజీలో ఉన్నాయి.
వివిధ భాషల మూలాలను కూడా తీసేసే పని జరిగింది. కానీ ఇది వర్గాల్లో ప్రతిఫలించడానికి సమయం పడుతోంది. బహుశా ఒక రోజు పట్టొచ్చు.__ చదువరి (చర్చ • రచనలు) 16:30, 29 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

వికీప్రాజెక్టు/సరిహద్దులు లేని వారసత్వం

సభ్యులందరికి నమస్కారం. యునెస్కో ప్రపంచ వారసత్వ భావనతో భారతీయ, ఉక్రేనియన్ వికీపీడియా కమ్యూనిటీలు సంయుక్తంగా 9 రోజులు తే.15 – 24 ఆగస్టు 2026 నిర్వహించిన ప్రచారంలో భాగంగా తెలుగు వికీపీడియా సముదాయం తరపున ఈ వికీప్రాజెక్టు/సరిహద్దులు లేని వారసత్వం (Heritage Across Borders Campaign) ద్వారా మన సముదాయ సభ్యులు అందించిన విలువైన సహకారానికి ధన్యవాదాలు.

ప్రచార నిర్వాహకులు ప్రాజెక్ట్ పూర్తి అయిందని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ లో పాల్గొన్న వారికి ప్రమాణ పత్రాలను (సర్టిఫికెట్) అందచేస్తామని, వివరాలు పంపమని అడిగారు. ఈ ప్రాజెక్ట్ లో పాల్గొన్నవారికి వారి చర్చా పేజీలో ఈ విషయం తెలియచేసాను. తెవికీ నివేదిక ఈ లింకులో చూడగలరు. https://w.wiki/duto .

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ V.J.Suseela (చర్చ) 14:37, 19 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

తెలుగు వికీపీడియాలో 'వికీప్రాజెక్టు/సరిహద్దులు లేని వారసత్వం' పోటీ నిర్వహించిన Pavan Santhosh, Vjsuseela గార్లకు... వ్యాసాలు పరిశీలన విషయంలో సహకరించిన యర్రా రామారావు, Saiphani02 గార్లకు, పోటీలో వ్యాసాలు రాసిన వాడుకరులకు నా ధన్యవాదాలు. అలాగే పోటీలో గెలుపొందిన Nagarani Bethi (ప్రథమ స్థానం), Batthini Vinay Kumar Goud, (ద్వితీయ స్థానం) Srinivasrjy (తృతీయ స్థానం) గార్లకు నా శుభాకాంక్షలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:42, 19 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

వికీలింకులే ఎందుకివ్వాలంటే..

అంతర్గత లింకులను ఇచ్చేందుకు వికీలింకులే వాడాలి, పొడుగు, పొట్టి యూఆరెల్ లను వాడకూడదు. ఎందుకో తెలుసుకునేందుకు వాడుకరులకు సూచనలు పేజీ చూడండి.__ చదువరి (చర్చ • రచనలు) 05:55, 21 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

@చదువరి గారూ మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇది కొత్తవారూ పాతవారూ అందరు గమనించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. యర్రా రామారావు (చర్చ) 06:51, 21 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
చాలా ఉపయోగకరమైన విషయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:06, 23 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

తెవికీ బడి శిక్షణా కార్యక్రమాల వేళలు గురించిన ప్రతిపాదన

గౌరీపతిగారు వాట్స్ అప్ లోను, తెవికీబడి పేజీ లోను కూడా తెవికీ బడి శిక్షణా కార్యక్రమాల వేళలు గురించిన అభ్యర్ధన చేసారు. ఈ లింకు చూడగలరు. ఈ విషయం పై సభ్యులు తమ అభిప్రాయం చెప్పి ఒక నిర్ణయం తీసుకోవలసింది అని కోరుతున్నాను. ధన్యవాదాలు. V.J.Suseela (చర్చ) 17:48, 21 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

అలాగేనండీ @Vjsuseela గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:04, 23 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

స్వరలాసిక మురళీమోహన్ గారికి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం

తెలుగు వికీపీడియన్, అనువాదకుడు, రచయిత అయిన @స్వరలాసిక: మురళీమోహన్ గారికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం అందిస్తున్నట్టు ప్రకటించింది. కర్ణాటకకు చెందిన హెచ్. నరసింహయ్య ఆత్మకథ హోరాటద హదిని "పోరాట పథం" పేరిట అనువదించినందుకు ఈ పురస్కారం లభించింది.

హెచ్.ఎన్‌గా కన్నడ సమాజంలో సుప్రసిద్ధుడైన హెచ్ నరసింహయ్య భౌతిక శాస్త్రవేత్త, విద్యావేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు, హేతువాది. హెచ్. నరసింహయ్య అమెరికాలో న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకుని భారతదేశానికి తిరిగివచ్చి బెంగళూరులోని నేషనల్ కాలేజీలో అధ్యాపకునిగా ప్రారంభించి బెంగళూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వరకూ వివిధ హోదాల్లో పనిచేశారు. వైస్ ఛాన్సలర్‌ హోదాలోనూ, తర్వాత కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగానూ సత్యసాయిబాబా వంటివారి మహిమల నుంచి బాణావతి వంటివాటివరకూ అభౌతిక విశ్వాసాల మీద పరిశోధనలు చేసి వాస్తవాలు వెలికి తీసేందుకు కమిటీలు, మిషన్లు ఏర్పాటుచేయడంతో సమాజంలో సంచలనం సృష్టించారు.

ఆయన ఆత్మకథను మురళీమోహన్ గారు కన్నడ నుంచి తెలుగులోకి 2023లో అనువదించి అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో విశేషం ఏమిటంటే, తెలుగు వికీపీడియాలో హెచ్.నరసింహయ్య వ్యాసాన్ని ఈ పుస్తకాన్ని అనువదించాలన్న సంకల్పం కలగడానికి చాన్నాళ్ళ ముందే 2016లోనే ఆయన రూపొందించారు.

ఈ సందర్భంగా మురళీమోహన్ గారికి అభినందనలు --పవన్ సంతోష్ (చర్చ) 11:25, 22 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

@స్వరలాసిక గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ యర్రా రామారావు (చర్చ) 11:32, 22 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
కోడిహళ్ళి మురళీమోహన్ గారూ, ఈ పురస్కారం లభించిన సందర్భంగా మీకు అభినందనలు.__ చదువరి (చర్చ • రచనలు) 11:44, 22 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
పవన్ సంతోష్, యర్రా రామారావు, చదువరి గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. --స్వరలాసిక (చర్చ) 11:49, 22 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@స్వరలాసిక గారు ఈ పురస్కారం లభించిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు ఉదయ్ కిరణ్ (చర్చ) 11:59, 22 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@స్వరలాసిక గారికి ఈ సందర్భంగా అభినందనలు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:38, 22 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
గురువుగారికి అభినందనలు..! -Muralikrishna m (చర్చ) 16:16, 22 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
మురళీమోహన్ గారూ, మీరు అనువదించిన "పోరాట పథం" పుస్తకానికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం లభించిన సందర్భంగా మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:55, 23 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
Muralikrishna m,ప్రణయ్‌రాజ్ వంగరి గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. --స్వరలాసిక (చర్చ) 10:55, 23 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
తెలుగు వికీపీడియన్, అనువాదకుడు, రచయిత అయిన @స్వరలాసిక: గారికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం అందించిన సందర్భంలో అభినందనలు. V.J.Suseela (చర్చ) 05:37, 25 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ధన్యవాదాలు మేడమ్‌! స్వరలాసిక (చర్చ) 11:28, 26 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

ఎక్స్‌టూల్స్ వారి పేజీ సమాచార పట్టీ కనిపించడం లేదు

తెవికీలో ప్రతిపేజీ లోనూ, శీర్షిక కిందనే కనిపించే పేజీ సమాచార పట్టీ కనిపించడం లేదు. పేజీ సృష్టించిన వాడుకరి, సృష్టించిన తేదీ, చివరిసారి తాజాకరించిన తేదీ,గణాంకాల లింకులు వగైరాలు ఈ పట్టీలో కనిపిస్తాయి. ఈ పట్టీ నిన్నటి (అక్టోబరు 22) నుండి కనిపించడం లేదు. అసలు ఆ పరికరపు సైటు కూడా (https://xtools.wmcloud.org/) పనిచెయ్యడం లేదు. క్వారీ కూడా పడుకుంది. wmcloud ను మూసేసారు. అంచేత, వికీమీడియా ప్రాజెక్టులకు సంబంధించిన పలు ఉపకరణాలేవి పనిచెయ్యడం లేదు.

పీహెచ్‌పీ లో కనుక్కున్న ఒక సెక్యూరిటీ లోపం కారణంగా ఈ సైట్లను తాత్కాలికంగా మూసేసారు. మరిన్ని వివరాలను ఈ సైట్లలో చూడవచ్చు: , __ చదువరి (చర్చ • రచనలు) 02:48, 23 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

నిన్న నాకు కూడా ఎక్స్‌టూల్స్ వారి పేజీ సమాచార పట్టీ కనిపించలేదు. నా అభిరుచులల్లో ఏదైనా పొరపాటు జరిగిందేమో అనకుంటున్నాను. లోపం ఎక్కడుందో తెలిసింది. ధన్యవాదాలు @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:50, 23 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ఎక్స్‌టూల్స్ (xtools.wmcloud.org) తిరిగొచ్చింది. ఇపుడు పేజీ సమాచార పట్టీ కనిపిస్తోంది. పెట్‌స్కాన్ (https://petscan.wmcloud.org/) కూడా వచ్చేసింది. క్వారీ (quarry.wmcloud.org) ఇంకా రాలేదు.__ చదువరి (చర్చ • రచనలు) 01:37, 24 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అవును నేనూ ఇప్పుడే చూసాను. యర్రా రామారావు (చర్చ) 01:38, 24 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
క్వారీ కూడా ఇవ్వాళ అందుబాటు లోకి వచ్చింది.__ చదువరి (చర్చ • రచనలు) 04:40, 27 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

వికీలో దిద్దుబాట్లు చేయడంలో సహాయం కోసం...

సభ్యులకు నమస్కారం, తెలుగు వికీపీడియాలో కొత్తగా వచ్చిన వాడుకరులు దిద్దుబాట్లు చెయ్యడంలో వారికి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు, ఈ సైటును వాడుకోవడంలో వారికి సాయపడడానికి అనుభవజ్ఞుడైన కొందరు వాడుకరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వికీపీడియాలో ఖాతా సృష్టించుకున్న ఒక్కో వాడుకరికి అటోమేటిక్ గా ఒక్కో గురువు కేటాయించబడుతారు. అయితే, ఖాతా సృష్టించుకున్న కొత్త వాడుకరులకు గురువులను కేటాయించిన విషయం తెలిస్తేనే, ఆ వాడుకరులు తన గురువులను వికీలో దిద్దుబాట్లు చేయడంలో సహాయం కోసం ప్రశ్నలు అడుగుతున్నారు. తెలియనివారు అడగడం లేదు. రుద్రవీణ సినిమాలో 'తరలి రాదా తనే వసంతం... తన దరికిరాని వనాల కోసం' అని సిరివెన్నెల గారన్నట్టు, శిష్యుడు గురువును సంప్రదించకపోతే, గురువే తన శిష్యుడికి సందేశం పంపి, సంప్రదింపులు జరపవచ్చు కదా అని నాకు అలోచన వచ్చింది. దాంతో ఇటీవలి కాలంలో నాకు శిష్యులుగా కేటాయించబడిన దాదాపు 50 మంది కొత్త వాడుకరులకు వారి వాడుకరి చర్చాపేజీలో 'వికీ రచనలో సహాయం కోసం...' విభాగంలో

నమస్కారం {{వాడుకరి పేరు)) గారు, వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ [[వాడుకరి:|నన్ను]] ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా నన్ను మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.

అని రాశాను. ఇలా గురువులందరూ తమకు కేటాయించిన శిష్యుల వాడుకరి చర్చాపేజీలో రాస్తే, అది కొత్తవారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని నా అభిప్రాయం. ఇందుకోసం ఒక మూసను మనం తయారు చేసుకుంటే సులభంగా వాడుకరి చర్చాపేజీలో చేర్చవచ్చు. ఈ విషయంపై సభ్యులు తమ అభిప్రాయాలను తెలుపగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:04, 23 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

@బాగుందండి. నేనూ వాడతాను.__ చదువరి (చర్చ • రచనలు) 01:03, 24 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@ప్రణయ్ రాజ్ గారూ మీరు చురుకుగా మంచి ఆలోచనతో మీరే వారికి దగ్గరకావటానికి ప్రయత్నిస్తున్నందుకు ధన్యవాదాలు. నేనైతే ఆపని చేయలేకపోవుచున్నాను యర్రా రామారావు (చర్చ) 16:19, 28 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

తొలగింపు విధానాలు, పద్ధతులు

తెవికీలో వివిధ తొలగింపు విధానాల గురించి వివరిస్తూ ఒక పేజీ తయారుచేసాను. ఈ సమాచారాన్ని వికీపీడియా:వాడుకరులకు సూచనలు పేజీలో తొలగింపు విధానాలు, పద్ధతులు విభాగంలో చూడవచ్చు.__ చదువరి (చర్చ • రచనలు) 08:58, 24 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

అలాగేనండీ @Chaduvari గారు.--- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:43, 24 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
మంచి సమాచారం.ఒకసారి చదివి అందరూ గుర్తుంచుకోవలసిన అవసరముంది. యర్రా రామారావు (చర్చ) 16:14, 28 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

తెవికీబడి వేదిక ద్వారా " తెలుగు వికీపీడియా నిర్వహణ అంశాలు

సభ్యులకు నమస్కారం

తెలుగు వికికీమీడియన్స్ యూజర్ గ్రూప్ అర్ధర్వ్యం లో తెవికీబడి వేదిక ద్వారా " తెలుగు వికీపీడియా నిర్వహణ అంశాలు" అనే అంశం మీద, ఇంకా ఉపకరణాలు గురించి యర్రా రామారావుగారు శిక్షణ చర్చ నిర్వహిస్తారు. తేదీ 25.10.2026, ఆదివారం సమయం - మధ్యాహ్నం 2.30pm. గూగుల్ మీట్ లింక్ - https://meet.google.com/kgp-axmz-frf?hs=224.

సభ్యులందరు పాల్గొనవలసినదిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు.

తెలుగు వికిమీడియన్స్ యూజర్ గ్రూప్ V.J.Suseela (చర్చ) 03:24, 25 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

వికీపీడియా ఏషియన్ నెల 2026 ప్రారంభం

గతంలో చర్చించుకున్న విధంగా వికీపీడియా ఏషియన్ నెల 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం 2026 నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు నిర్వహించబడుతుంది.

వికీపీడియా ఏషియన్ నెల 2026 అనేది ఆసియా ఖండంలోని చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం, ప్రముఖ వ్యక్తులు, వివిధ దేశాల విశేషాలను తెలుగు భాషలో పరిచయం చేసే ఒక విజ్ఞాన కార్యక్రమం. తెలుగు వికీపీడియాలో కొత్త వ్యాసాలను సృష్టించడం, ఇప్పటికే ఉన్న వ్యాసాలను అభివృద్ధి చేయడం ద్వారా ఆసియా విజ్ఞానాన్ని విస్తరించవచ్చు.

ఆసియా దేశాల వైవిధ్యాన్ని తెలుగు పాఠకులకు చేరువ చేయడం, భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, వికీపీడియా వాడుకరుల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు. ప్రతి ఒక్కరి సహకారంతో స్వేచ్ఛా విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి, తెలుగు వికీపీడియాను మరింత సమృద్ధిగా తీర్చిదిద్దుదాం.

ఈ ప్రాజెక్టులో భాగంగా నాలుగు వ్యాసాలు రాసిన వారికి వికీపీడియా ప్రత్యేక పోస్టుకార్డు అందించబడుతుంది. అందరికంటే ఎక్కువ నాణ్యమైన వ్యాసాలు వ్రాసిన వ్యక్తికి "వికీపీడియా ఏషియన్ అంబాసడర్" బిరుదు ఇవ్వబడుతుంది.

కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను క్రింది లింకులో చూసి, మీ పేరును నమోదు చేసుకోగలరు.

ప్రాజెక్టు పేజీ లింక్:

Edla praveen (చర్చ) 04:29, 25 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

@Edla praveen గారూ, వికీపీడియా ఏషియన్ నెల 2026 కార్యక్రమం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి, ఆసియా దేశాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుగు పాఠకులకు పరిచయం చేయడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగు వికీపీడియా విజ్ఞాన సంపదను పెంపొందించేందుకు తమ వంతు సహకారం అందించాలని సముదాయ సభ్యులను కోరుతున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:51, 27 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@ ప్రవీణ్ గారూ మంచి కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు.నావంతు సహకారం అందించగలవాడను యర్రా రామారావు (చర్చ) 16:11, 28 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Edla praveen గారూ, అభినందనలు. V.J.Suseela (చర్చ) 16:16, 28 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

కూర్పులను తిరగ్గొట్టే పద్ధతులు

తెవికీలో కూర్పులను తిరగ్గొట్టే పద్ధతుల గురించి క్లుప్తంగా వివరిస్తూ ఒక వికీపీడియా వ్యాసం రాసాను. దాన్ని వికీపీడియా:వాడుకరులకు సూచనలు పేజీలో కూర్పులను తిరగ్గొట్టడం విభాగంలో చూడవచ్చు.__ చదువరి (చర్చ • రచనలు) 16:25, 25 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

ధన్యవాదాలు @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:54, 25 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
చదివి అర్థం చేసుకున్నాను.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 16:09, 28 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

మూలాల్లోని లోపాలు

ఇనెజ్ జాక్సన్ పేజీలో 6 మూలాలున్నాయి. కానీ ఒక్కటి కూడా సంపూర్ణమైన మూలం కాదు. ఆ ఆరిట్లో ఒక్కటి కూడా పనిచెయ్యదు. ఇసా ఖాన్ సమాధి పేజీలో 11 మూలాలున్నాయి, కానీ వాటిలో 9 మూలాలు పేరుకే మూలాలు, అన్నీ అసంపూర్ణమైనవే. ఇస్లామిక్ పాలనలో ముంబై చరిత్ర పేజీలో 17 మూలాలుంటే వాటిలో 16 అసంపూర్ణ మూలాలే. అర్నోరాజా పేజీలో 5 మూలాలుంటే ఐదూ అసంపూర్ణమైనవే. అసంపూర్ణమైనవంటే -

  • పేజీ పాఠ్యంలో ఉండే మూలం అంకెను నొక్కితే, మూలాల జాబితా లోని సంబంధిత మూలానికి తీసుకుపోతుంది. ఇది మామూలే.
  • ఆ మూలంలో ఒక సగంపేరు, ఒక సంవత్సరం, పేజీ నంబరు ఉంటాయి. దానికి ఒక లింకు కూడా ఉంటుంది. కానీ దాన్ని నొక్కినపుడు ఏమీ జరగదు. అదే అసంపూర్ణత్వం అంటే. ఇది మరింత స్పష్టంగా తెలియాలంటే, సంబంధిత ఎన్వికీ పేజీని తెరిచి అక్కడి మూలాన్ని నొక్కిచూడండి. అపుడు తెలుస్తుంది మన పేజీలో ఉన్న లోపమేంటో.

పై పేజీలను కేవలం ఉదాహరణ కోసం చూపానంతే. ఈ లోపమున్న పేజీలు ఇప్పుడు తెవికీలో 1535 ఉన్నాయి.

వాస్తవానికి ఆ మూలాన్ని నొక్కినపుడు ఒక సంపూర్ణమైన మూలంకు (పొడుగు మూలం) వెళ్ళాలి. ఆ పొడుగు మూలం కూడా ఆ పేజీ లోనే, కింద ఉండాలి. పొడుగుమూలం లేదు కాబట్టి ఈ మూలం అసంపూర్ణంగా ఉండిపోయింది. ఈ మూలం లోని లోపాన్ని ఎర్ర రంగులో "sfn error: no target:" అని పొట్టి మూలం పక్కనే చూపిస్తుంది. అలాగే ఆ పేజీని "Harv and Sfn no-target errors" అనే వర్గంలో వేస్తుంది. ఈ లోపమూ, ఈ వర్గమూ సాధారణంగా పేజీలో కనబడవు. అవి కనబడాలంటే, కింది పనులు చెయ్యాలి:

  1. అభిరుచులు --> రూపురేఖలు లో "దాచినవర్గాలను చూపించు" పెట్టెలో టిక్కు పెట్టుకోవాలి. అప్పుడు వర్గం:Harv and Sfn no-target errors అనే వర్గం కనిపిస్తుంది. కొంత మంది వాడుకరులు ఈసరికే ఈ మార్పు చేసుకున్నారు కాబట్టి వారికి ఇది కనిపిస్తూ ఉంటుంది.
  2. ప్రత్యేక:MyPage/common.css పేజీలో
.harv-error {display: inline !important;} /* display Module:Footnotes errors */
అని చేర్చుకోవాలి. అపుడు లోపాలు కూడా కనిపిస్తాయి.

పరిశీలించండి.__ చదువరి (చర్చ • రచనలు) 06:15, 26 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

ధన్యవాదాలు @Chaduvari గారు. మీరు చెప్పినట్టుగా ఇసా ఖాన్ సమాధి పేజీలో గ్రంథసూచి విభాగంలో పొడుగు మూలాలు చేర్చాను. మూలం సరిచేయబడింది. మిగతావి కూడా ఇలానే చేస్తే సరిపోతుందా?.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:15, 26 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
సూపర్ @Pranayraj1985 గారు. మీరు ఒక అడుగు ముందే ఉన్నారు. అంతే, అలా పొడుగు మూలాలు చేరిస్తే సమస్య పరిష్కారమై పోతుంది. ధన్యవాదాలు.__ చదువరి (చర్చ • రచనలు) 11:49, 26 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:50, 26 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari గారూ, మంచి పాయింట్ చెప్పారు. ఈ బుక్ రిఫరెన్సులు ఇచ్చేప్పుడు పొట్టి మూలాలు మట్టుకే ఇచ్చి, అసలు పుస్తకాన్ని తెచ్చుకుని ఇవ్వకుంటే ఇలా అవుతుంది. దీన్ని సరిజేయాలంటే అసలు ఈ Harv and Sfn ఎలా పనిచేస్తుందో గమనించాలి. పవన్ సంతోష్ (చర్చ) 08:42, 27 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Pavan santhosh.s గారూ, అవి ఎలా పనిచేస్తాయో వాడుకరులకు సూచనలు పేజీలో ఉంది, చూడండి.__ చదువరి (చర్చ • రచనలు) 09:35, 27 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari గారూ, ధన్యవాదాలండీ. నేను గతంలో ఈ తరహా మూలాలతో పనిచేశాను. జవాహర్ లాల్ నెహ్రూ వ్యాసమూ, సంబంధిత వ్యాసాలూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ఆయన జీవితచరిత్ర వ్యాసాలూ - ఇలాంటివి నేను నేరుగా మూలాలను ఉపయోగించి తెలుగులోనే నిర్మిస్తున్నప్పుడు వీటిని బాగా ఉపయోగించుకున్నాను. అయితే, పొరబాటు ఏమిటంటే - ఇవి ఎలా వాడాలన్న విషయం సముదాయ సభ్యులుకు తెలియజేసేందుకు ప్రయత్నాలేమీ చెయ్యలేదు. భవిష్యత్తులో ఇది సరిదిద్దుకుంటాను. మీరు ఎప్పటికప్పుడు సముదాయం అంతా నేర్చుకుని మెరుగుపరుచుకునే విధంగా రచ్చబండలో చర్చలు చేస్తూ, తగిన విధంగా వికీపీడియా:వాడుకరులకు సూచనలు పేజీ తయారుచేస్తూ చేస్తున్న కృషిని అనుసరించడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు సర్. పవన్ సంతోష్ (చర్చ) 10:06, 27 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Pavan santhosh.s గారూ ధన్యవాదాలు. మీరు కూడా పైన చెప్పినట్లు ప్రత్యేక:MyPage/common.css పేజీలో
.harv-error {display: inline !important;} /* display Module:Footnotes errors */
అని పెట్టుకోండి. తద్వారా పై పేజీల్లో "sfn error: no target:" లోపాలు ఎక్కడెక్కడున్నాయో తెలిసిపోతుంది. __ చదువరి (చర్చ • రచనలు) 10:18, 27 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అలాగే, @Chaduvari గారూ పవన్ సంతోష్ (చర్చ) 11:58, 27 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
అభిరుచులలో ఇదివరకే సెట్ చేసి ఉంది. common.js లో ఈ స్క్రిప్ట్ చేర్చానండి. ధన్యవాదాలు V.J.Suseela (చర్చ) 14:25, 27 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Vjsuseela గారూ, common.js లో కాదండి, common.css లో చేర్చాలి.__ చదువరి (చర్చ • రచనలు) 06:25, 28 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
సరిచేసానండి. ధన్యవాదాలు. V.J.Suseela (చర్చ) 06:56, 28 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
common.css లో నేను చేర్చాను, వ్యాసాలలోని మూలాల జాబితాలో లోపాలు ఉన్న మూలాలు తెలుస్తున్నాయి. ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 16:08, 28 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

గూగుల్ ఆఫీసులో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ కార్యక్రమం

2025-26లో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ఫౌండేషన్ సహకారంతో గూగుల్‌తో భాగస్వామ్యం పొంది తెలుగు వికీపీడియా వ్యాసాల రచన, విస్తరణ, కొత్త వికీమీడియన్స్ కోసం కార్యక్రమాల నిర్వహణ వంటివి చేశామన్నది మీకందరికీ తెలిసిందే. ఈ భాగస్వామ్యంలో భాగంగా కేవలం ఆర్థిక వనరులే కాక గూగుల్ వారి ఆఫీసుకు ఈ కార్యక్రమ నిర్వహణలోనూ, భాగస్వామ్యంలోనూ విశిష్ట కృషి చేసినవారిని ఆహ్వానించి, అక్కడ వీలునుబట్టి వారి భారతీయ భాషల సెర్చ్ టీమ్‌తో సంభాషణ, ప్రతిభ కనబరిచినవారికి ప్రోత్సాహం వంటివి చేసుకునేందుకు వీలుంది. అయితే, హైదరాబాద్ గూగుల్ క్యాంపస్‌లో మనకు సంబంధించిన టీమ్ వారు లేనందున, భారతీయ భాషల పరిశోధన విషయంలో గూగుల్‌కి బెంగుళూరు క్యాంపస్ కేంద్రం అయినందున మనకు డిసెంబరు రెండవ వారంలో బెంగళూరు గూగుల్ ఆఫీసులో ఈ కార్యక్రమం నిర్వహించుకునేందుకు అవకాశం లభిస్తోంది. వికీమీడియా ఫౌండేషన్ వారి దక్షిణాసియా లీడ్ పార్టనర్‌షిప్స్ మేనేజర్ అయిన ప్రవీణ్ దాస్ ఈ విషయంలో గూగుల్‌తో సంప్రదించి తేదీలు ఖరారుచేస్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం లభిస్తే ఇక్కడ పంచుకుంటాను. @Vjsuseela: గారూ, నేనూ వికీమీడియా ఫౌండేషన్ వారితో సంప్రదిస్తున్నాము. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయగలమని ఆశిస్తున్నాం. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 10:07, 27 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

@Pavan santhosh.s గారూ, తెలుగు వికీపీడియా అభివృద్ధికి, వికీమీడియన్ల కృషికి గుర్తింపు తీసుకురావడంలో ఇదొక మంచి ముందడుగు. గూగుల్‌తో ఈ భాగస్వామ్యం ద్వారా తెలుగు వికీపీడియా వ్యాసాల రచన, విస్తరణతో పాటు, కొత్త వికీమీడియన్లకు మరిన్ని అవకాశాలు కల్పించడం అభినందనీయం. బెంగళూరు గూగుల్ కార్యాలయంలో భారతీయ భాషల సెర్చ్ టీమ్‌తో సంభాషించే అవకాశం లభిస్తే, తెలుగు భాషకు సంబంధించిన మన అనుభవాలను, అవసరాలను పంచుకోవడంతో పాటు భవిష్యత్తులో మరింత సహకారానికి మార్గాలు ఏర్పడతాయని ఆశిస్తున్నాను. తేదీలు, ఇతర వివరాలు ఖరారైన తర్వాత తెలియజేయగలరు. ఈ ప్రయత్నానికి కృషి చేస్తున్న అందరికీ ధన్యవాదాలు.-| ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:48, 27 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@పవన్ సంతోష్ గారూ, @సుశీల గారూ మంచి ఆలోచనతో మంచి ప్రయత్నం మొదలుపెట్టినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 16:06, 28 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

వర్గాల నామకరణ విధాన నిర్ణయాల ప్రతిపాదనలు — మొదటి దఫా చర్చలో స్పందనకు గడువు ఇక 3 రోజులే ఉంది

వర్గాల నామకరణ విధాన నిర్ణయాల ప్రతిపాదనలు మొదటి దఫా చర్చ లో స్పందించుటకు గడువు ఇక మూడు రోజులు (2026 అక్టోబరు 31 వరకు) మాత్రమే ఉంది. ఆ తరువాత ఆ చర్చలోని విధాన నిర్ణయాలు అమలులోకి తీసుకురాబడతాయని గమనించగలరు. ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 16:29, 28 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

అలాగేనండీ @యర్రా రామారావు గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:23, 29 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

క్రొత్త నిర్వహణ మూస, వర్గం సృష్టింపుపై ప్రతిపాదన

తెలుగు వికీపీడియాలోని పేజీలలో ఆంగ్ల ఎర్రవర్గాలు వేలల్లో ఉంటున్నవి. వాటిని పరిశీలించి అవసరమైన వాటికి సరిపోలిన వర్గం సృష్టించటం, అంతకుముందే సృష్టించినవర్గం ఉంటే దానినిచేర్చటం, అవసరంలేని ఎర్రవర్గాలను తొలగించటం సాధారణంగా చేయాలి. చురుకైన వాడుకరులు తక్కువమంది ఉన్నందున, చాలా పనులు ఆచరణ నోచుకోకపోవటం మనందరికి తెలిసిన విషయమే! అలాంటి వ్యాసాలను యూజర్స్ గమనించినప్పుడు మూస:ఆంగ్ల ఎర్రవర్గం గమనిక అనే మూసను చర్చాపేజీలో చేర్చటం ద్వారా, ఆ వ్యాస చర్చా పేజీలన్నీ “వర్గం:ఆంగ్ల ఎర్రవర్గాలున్న వ్యాస చర్చాపేజీలు” అనే వర్గంలో చేరిస్తే మంచిదని నా అభిప్రాయం. అవసరంలేని వర్గాలను మూకుమ్మడిగా తొలగించటానికి నేను JS స్క్రిప్టు ఒకదానిని తయారుచేసి సిద్ధంగా ఉన్నది. ఆ వర్గంలోని వ్యాసాలు మీద సముదాయ సభ్యులు పరీక్షించి మంచిచెడూ మీద అభిప్రాయాలు తెలిపితే, ఆ స్కిప్టు బాగుందనుకుంటే దానిని వీకీపీడియాలో కొనసాగించవచ్చు. దీనివల్ల అనువాదం కాని వర్గాలను సులభంగా గుర్తించి తెలుగులోకి మార్చడానికి వీలవుతుంది. వ్యాసాల నాణ్యత మెరుగుపడటానికి అవకాశం ఉంది. మూస పేరు. వర్గం పేరు, దీని ఉపయోగాలు, నిర్వహణపై మీ అభిప్రాయాలను తెలుపగలరు. ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 16:57, 28 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

  1. ఎర్రవర్గం అంటే, అసలు ఉనికిలోనే లేని వర్గం. అంటే, దానికి పేజీయే లేదన్నమాట. అసలు ఉనికిలోనే లేని దాన్ని తొలగించడం ఎట్లా? తొలగించలేం. కానీ వర్గానికి ఒక విశిష్టత ఉంది -అది ఉనికిలో లేకపోయినా, దానిలో పేజీలను చేర్చవచ్చు. పేజీ అనే శరీరం లేకపోయినా, అది అదృశ్యంగా, అశరీరంగా ఉంటుంది. దాన్ని పనిగట్టుకుని తొలగించలేం, తొలగించనక్కరలేదు కూడా. దాని లోంచి పేజీలను తీసేస్తే, అదే పోతుంది.
నిన్నా ఇవ్వాళ నేను దాదాపు 1600 పైచిలుకు తేదీ ఆధారిత నిర్వహణ వర్గాలను తీసేసాను. తొలగించలేదు.. వాటిలోకి పేజీలను చేర్చకుండా ఆపాను. ఈ 1600 లో సుమారు 90% దాకా ఎర్రవర్గాలే అనుకుంటాను. ఇప్పుడు ఆ వర్గాల్లోకి పేజీలు చేరకుండా అడ్డుకున్నాం కాబట్టి ఆ ఎర్రవర్గాలన్నీ పోయినట్టే. ఇక మిగిలినవి నీలి వర్గాలు. వాటిలో కూడా పేజీలు చేరకుండా ఆపాం కాబట్టి అవి కూడా ఖాళీ అయ్యాయి/అవుతాయి. వాటిలో పేజీలు ఉన్నాయి కాబట్టి, ఖాళీ అయ్యాక, వాటిని పనిగట్టుకుని తొలగించాలి. (వాటిని నేను గుర్తించి ఒక వర్గంలో చేరుస్తాను. నిర్వాహకులు వాటిని తొలగించవచ్చు.)
  • సరే, తేదీ ఆధారిత నిర్వహణ వర్గాల లాంటివి తీసేసాం. మరి ఇతర ఇంగ్లీషు ఎర్రవర్గాలు కూడా ఉన్నాయే.. వాటి సంగతేంటి? అవి కూడా మూసల ద్వారా చలామణీ లోకి వచ్చినవే అయితే, వాటికి కూడా లాంటి చికిత్సే చెయ్యవచ్చు -సముదాయం అభ్యంతరపెట్టకపోతే. కానీ కొన్ని ఇంగ్లీషు ఎర్రవర్గాలను వాడుకరులే తీసుకొచ్చారు -పేజీలను అనువదించి ప్రచురించినపుడు. అలాంటి వాటిని మానవికంగా ఒక్కొక్క దాన్నే ఖాళీ చెయ్యాలి. ఎలా ఖాళీ చెయ్యడం? ఒక్కొక్కపేజీని తెరిచి అందులోంచి ఆ వర్గం పేరును తీసెయ్యాలి. అప్పుడే ఆ వర్గం ఖాళీ అవుతుంది. ఆ పనిని అవసరమైన చోట్ల సెమీ ఆటోమాటిగ్గా, వేగంగా చేసేందుకు AWB లాంటి ఉపకరణాలను వాడొచ్చు.
కొన్ని అభిప్రాయాలు, సూచనలు
  1. తొలగింపు వంటి పనులు యూజర్ స్క్రిప్టు వంటి వాటి ద్వారా చెయ్యకుండా ఉంటే మంచిది. మూకుమ్మడి తొలగింపు వంటివి అసలే చెయ్యకూడదు.
  2. అంత మాత్రాన ఈ పని మానుకోనక్కరలేదు. మూకుమ్మడి తొలగింపు కోసం ట్వింకిల్‌లో, ఎమ్-డిలీట్ అనో బి-డిలీట్ అనో డి-బ్యాచ్ అనో ఒక మెనూ ఉంది. నిర్వాహకులకే అది కనిపిస్తుంది. 2020 లో దాన్ని వాడి, గూగుల్ యంత్రానువాదం ద్వారా సృష్టించిన దాదాపు 1800 వ్యాసాలను తొలగించాను. (వికీ నేటివు కోడును గానీ, ట్వింకిల్ లాంటి గాడ్జెట్లను గానీ నిష్ణాతులైన వాళ్ళు తయారు చేసి, పరీక్షించి మరీ ఉంటారు కాబట్టి వాటిని వాడడంలో ఒక భద్రత ఉంటుంది.)
  3. తొలగించాల్సిన పేజీలను చేర్చేందుకు వర్గాలను కొత్తగా సృష్టించనక్కరలేదనుకుంటాను, ఉన్న వర్గాలను వాడుకుంటే చాలు.
  4. ఇంగ్లీషు ఎర్ర, నీలివర్గాలు ఏమేం ఉన్నాయి, వాటిలో ఎన్నెన్ని వ్యాసాలున్నాయి వంటి సమాచారాన్ని క్వెరీ ద్వారా లాగొచ్చు. వాటిలో తొలగించదగ్గ వర్గాలను గుర్తించే పనిని కొంతమేర ఆటోమాటిగ్గా చెయ్యొచ్చనుకుంటాను.
ముఖ్యమైన గమనిక:
  • ఇంగ్లీషు ఎర్రవర్గాలలో కొన్ని, పైన చెప్పినట్టు, మూసల ద్వారా చలామణీ లోకి వస్తాయి. వాటిని మానవికంగా ఖాళీ చెయ్యలేం. పేజీలో మూస ఉన్నంతకాలం అది పోదు. అంచేత మూసల్లోనే వాటిని అడ్డుకోవాలి -పైన నేను చేసినట్టు.
  • కానీ, అలా అడ్డుకున్నంత మాత్రాన శాశ్వతంగా సమస్య తొలగినట్టు కాదు. ఆయా మూసల తాజా కూర్పులను ఎన్వికీ నుండి దిగుమతి చేసుకున్నపుడు, ఆ పని మళ్ళీ మొదటికొస్తుంది. ఆ వర్గాలు మళ్ళీ చలామణీ లోకి వస్తాయి. అంచేత ఆయా మూసలను దిగుమతి చేసుకోగానే, పాత మార్పులను కొత్త కూర్పులో కూడా చెయ్యాలి (దీని గురించి ఒక పేజీ కూడా పెట్టుకున్నాం). దిగుమతి చేసేవారు దాన్ని మర్చిపోకుండా చెయ్యాలి. (నేను తొలగించిన 1600 నిర్వహణ వర్గాల విధి కూడా భవిష్యత్తులో చెయ్యబోయే తాజా కూర్పుల దిగుమతుల మీద ఆధారపడి ఉంటుంది.)
పరిశీలించండి.__ చదువరి (చర్చ • రచనలు) 19:18, 28 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@చదువరి గారూ ఆలస్యంగా స్పదించినందుకు క్షమించాలి. నేను చర్చకు ప్రవేశపెట్టిన అంశం వేరు. మీరు వివరించిన అంశం వేరు, లేదా నేను చర్చా అంశం సవివరంగా సరిగా ప్రతిపాదించి ఉండకపోవచ్చు, లేదా మీ అభిప్రాయం నేనే సరిగా అర్థం చేసుకుని ఉండకపోవచ్చు. వీటిలో ఏ కారణమైనా కావచ్చు. నేను ప్రతిపాదించిన అంశం మరో మారు ప్రస్తావనకు తీసుకువస్తున్నాను. ఈ దిగువ కొన్ని ఆంగ్ల ఎర్ర వర్గాలు ఉన్న వ్యాసాలు గమనించగలరు.
పై ఎర్ర వర్గాలు మూసల నుండి వచ్చినవికాదు, అనువాద యంత్రం ద్వారా, లేదా ఇతర పద్దతులు ద్వారా వ్యాసాల సృష్టింపులో చేరినవి.
నేను ప్రతిపాదించింది, ఒక మూసను తగినవర్గంతో సృష్టించి ఇలాంటి వ్యాసాల చర్చాపేజీలలో చేరిస్తే, అవి అన్నీ పరిశీలించటానికి ఒక వర్గంలో ఉంటే, వాటిమీద తగినచర్యలు చేపట్టటానికి అవకాశముంటుదనే భావనతో నేను పై ప్రతిపాదన చేసాను. ఆ వర్గాలలో కొన్నిటికి సరిపోలిన వర్గాలు ఇంతకుముందే ఉండి ఉండవచ్చు. ముఖ్యమైన వాటికి సరిపోలిన వర్గం సృష్టించి చేర్చవచ్చు, ముఖ్యం కాని వాటిని తొలగించవచ్చు. అసలు ఈ పనులు అన్నీ చేపట్టాలంటే వ్యాసాలు అన్నీ ఒకేచోట ఉండటానికి వర్గంలో చేరాలిగదా అనే అభిప్రాయంతో, వర్గంలో చేరటానికి మూస:ఆంగ్ల ఎర్రవర్గం గమనిక అనే మూస సృష్టింపుకు ప్రతిపాదించాను.
ఇక "యూజర్ స్క్రిప్టు, గాడ్జెట్లను గానీ నిష్ణాతులైన వాళ్ళు తయారు చేసి, పరీక్షించి మరీ ఉంటారు కాబట్టి వాటిని వాడడంలో ఒక భద్రత ఉంటుంది." ఇలాంటి విషయాలమీద నేను ఏమి స్పందించటంలేదు. వాస్తవంగా మొన్న మొన్నటిదాకా JS అనే Abbreviation కు పూర్తి పదం ఈ మధ్యనే తెలుసుకున్నవాడిని. అయితే ఒకటి మాత్రం నిజం ఏదైనా పరీక్షిస్తేనే గానీ మంచీ, చెడూ తెలిసేది అని నా అభిప్రాయం. నేను చెప్పిన పద్దతి కాకపోయినా మరే పద్దతైనా ఉంటే చెప్పగలరు, ఆ పద్దతినే పాటిద్దాం, మీరైనా, నేనైనా, ఇంకొకరు అయినా తెవికీ బాగుండాలనేకదా కోరుకునేది. ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 15:55, 30 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
పైన చెప్పిన "వాటిని నేను గుర్తించి ఒక వర్గంలో చేరుస్తాను. నిర్వాహకులు వాటిని తొలగించవచ్చు." అనే వ్యాఖ్య ప్రకారం, ఖాళీ చేసిన దాదాపు 110 వర్గాలను "వర్గం:తొలగింపు కోసం ఎదురు చూస్తున్న ఖాళీ వర్గాలు" లో చేర్చాను. ఆ వర్గంలో అప్పటికే ఉన్న ఉపవర్గాలతో పాటు వీటన్నటినీ ప్రణయ్ రాజ్ గారు తొలగించారు. @Pranayraj1985 గారూ, ధన్యవాదాలు. మీరు వాటిని మూకుమ్మడిగా తొలగించినట్టుగా అనిపిస్తోంది. ఏ పధతిలో తొలగించారో వివరిస్తే ఇతర నిర్వాహకులకు కూడా ఈ పద్ధతి గురించి తెలుస్తుంది.__ చదువరి (చర్చ • రచనలు) 13:44, 30 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, "ఇలాంటి విషయాలమీద నేను ఏమి స్పందించటంలేదు. వాస్తవంగా మొన్న మొన్నటిదాకా JS అనే Abbreviation కు పూర్తి పదం ఈ మధ్యనే తెలుసుకున్నవాడిని. అయితే ఒకటి మాత్రం నిజం ఏదైనా పరీక్షిస్తేనే గానీ మంచీ, చెడూ తెలిసేది అని నా అభిప్రాయం." సార్, నన్ను మన్నించండి. నేను మరింత జాగ్రత్తగా, మరింత వివరంగా రాయాల్సింది. తప్పు నాదే. మనస్పూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను.
నేను రాసినది "తొలగింపు వంటి పనులు యూజర్ స్క్రిప్టు వంటి వాటి ద్వారా చెయ్యకుండా ఉంటే మంచిది. మూకుమ్మడి తొలగింపు వంటివి అసలే చెయ్యకూడదు." దీన్ని కేవలం భద్రతను దృష్టిలో ఉంచుకుని రాసాను. అయితే, దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. రామారావు గారూ, మీరు తలపెట్టిన పనులు చేసెయ్యండి. మీతో పాటే నేనూ నడుస్తాను.__ చదువరి (చర్చ • రచనలు) 16:47, 30 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@చదువరి గారూ తప్పు మీదే అనే దానికి నేను పూర్తిగా ఒప్పుకోను, నా వైపు నుండి కూడా కొంతవరకు తప్పు జరిగి ఉండవచ్చు. తర్వాత మీ నుండి నేను క్షమాపణలు కోరుకోవటంలేదు, స్వీకరించనుకూడా!ఎందుకంటే తెవికీలో మీతర్వాత చాలాకాలానికి చేరినవాడిని, మీ నుండి తెవికీలో అవసరమైన మెళుకువలు, సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నవాడిని. తేదీతో కూడిన నిర్వహణ వర్గాల తొలగింపు విషయంలో దాదాపు 10 రోజులు శ్రమించి, సంబందిత మూసలను సవరించి ఒకకొలిక్కి తెచ్చినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 03:22, 31 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
మరొకటి @యర్రా రామారావు గారూ, "వికీ నేటివు కోడును గానీ, ట్వింకిల్ లాంటి గాడ్జెట్లను గానీ నిష్ణాతులైన వాళ్ళు తయారు చేసి, పరీక్షించి మరీ ఉంటారు కాబట్టి వాటిని వాడడంలో ఒక భద్రత ఉంటుంది." - అని రాసాను. ఈ వాక్యంలో "యూజర్ స్క్రిప్టు" అనే మాట నేను వాడలేదు, గమనించండి. ఆ వాక్యం రాయడంలో నా ఉద్దేశం, అక్కడ టెస్టింగు పనికే అంకితమైన టెస్టర్లుంటారు. రకరకాల సినేరియోలను, టెస్ట్ కేసులను పరీక్షిస్తారు అని. తొలగింపులు, మూకుమ్మడి తొలగింపులు అనేవి అంత గట్టిగా పరీక్షలు చేసాకనే ముందుకు వెళ్ళడం మంచిదని. కానీ యూజర్‌స్క్రిప్టులు రాసి మనం ముందుకు వెళ్ళడంపై మీతో నాకు భేదాభిప్రాయం ఏమీ లేదు. నేను రాసినదాన్ని పట్టించుకోకుండా ముందుకు నడవండి సార్.__ చదువరి (చర్చ • రచనలు) 17:04, 30 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari గారూ, వర్గం:తొలగింపు కోసం ఎదురు చూస్తున్న ఖాళీ వర్గాలు పేజీలో ఉన్న వర్గాలను నేను మూకుమ్మడిగా తొలగించలేదు. ఒక్కొక్కటిగా తొలగించాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:48, 31 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari గారూ, నవంబరు 2న టింక్విల్ లోని D-batchని ఉపయోగించి వర్గం:తొలగింపు కోసం ఎదురు చూస్తున్న ఖాళీ వర్గాలు లో ఉన్న 11 ఖాళీ వర్గాలను మూకుమ్మడిగా తొలగించాను. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:51, 4 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

తొలగింపు పద్ధతుల్లో మార్పు వచ్చింది

పేజీల తొలగింపుకు మూడు పద్ధతులు ఉన్నాయని తెలిసినదే - CSD, PROD, Xfd. ఈ మూడింటి గురించి వికీపీడియా:వాడుకరులకు సూచనలు#తొలగింపు_విధానాలు,_పద్ధతులు వద్ద వివరించినట్లు ఈమధ్య రచ్చబండలో ప్రకటించాను. వీటిలో మొదటి మూడవ పద్ధతుల్లో మార్పేమీ లేదు గానీ, రెండవ పద్ధతిలో మార్పు వచ్చింది. PROD పద్ధతిలో తొలగింపు ప్రతిపాదనపై చర్చ పేజీ సృష్టించము, చర్చించము. ఇది వికీపీడియాలో గతం నుండీ ఉన్నపద్ధతే. అయితే కొన్నేళ్ళ కిందట మనం ఈ పద్ధతిలో ఒక మార్పు చేసుకున్నాం. అప్పట్లో ట్వింకిల్ లోని Xfd మెనూ సరిగ్గా పనిచేయనందున తొలగింపు చర్చ పేజీని సృష్టించే పద్ధతిని PROD కు అన్వయించాం. ఇప్పుడు ట్వింకిల్ మామూలు స్థితికి చేరుకుంది కాబట్టి PROD పద్ధతిని దాని అసలు స్థితికి తీసుకెళ్ళాను. వాడుకరులు ఈ మార్పును గమనించవలసినది.__ చదువరి (చర్చ • రచనలు) 17:32, 28 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:26, 29 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

తెవికీబడి/శిక్షణా కార్యక్రమాలు

సభ్యులకు నమస్కారం

తెలుగు వికికీమీడియన్స్ యూజర్ గ్రూప్ అర్ధర్వ్యం లో తెవికీబడి వేదిక ద్వారా " తెలుగు వికీపీడియా నిర్వహణ అంశాలు-ట్వింకిల్ " అనే అంశం మీద, చదువరి గారు శిక్షణ, చర్చ (18.10.2026 కొనసాగింపు) నిర్వహిస్తారు.

గౌరీపతిగారు (ఇంకొంతమంది కూడా అభిప్రాయపడవచ్చు) కోరినట్లు తెవికిబడి పని వేళల మార్పు సమీక్ష.

తేదీ 01.11.2026, ఆదివారం సమయం - మధ్యాహ్నం 2.30pm. గూగుల్ మీట్ లింక్ - https://meet.google.com/kgp-axmz-frf?hs=224.

సభ్యులందరు పాల్గొనవలసినదిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు.

తెవికిబడిలో జరిగిన శిక్షణాంశాలు - వీడియో పాఠాల లింకులు అప్డేట్ చేశాను. ఆసక్తి కలిగినవారు అవసరం ఉన్నవారు ఉపయోగించుకోవచ్చు. లింకు - శిక్షణా కార్యక్రమాలు, వీడియొ పాఠాలు


తెలుగు వికిమీడియన్స్ యూజర్ గ్రూప్. V.J.Suseela (చర్చ) 12:42, 30 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

అలాగేనండీ @Vjsuseela గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:55, 31 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

కొత్త వాడుకరి గుంపులు

కొత్త వాడుకరి గుంపుల అవసరం గురించి, వాడుకరులకు ఎక్స్టెండెడ్ అనుమతులు ఇచ్చే విషయం గురించీ ఈమధ్య ఇక్కడ మాట్లాడుకున్నాం. స్పందించిన వారందరూ కావాలనే అన్నారు. దానిపై చర్యలు మొదలుపెట్టాల్సిందిగా నిర్వాహకులను కోరుతున్నాను.__ చదువరి (చర్చ • రచనలు) 04:58, 31 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

దీనికి ముందుకు వచ్చే వారు, వారు దేనికి సంబంధించిన ఎక్స్టెండెడ్ అనుమతులకు సమ్మతి తెలుపుతూ పేర్లు నమోదు చేసుకుంటే దానిని పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపట్టాలని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 05:52, 31 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari, @యర్రా రామారావు గార్లకు నమస్కారం. కొత్త వాడుకరి గుంపులు / ఎక్స్‌టెండెడ్ అనుమతుల ఏర్పాటుకు సంబంధించి మీరందరూ పేర్కొన్న ప్రతిపాదనలు ఎంతో సబవుగా ఉన్నాయి.
ఈ విషయంలో మనం తక్షణమే చేయవలసిన పనులు:
  1. గతంలో పవన్ సంతోష్ గారు చెప్పినట్లుగా... తెవికీలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న, కొత్తగా కావాల్సిన హక్కుల జాబితా, వాటి బాధ్యతలు ఏమిటో స్పష్టపరిచే ఒక పేజీని వెంటనే ఏర్పాటు చేసుకోవాలి.
  2. యర్రా రామారావు గారు సూచించిన విధంగా... ఈ బాధ్యతలను నిర్వహించడానికి ఆసక్తి, అర్హత ఉన్న వాడుకరులు ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకునేలా ఒక వేదికను సిద్ధం చేసుకోవాలి.
  3. తెవికీ బడిలో భాగంగా దీనిపై ఒక ప్రత్యేక సెషన్‌ను ఏర్పాటు చేసి, స్టీవార్డుల సలహాలతో మరింత స్పష్టత తెచ్చుకుంటూ తదుపరి అధికారిక ప్రక్రియను ప్రారంభించాలి.
ఈ దిశగా సత్వర చర్యలు చేపట్టి పెండింగ్‌లో ఉన్న ఈ పనులను పూర్తి చేద్దాం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:03, 31 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Pranayraj1985 గారూ, అవునండి, ఏ వాడుకరి గుంపులు కావాలి, వాటికి ఉండే హక్కులేంటి వగైరాలను డాక్యుమెంటు చెయ్యాలి. ఈ ఎక్స్టెండెడ్ అనుమతుల ద్వారా ఏయే పనులు చెయ్యవచ్చో, వాటిని ఎలా చెయ్యాలో వివరించే పేజీలను సృష్టించాలి లేదా విస్తరించాలి.
  1. కొత్తగా ఏయే వాడుకరి గుంపులను ప్రవేశపెట్టాలి అనేదానిపై ఒక చర్చ జరిపి దానిపై సముదాయ నిర్ణయాన్ని సిద్ధం చెయ్యాలి. అంది ఉంటే తప్ప ఆ అనుమతులు మనకు ఇవ్వరనుకుంటాను.
  2. ఎక్స్టెండెడ్ అనుమతులు కావాలని కోరే వాడుకరులకు వాటిని అభ్యర్థించేందుకు ఒక పేజీ పెట్టాలి. అన్నీ ఒకచోటనే అభ్యర్థించవచ్చు. ఇక్కడ తీసుకునే నిర్ణయం మేరకే అభ్యర్థులకు ఆయా అనుమతులు లభిస్తాయి.
ఈ రెండు పనులూ ఒక్కసారే జరగవచ్చు.__ చదువరి (చర్చ • రచనలు) 12:58, 31 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
  1. కొత్త గుంపులు, వాటికుండే హక్కులు: ఎన్వికీలో en:Wikipedia:User groups అనే పేజీలో ఈ సంగతులు ఉన్నాయి. దాన్ని అనువదించుకోవాలి. దానికి సంబంధించిన తెలుగు పేజీ వికీపీడియా:సభ్యుల అనుమతి పట్టిక. ప్రస్తుతం ఇందులో సమాచారం ఏమి లేదు, బాగా విస్తరించాలి.
  2. సముదాయ నిర్ణయం కోసం: కొత్తగా ప్రవేశపెట్టాల్సిన గుంపుల గురించి, రచ్చబండ (పాలసీలు) పేజీకి అనుబంధంగా ఒక చర్చను మొదలుపెట్టవచ్చు.
  3. అభ్యర్థనలు ఎక్కడ చెయ్యాలి: మన నిర్వాహక హోదా కొరకు అభ్యర్థన పేజీ లాగా ఒక పేజీ పెట్టుకోవచ్చు. లేదా ఎన్వికీ లోని en:Wikipedia:Requests for permissions పేజీని పరిశీలించవచ్చు.
ఓవైపు ఇవి జరుగుతూ ఉండగా, కొత్త గుంపుల కోసం ఎక్కడ అభ్యర్థించాలి, అభ్యర్థనలో భాగంగా సముదాయ నిర్ణయంతో పాటు, ఇంకా ఏమైనా అక్కడ ఇవ్వాలా అనేది తెలుసుకోవాలి. పరిశీలించండి.__ చదువరి (చర్చ • రచనలు) 13:19, 31 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ఔను. కానీ ఎక్కడ నమోదు చేసుకోవాలి?__ చదువరి (చర్చ • రచనలు) 12:55, 31 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
గతంలో ప్రాథమికంగా కొత్త వాడుకరి గుంపులు అవసరం అనేదానిమీద జరిగిన చర్చలో అందరూ అవసరమనే అభిప్రాయం మాత్రమే తెలియపర్చాం, ఇది క్రియకట్టటానికి ముందుకు తీసుకువెళ్లాలంటే పైన చదువరి గారూ, ప్రణయ్ రాజ్ గారు చెప్పినట్లు ముందుగా వికీపీడియా:సభ్యుల అనుమతి పట్టిక/వాడుకరి హక్కుల గుంపులు నియమాలు అనే ఉప పేజీలో. • గుంపు పేరు
• ఇవ్వాల్సిన అనుమతులు (ఉదా. patrol, rollback, editprotected వంటివి)
• ఎవరు ఇవ్వగలరు/తొలగించగలరు (నిర్వాహకులా, బ్యూరోక్రాట్లా)
• అర్హతలు, నియామక పద్ధతి (అభ్యర్థన పేజీ, చర్చ కాలవ్యవధి)
• స్వయంచాలకంగా ఇచ్చే గుంపా (ఉదా. ఇన్ని దిద్దుబాట్లు, ఇన్ని రోజుల ఖాతా) లేక మాన్యువల్ గుంపా
• గ్రూపులో ఉండాల్సిన కనీస సభ్యుల సంఖ్య ఇలాంటి నియమాలపై చర్చజరగాలనుకుంటున్నాను, ఆతర్వాత మాత్రమే సభ్యలు నమోదు జరగాలని నా అభిప్రాయం, కాస్త సమయం కూడా పట్టవచ్చుఅనుకుంటున్నాను యర్రా రామారావు (చర్చ) 14:31, 31 అక్టోబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

నిర్వహణేతర ఇంగ్లీషు ఎర్రవర్గాలపై చర్యలు

నిర్వహణకు సంబంధించి మనకు అనేక ఇంగ్లీషు వర్గాలున్నాయి. ఇవి దాదాపుగా అన్నీ మూసల నుండి పుట్టుకొచ్చేవే. నిర్వహణ వర్గాలు కాబట్టి ఎవరం పెద్దగా పట్టించుకోం. అందుకే ఈ వర్గాల్లో చాలా వర్గాలు ఎర్రగా ఉంటాయి. మరో రకం ఇంగ్లీషు ఎర్రవర్గాలున్నాయి. ఇంగ్లీషువికీ పేజీలను అనువదించి ప్రచురించేటపుడు, వాటి లోని వర్గాలను కూడా ఉన్నవి ఉన్నట్టుగా ఇక్కడకు తెచ్చి ప్రచురించడం వలన వచ్చిన వర్గాలు. ఇవి నిర్వహణ వర్గాలు కావు, మామూలు కంటెంటు వర్గాలే. అవి తెలుగులో ఉండాలి, నీలివర్గాలుగా ఉండాలి. ఇలాంటి నిర్వహణేతర ఇంగ్లీషు ఎర్రవర్గాలను గుర్తించి, తొలగించడమే బహుశా యర్రా రామారావు గారు తలపెట్టిన పని.

ఈ పనిలో రెండు భాగాలు: 1. ఏయే పేజీల్లో ఈ ఎర్రవర్గాలు ఉన్నాయో గుర్తించడం. 2. ఎర్రవర్గాలను తీసెయ్యడం. ఈ పని వేగంగా చెయ్యాలి. భద్రంగా చెయ్యాలి. ఇది "రీడ్-వోన్లీ" పని కాదు, "రైట్" చెయ్యాలి. కాబట్టి కొత్తగా యూజర్ స్క్రిప్టు రాయకుండా ఈసరికే ఉన్న పరికరాలను, వీలైనంత తక్కువ మార్పుచేర్పులతో వాడుకుంటే సేఫని భావించాను.

  1. ఏయే పేజీల్లో ఈ ఎర్రవర్గాలు ఉన్నాయో గుర్తించడం. కొన్ని వేల పైచిలుకు పేజీల్లో ఇలాంటి వర్గాలుంటాయి కాబట్టి, దీన్ని మానవికంగా చెయ్యాలంటే చాలా సమయం పడుతుంది. క్వెరీ ద్వారా అలాంటి 4 వేల పైచిలుకు పేజీలను గుర్తించాను.
  2. ఎర్రవర్గాలను తీసెయ్యడం: ఇంగ్లీషు వికీలో NoRedCat అనే యూజర్ స్క్రిప్టు సరిగ్గా ఇదే పని చేస్తోందని గమనించాను. అయితే ఒక్కొక్క పేజీనే మానవికంగా తెరిచి ఈ స్క్రిప్టు నడపాలి. దీన్ని ఆటోమాటిగ్గా నడపగలిగితే వేగంగా చేసెయ్యొచ్చు. అందుకు wAwB వాడి చెయ్యవచ్చని తెలిసింది. ఇది AWB మీద ఆధారపడి చేసినదే. AWB విండోస్ డెస్క్‌టాప్ అప్లికేషను కాగా, wAwB అనేది వికీలోనే బ్రౌజరులో నడిచే అప్లికేషను.

తెలుగుకు అవసరమైన కొద్ది మార్పుచేర్పులతో, ఈ రెండూ కలిపి వివిధ పేజీలపై నడిపి పరీక్షించాను. అయితే, ఏ పేజీని "సేవ్" చెయ్యలేదు. AWB, సేవ్ చెయ్యకముందే ఏయే మార్పులు చేసిందో చూపిస్తుంది. అలా చేసి, మార్పులు బాగానే చేస్తోందని గమనించాను. ఎందుకు సేవ్ చెయ్యలేదంటే, నాకు (వాడుకరి:Chaduvari కి) AWB అనుమతులు లేవు. (వాడుకరి:ChaduvariAWBNew కి ఉన్నాయి). అయితే ఈ పని ChaduvariAWBNew తో చెయ్యలేను. అంచేత Chaduvari కి అనుమతులు ఇమ్మని రాత్రి వికీపీడియా చర్చ:AutoWikiBrowser/CheckPage పేజీలో అడిగాను. నిర్వాహకులు ఎవరైనా ఈ అనుమతి ఇవ్వవచ్చు, అధికారులే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ అభ్యర్థన పరిశీలించవలసినదిగా నిర్వాహకులకు విజ్ఞప్తి.__ చదువరి (చర్చ • రచనలు) 02:13, 1 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

@Chaduvari గారూ ఈ ఖాతాకు AWB అనుమతి ఇచ్చాను, పరిశీలించి ధృవీకరించగలరు. యర్రా రామారావు (చర్చ) 03:05, 1 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, అనుమతి రాలేదు. వికీపీడియా:AutoWikiBrowser/CheckPageJSON పేజీలో కూడా నా వాడుకరిపేరు చేర్చాలి, చూడండి.__ చదువరి (చర్చ • రచనలు) 13:05, 1 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari AWB వాడుకరిపేరు:Chaduvari; నా ప్రస్తుత తెవికీ వాడుకరిపేరు: Chaduvari (చర్చ • మార్పుచేర్పులు • సంఖ్య • మొత్తం • చిట్టాలు • పేజీ తరలింపులు • నిరోధాల చిట్టా • ఈమెయిలు) అని అన్నారు.ChaduvariAWB అని ఉండాలికదా?తెలుపగలరు.వికీపీడియా:AutoWikiBrowser/CheckPage దీనిలో పరిశీలించగలరు.వికీపీడియా:AutoWikiBrowser/CheckPageJSON దీనిని కూడా పరిశీలించగలరు యర్రా రామారావు (చర్చ) 13:40, 1 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
@యర్రా రామారావు గారూ, వికీపీడియా:AutoWikiBrowser/CheckPage లో Chaduvari ఉండాలి కదా? ChaduvariAWB మార్చారు. దాన్ని మళ్ళీ Chaduvari గా మార్చండి.__ చదువరి (చర్చ • రచనలు) 16:14, 1 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
మార్చాను సార్ యర్రా రామారావు (చర్చ) 16:15, 1 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
wAwB తో కొన్ని పేజీల్లో ఎర్రవర్గాలను తీసేసాను. అనుకున్నట్టుగానే పనిచేసింది.
  1. ఇంగ్లీషు ఎర్రవర్గాలను తీసేసింది.
  2. తెలుగు ఎర్రవర్గాలను అలాగే ఉంచింది.
  3. డిఫాల్టుసార్ట్ ను అలాగే ఉంచేసింది.
  4. ఒకదాని తరువాత ఒక పేజీని తీసుకుంది.
  5. నేను బాట్ మోడ్‌లో నడపలేదు. అది ఉంది.
  6. ఒక సమస్య: wAwB లో పేరుబరులను ఇంగ్లీషువే వాడారు. అంచేత మన మీడియావికీ:, వికీపీడియా: వగైరాలను గుర్తించడం లేదు. ఆ సంగతి దాని యజమానికి రాసాను. దాన్ని ఆయన సవరించాక, ఇక వాడుకోవచ్చు. ఈలోగా పరీక్షించడం కోసం wAwB ని స్థానికంగా స్థాపించాను. ఇది కేవలం తాత్కాలికమే. అసలు పేజీలో మార్పులు చేసాక, స్థానికంగా సృష్టించిన పేజీని తొలగిద్దాం.
__ చదువరి (చర్చ • రచనలు) 05:02, 2 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
నేనూ ఇటీవల మార్పులలో గమనించాను, మంచి ప్రయత్నం, కోరిన వర్గాలలో ఆంగ్ల ఎర్ర వర్గాలు, వ్యాసాలలో చూడగానే ఎబ్బెట్టుగా కనిపించేవి. యర్రా రామారావు (చర్చ) 05:12, 2 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
బాట్ మోడ్‌లో కూడా నడిపాను. ఇది కూడా స్థానిక కూర్పులోనే నడీపాను. విజయవంతంగా నడిచింది. ఒరిజినల్ wAwB డెవలపరుకు కింది రెండు అభ్యర్థనలు చేసాను:
  • మన పేరుబరులను గుర్తించడం లేదు. ఆ డెవలపరు వెంటనే స్పందించి దాన్ని సరిచేసారు. ఇప్పుడు పనిచేస్తోంది.
  • బాట్ మోడులో పనిచేసే అంశం లేదు. అది కావాలని అడిగాను.
స్థానిక కూర్పు అన్ని పనులూ బాగానే చేస్తోందని నిర్థారణ అయింది కాబట్టి, ఇక నేను దీనిపై పరీక్షలు చెయ్యడం ఆపేస్తున్నాను. ఒరిజినల్ wAwB లొ బాట్ మోడు సిద్ధమైతే, ఇక స్థానిక కూర్పును తీసేసి దాన్నే వాడదాం.__ చదువరి (చర్చ • రచనలు) 10:29, 2 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ఒక అంశం ప్రాబ్లమ్ సాల్యు అయింది. ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 10:43, 2 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
noredcats యూజర్ స్క్రిప్టులో కొంతకోడునూ, wAwB నీ వాడి నిర్వహణేతర ఇంగ్లీషు ఎర్రవర్గాలను తీసేసాను. 600 పైచిలుకు పేజీల్లో ఈ వర్గాలను తీసేసాను. మానవికంగా చేర్చే ఇంగ్లీషు ఎర్రవర్గాలను ఈ పద్ధతిలో తీసెయ్యవచ్చు. మూసల ద్వారా చేరే వర్గాలను - ఏ వర్గాలనైనా - మూసల లోనే తీసెయ్యగలం, నేరుగా తీసెయ్యలేము.__ చదువరి (చర్చ • రచనలు) 11:13, 4 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

39వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తెవికీ స్టాల్ ఏర్పాటుకు సంబంధించి ఆన్‌లైన్ సమావేశం ఆహ్వానం

తెవికీ (తెలుగు వికీపీడియా) సముదాయం ఆధ్వర్యంలో 39వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన (Hyderabad Book Fair)లో తెవికీ స్టాల్ ఏర్పాటుకు సంబంధించి సమాలోచనలు జరపడానికి ఒక ఆన్‌లైన్ సమావేశం నిర్వహించబడుతోంది. లింక్: https://w.wiki/fnfD

సమావేశ వివరాలు:

తేదీ: 2026 నవంబర్ 7, శనివారం

సమయం: సాయంత్రం 7:30 గంటలకు

తెలుగు వికీపీడియా అభివృద్ధికి, పుస్తక ప్రదర్శనలో స్టాల్ నిర్వహణకు తగిన సూచనలు,  సలహాలు అందించడానికి తెవికీ సభ్యులందరూ ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి.

గూగుల్ మీట్ లింక్ - https://meet.google.com/kgp-axmz-frf?hs=224.

గమనిక: సమావేశంలో పాల్గొనలేని వారు మీ సలహాలు, సూచనలు ఇక్కడ తెలపగలరు.

ధన్యవాదాలు.

బత్తిని వినయ్ కుమార్ గౌడ్

తెలుగు వికిమీడియన్స్ యూజర్ గ్రూప్. Batthini Vinay Kumar Goud (చర్చ) 07:19, 2 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

అలాగేనండీ @Batthini Vinay Kumar Goud గారు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:56, 2 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

తేదీ ఆధారిత నిర్వహణ వర్గాలు, ఎర్రవర్గాలు, ఇంగ్లీషు వర్గాలు

నేను ఇటీవల వివిధ రకాల వర్గాలపై పనిచేసాను. వాటి వివరాలివి:

  1. తేదీ ఆధారిత నిర్వహణ వర్గాలు: అన్ని రకాలైన - ఇంగ్లీషు, తెలుగు, ఎర్ర, నీలి - తేదీ ఆధారిత్ నిర్వహణ వర్గాలు చెలామణీ లోకి రాకుండా దాదాపు 150 మూసల్లో మార్పులు చేసాను. ఆ విధంగా 1700 పైచిలుకు వర్గాలను తీసేసాను. అవి ఇక రావు. కానీ నేను గమనించని వేరే మూసల ద్వారా వచ్చే అవకాశం ఉండవచ్చు. వాటిని గమనించినవారు, తామే ఆయా మూసల్లో మార్పులు చేసి ఆ వర్గాలను తొలగించవచ్చు. ఎలా చెయ్యలో పేజీలో చూసి తెలుసుకోవచ్చు.
  2. నిర్వహణేతర, ఇంగ్లీషు ఎర్రవర్గాలు: ఇవి కంటెంటు వర్గాలు. ఎర్రవర్గాలు. ఇంగ్లీషు వర్గాలు. ఇలాంటి వర్గాలు ఏయే పేజీల్లో ఉన్నాయో ఒక జాబితా తయారు చేసాను. సుమారు 4000 పేజీలు ఉంటాయి. వాటిని కొన్ని ఉపకరణాలను వాడి ఆటోమాటిగ్గా తీసేసే పద్ధతిని తయారుచేసాను. విజయవంతంగా పరీక్షించాను. ఎన్వికీ లోని ఒక ఉపకరణంలో ఒక అంశం కావాలని అక్కడి డెవలపరును అడిగాను. అది సిద్ధమైతే, ఇక ఆ 4000 పేజీల పని పట్టవచ్చు. అది సిద్ధనమయ్యాక చేస్తాను. లేదా ఎవరైనా చేస్తానంటే చేసెయ్యవచ్చు.

ఇక, ఎర్ర/ఇంగ్లీషు/నిర్వహణ/నిర్వహ్ణేతర వర్గాలకు సంబంధించి నేను తలపెట్టిన పనులు.

  • ఇంకా చెయ్యాల్సినవి: ఇంగ్లీషులో ఉన్న నిర్వహణ వర్గాల పేర్లను తెలుగు లోకి మార్చలేదు. ఈ పని చెయ్యాలని నేను తలపెట్టలేదు. సందర్భవశాత్తూ కొద్ది వర్గాల్లోనే మార్చాను. ఇవి ఆటోమాటిగ్గా చెయ్యగలిగేవి కావు. మానవికంగా చెయ్యాల్సిందే. ఇలాంటివి గమనించినపుడు ఎవరికి వారే మార్చెయ్యండి. లేదా వికీపీడియా: పేరుబరిలో ఏదైనా కొత్త పేజీ తెరిచి, అందులో రాయండి - వికీపీడియా:దిగుమతి అభ్యర్థనలు పేజీ లాగా. వీలున్నపుడు ఎవరైనా చేస్తారు.__

చదువరి (చర్చ • రచనలు) 10:46, 2 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

చిన్నగా అన్నీ ఎవరి దృష్టికి వచ్చినప్పుడు వారు కొన్ని మానవీయంగా చేయటమే మంచి పద్దతి. యర్రా రామారావు (చర్చ) 11:01, 2 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం
ధన్యవాదాలు @Chaduvari గారు. వికీపీడియాలో పెద్ద పనులను ఆటోమేషన్‌తో పూర్తి చేస్తూ, చిన్నచిన్న మార్పులను ఎవరికి వారు దృష్టిలో పెట్టుకుని మానవీయంగా చేయడం చాలా మంచి పద్ధతి. ఇది సముదాయ సమిష్టి బాధ్యతను పెంచుతుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:57, 4 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

WikiRefine: A 15-Day Wikipedia Article Improvement Campaign

Hello everyone, The Open Knowledge Initiatives (OKI) team is pleased to announce WikiRefine, a 15-day article improvement campaign taking place from 7 to 21 November 2026. We invite editors from all participating language communities to take part. The campaign aims to encourage Wikimedians to improve the overall quality of Wikipedia articles, with a focus on references, article structure, readability, images, internal links and other aspects of content development.

Article lists

For this campaign, we have prepared lists based on the 100 most-read articles from the last five years for participating language Wikipedias. You can find the article lists and other campaign information here: View the article lists

Evaluating article improvements

We will be using the WikiEval tool, developed to support the evaluation of Wikipedia content during campaigns. It will help assess article quality and track improvements made throughout WikiRefine.

What happens after the campaign?

WikiRefine will also serve as a preparatory activity for a follow-up in-person event focused on qualitative improvements to local-language Wikipedias. We aim to bring together the top two participants (from India only) from each participating community. Their contributions will be assessed by a jury of experienced Wikimedians familiar with the respective languages. We encourage each community to identify up to three organisers, ensuring diverse representation of genders and both new and experienced Wikimedians. Jury members should be experienced contributors with a good understanding of their respective language Wikipedias.

We invite everyone to participate, improve articles and help make knowledge in our languages more comprehensive and accessible. (Community Sign-up page)

For more information, please visit the WikiRefine project page.

Note: A few language Wikipedia article lists have not yet been added to the dedicated page due to a technical issue with the tool. We are working to resolve this and aim to add them before the campaign begins. Thank you! MediaWiki message delivery (చర్చ) 17:11, 4 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం

వికీ రిఫైన్ - ఎడిట ధాన్

తెలుగు వికీపీడియాలో వీక్షణలు అధికంగా ఉన్న 100 వ్యాసాలు మెరుగు పరిచే ఎడిట్ తాన్, 15 రోజులు జరుగుతుంది. నవంబర్ 2026, 7 నుండి 21 వరకు. వివరాలకు WikiRefine లింక్ https://meta.wikimedia.org/wiki/IIITH-OKI/Edit-a-thon/WikiRefine చూడండి. నిర్వాహకులు ఎంపిక చేసిన వ్యాసాల జాబితా ఈ లింకులో ( article lists ) చూడవచ్చును.

స్థానిక భాషా వికీపీడియాలలో గుణాత్మక మెరుగుదలకోసం OKI నిర్వహిస్తున్న ఈ వికీరిఫైన్ పోటీ తదుపరి జరుగనున్న ప్రత్యక్ష కార్యక్రమానికి ఒక సన్నాహక కార్యక్రమంగా కూడా ఉపయోగపడుతుంది. పాల్గొనే ప్రతి కమ్యూనిటీ నుండి అగ్రస్థానంలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులను (భారతదేశం నుండి మాత్రమే) ఎంపిక చేసి ఒక చోట చేర్చడమే వికీరిఫైన్ లక్ష్యం.

ఈ కార్యక్రమం తెవికీని బలోపేతం చేయగలదు. తెవికీ సభ్యులు ఈ లింకులు పరిశీలించి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. పూర్తి వివరాలతో ప్రాజెక్ట్ పేజీ త్వరలో ప్రకటిస్తాము. ధన్యవాదాలు. తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ V.J.Suseela (చర్చ) 13:15, 6 నవంబరు 2026 (UTC)ప్రత్యుత్తరం