హిడెకి టోజో
టోజో హిడెకి | |
|---|---|
東條 英機 | |
1941లో టోజో | |
| జపాన్ ప్రధాన మంత్రి | |
| In office 18 అక్టోబరు 1941 – 22 జూలై 1944 | |
| చక్రవర్తి | హిరోహితో |
| అంతకు ముందు వారు | ఫుమిమారో కొనోయే |
| తరువాత వారు | కునియాకి కోయిసో |
| ఆయుధాల మంత్రి | |
| In office 1 నవంబరు 1943 – 22 జూలై 1944 | |
| అంతకు ముందు వారు | పదవి స్థాపించబడింది |
| తరువాత వారు | గింజిరో ఫుజివారా |
| సైన్య మంత్రి | |
| In office 22 జూలై 1940 – 22 జూలై 1944 | |
| అంతకు ముందు వారు | షున్రోకు హాటా |
| తరువాత వారు | హజిమే సుగియామా |
| వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి | |
| In office 8 అక్టోబరు 1943 – 1 నవంబరు 1943 | |
| అంతకు ముందు వారు | నొబుసుకే కిషి |
| తరువాత వారు | చికుహే నకాజిమా (1945) |
| విద్యా మంత్రి | |
| In office 20 ఏప్రిల్ 1943 – 23 ఏప్రిల్ 1943 | |
| అంతకు ముందు వారు | కునిహికో హషిదా |
| తరువాత వారు | నాగకాగే ఒకాబే |
| జపాన్ విదేశాంగ మంత్రి | |
| In office 1 సెప్టెంబరు 1942 – 17 సెప్టెంబరు 1942 | |
| అంతకు ముందు వారు | షిగెనోరి టోగో |
| తరువాత వారు | మసాయుకి టాని |
| హోం వ్యవహారాల మంత్రి | |
| In office 18 అక్టోబరు 1941 – 17 ఫిబ్రవరి 1942 | |
| అంతకు ముందు వారు | హరుమిచి తనాబే |
| తరువాత వారు | మిచియో యుజావా |
ఇంపీరియల్ రూల్ అసిస్టెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడుIn office
18 అక్టోబరు 1941 – 22 జూలై 1944అంతకు ముందు వారుఫుమిమారో కొనోయేతరువాత వారుకునియాకి కోయిసోఇంపీరియల్ జపాన్ సైన్య జనరల్ స్టాఫ్ కార్యాలయం అధిపతిIn office
21 ఫిబ్రవరి 1944 – 18 జూలై 1944అంతకు ముందు వారుహజిమే సుగియామాతరువాత వారుయోషిజిరో ఉమెజు
వ్యక్తిగత వివరాలుజననం1884 డిసెంబరు 30
కోజిమాచి, టోక్యో, జపాన్మరణం1948 డిసెంబరు 23 (వయసు: 63)
సుగామో కారాగారం, టోక్యో, జపాన్రాజకీయ పార్టీఇంపీరియల్ రూల్ అసిస్టెన్స్ అసోసియేషన్ (1940–1945)జీవిత భాగస్వామి
సంతానం7బంధువులుయుకో టోజో (మనవరాలు)చదువు
పురస్కారాలు
సంతకం
Military serviceAllegianceజపాన్ సామ్రాజ్యంBranch/serviceఇంపీరియల్ జపాన్ సైన్యంRankజనరల్Battles/wars
| హిడెకి టోజో | |
|---|---|
| నేరాలు | శాంతికి వ్యతిరేక నేరాలు దురాక్రమణ నేరాలు యుద్ధ నేరాలు మానవత్వానికి వ్యతిరేక నేరాలు |
| జరిమానా | మరణదండన |
| నేరస్థాపన స్థితి | ఉరిశిక్ష అమలు చేయబడింది |
Japanese nameKanaとうじょう ひできKyūjitai東條 英機Shinjitai東条 英機
| Transcriptions | |
|---|---|
| Romanization | Tōjō Hideki |
టోజో హిడెకి (1884 డిసెంబరు 30 – 1948 డిసెంబరు 23) రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో 1941 నుండి 1944 వరకు జపాన్ ప్రధాన మంత్రిగా పనిచేసిన జపాన్ సైనికాధికారి, రాజకీయ నాయకుడు. అతను కఠినమైన అతి జాతీయవాది (అల్ట్రా నేషనలిస్ట్), సామ్రాజ్య విస్తరణకు మద్దతుదారుడు. ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వం, సైన్యంపై నిరంకుశ నియంత్రణను నెలకొల్పాడు. అతని పాలన దూకుడైన యుద్ధ విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహంతో జరిగిన హింస, జపాన్ జాతీయవాదం పేరుతో ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో జరిగిన విస్తృత స్థాయి సామూహిక దారుణాలకు ప్రసిద్ధి చెందింది. జపాన్ సామ్రాజ్యంలో అతనికి ఉన్నత న్యాయస్థాన హోదా, అనేక సైనిక పురస్కారాలు లభించాయి.
టోజో టోక్యోలో ఒక సైనిక, సమురాయి కుటుంబంలో జన్మించాడు.[1] తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఇంపీరియల్ జపాన్ సైనిక అకాడమీలో విద్యాభ్యాసం చేసి, 1905లో ఇంపీరియల్ జపాన్ సైన్యం (IJA)లో సైనిక జీవితాన్ని ప్రారంభించాడు. 1909లో కత్సుకో ఇటోను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలతో కలిపి ఏడుగురు సంతానం కలిగారు.[2]
తరువాత ఆర్మీ వార్ కాలేజిలో చదివాడు. అతని కఠిన జాతీయవాద భావజాలం జపాన్ సైన్యంలో ఉన్న కట్టుదిట్టమైన వర్గాలకు అతడిని దగ్గర చేసింది. 1919 నుండి 1922 వరకు జర్మనీలో సైనిక అటాషేగా పనిచేసి యూరోపియన్ సైనిక వ్యూహాలను అధ్యయనం చేశాడు. అనంతరం సైన్యంలో వేగంగా పదోన్నతులు పొందుతూ 1934లో జనరల్ హోదాకు చేరుకున్నాడు. 1937 మార్చిలో మంచుకువోలోని క్వాంటుంగ్ సైన్యంకు చీఫ్ ఆఫ్ స్టాఫ్గా నియమితుడై ఇన్నర్ మంగోలియా, చహార్-సుయువాన్ ప్రాంతాల్లో చైనా దళాలపై సైనిక చర్యలకు నాయకత్వం వహించాడు. 1938లో టోక్యోకు తిరిగి పిలవబడి యుద్ధ శాఖ ఉపమంత్రిగా, 1940 జూలైలో ప్రధానమంత్రి ఫుమిమారో కొనోయే మంత్రివర్గంలో యుద్ధ మంత్రిగా నియమితుడయ్యాడు.
జపాన్ పాశ్చాత్య దేశాలతో సంపూర్ణ యుద్ధానికి చేరువవుతున్న సమయంలో, అమెరికా, బ్రిటన్ మరియు వాటి మిత్రదేశాలపై ముందస్తు దాడి చేయాలని అత్యంత బలంగా వాదించిన నాయకులలో టోజో ఒకడు. జపాన్ సామ్రాజ్య లక్ష్యాల సాధనకు సైనిక ఘర్షణ తప్పదని అతను నమ్మాడు. 1941 అక్టోబరు 17న కొనోయే స్థానంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. అదే సమయంలో యుద్ధ మంత్రి, హోం మంత్రి వంటి కీలక పదవులను కూడా తన వద్ద ఉంచుకోవడం వల్ల యుద్ధ నిర్వహణపై దాదాపు సంపూర్ణ నియంత్రణ సాధించాడు.
అతని నాయకత్వంలోనే జపాన్ పెర్ల్ హార్బర్‌పై దాడి జరిపి, ఆగ్నేయాసియా మరియు పసిఫిక్ ప్రాంతాల్లో తన సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరించింది. ఈ కాలంలో ఇంపీరియల్ జపాన్ సాయుధ దళాలు ఆక్రమిత ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో యుద్ధ నేరాలుకు పాల్పడ్డాయి. వాటిలో బలవంతపు శ్రమ, ఆకలితో చంపడం, యుద్ధ ఖైదీలు (POWs), పౌరులపై అమానుష హింస, హత్యలు వంటి చర్యలు ఉన్నాయి.
1944 నాటికి జపాన్ వరుస సైనిక పరాజయాలను ఎదుర్కొని, యుద్ధ పరిస్థితి పూర్తిగా దిగజారడంతో టోజో 1944 జూలై 18న రాజీనామా చేయవలసి వచ్చింది. 1945 ఆగస్టులో జపాన్ బేషరతు లొంగుబాటు అంగీకరించిన తరువాత అతను ఆత్మహత్యకు ప్రయత్నించినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం మిత్రరాజ్యాల దళాలు అతన్ని అరెస్టు చేశాయి.[3]
తరువాత అతనిపై దూర ప్రాచ్యానికి అంతర్జాతీయ సైనిక ట్రైబ్యునల్ (IMTFE)లో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేక నేరాలు తదితర అభియోగాలపై విచారణ జరిగింది. దోషిగా తేలడంతో మరణదండన విధించబడింది. 1948 డిసెంబరు 23న అతనికి ఉరిశిక్ష అమలు చేశారు. జపాన్ యుద్ధకాల ప్రభుత్వంలో అతని పాత్ర, దూకుడైన సామ్రాజ్య విస్తరణకు చేసిన మద్దతు, యుద్ధ సమయంలో జరిగిన అమానుష చర్యలకు అతనిపై మోపబడిన బాధ్యతల కారణంగా, హిరోహితో పాలనలోని ప్రారంభ షోవా కాలంలో అత్యంత అపఖ్యాతి చెందిన వ్యక్తులలో టోజో హిడెకి ఒకడిగా గుర్తించబడుతున్నాడు.[4]
నోట్సు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Baudot, Marcel. The Historical encyclopedia of World War II. p. 455.
- ↑ Baudot, Marcel. The Historical encyclopedia of World War II. p. 455.
- ↑ Toland, John. The Rising Sun: The Decline and Fall of the Japanese Empire, 1936–1945. p. 871–872.
- ↑ "Japanese war crimes trial begins". History. Retrieved 2013-12-22.
బాహ్య లింకులు
[మార్చు]
Media related to Hideki Tōjō at Wikimedia Commons