Jump to content

హమ్మింగ్ పక్షి

వికీపీడియా నుండి

హమ్మింగ్ పక్షి
Female black-chinned hummingbird
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Subclass:
Infraclass:
(unranked):
Order:
Family:
Trochilidae

Vigors, 1825
Subfamilies

Phaethornithinae
Trochilinae


For a taxonomic list of genera, see:

For an alphabetic species list, see:

హమ్మింగ్ బర్డ్స్ (ఝంకార పక్షులు) రెక్కల్ని త్వరితంగా ఆడిస్తూ రొద చేస్తూ పూలపై తేలాడి పూదేనె త్రాగే చిన్న చిన్న పక్షులు. ఇవి ప్రపంచంలోనే అతి చిన్న పక్షులుగా రికార్డులకెక్కాయి. పరిమాణంలో యివి 5 సెం.మీ నుంచి 13 సెం.మీ వఱకు పొడవు కలిగి ఉంటాయి. వీటిలో పలు జాతులుంటాయి. ఈ పక్షులు అమెరికా ఖండాలకు పరిమితమై ఉంటాయి. వీటిలో కొన్ని జాతులు వలసపక్షులు.

ఎగురుతూనే తేనెను ఆస్వాదిస్తాయి.

[మార్చు]
  • వెనక్కి కూడా ఎగిరే సత్తా వీటికుంది. ఈ పక్షులు గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలవు.
    చక్కెర నీటికై వచ్చిన ఝంకారపక్షి
  • ఇవి సెకనుకు 200 సార్లు రెక్కలాడించగలవు!
  • వీటిల్లో మగ పక్షుల ముక్కులు కాస్త పొడుగ్గా, వాడిగా ఉంటాయి. అవి వాటి పదునైన ముక్కునే కత్తుల్లా వాడుకుంటాయిట. అంటే శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ముక్కునే ఆయుధాల్లా ఉపయోగిస్తాయన్నమాట. న్యూ మెక్సికో స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఇన్నాళ్లూ ఈ పక్షులు చురుకైన ముక్కుల ద్వారా పూల మకరందాన్ని మాత్రమే ఆస్వాదిస్తాయని అనుకున్నారు. కానీ ఇవి ముక్కుతో చేసే పనులు చూసి ఆశ్చర్యపోయారు.
  • ఇవి ఒకదానితో మరోటి గొంతుపై ముక్కుతో పొడుచుకుంటూ పోటీపడతాయి. తమ జతపక్షి ఇబ్బందుల్లో ఉంటే శత్రువుల్నించి కాపాడ్డానికి కూడా మగ హమ్మింగ్ పక్షులు ముక్కులతో ప్రత్యర్థుల గొంతుపై గట్టిగా పొడుస్తూ యుద్ధానికి దిగుతాయి.
  • కొస్టారికా ప్రాంతంలో శాస్త్రవేత్తలు నాలుగేళ్ల పాటు ఈ పరిశోధన చేశారు. అక్కడున్న వివిధ వయసు పక్షుల ముక్కుల పొడవు, చురుకుతనం లాంటివి తెలుసుకుని మరీ పరీక్షించారట. ఇలాంటి నైపుణ్యం అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్‌కు ఉండడంతో ఆశ్చర్యపోయారు.
  • ఇది వరకు జరిగిన పరిశోధనల్లో మగ హమ్మింగ్‌లు ఆడ పక్షుల్ని ఆకట్టుకోవడానికి గొంతును మార్చుతూ శబ్దాలు చేస్తాయనే సంగతి తెలిసింది.
    చక్కెరపానీయ పాత్ర చుట్టూ ఝంకార పక్షులు (హమ్మింగ్ బర్డ్స్)

చిత్రమాలిక

[మార్చు]
ఎన్నాస్ ఝంకారపక్షి
హమ్మింగ్ బర్డ్ మకరందం తాగుట, మందచలన చిత్రం

Humming bird is a bird.

Humming can fly.

Humming bird can fly backwards.

Humming birds are also called bird humming.

Interesting fact about this bird is that no one knows how it existed in this world.



-Samuel

YouTube:-@Anime2424-f9

బయటి లంకెలు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.