స్ట్రేంజర్ థింగ్స్
| స్ట్రేంజర్ థింగ్స్ | |
|---|---|
| శైలి |
|
| సృష్టికర్త | డఫర్ బ్రదర్స్ |
| తారాగణం |
|
| స్వరకర్తలు |
|
| దేశం | యునైటెడ్ స్టేట్స్ |
| అసలు భాష | ఇంగ్లీష్ (ఆంగ్లం) |
| సీజన్లు | 4 సంఖ్య |
| ఎపిసోడ్ల సంఖ్య | 34 |
| నిర్మాణం | |
| కార్యనిర్వాహక నిర్మాతలు |
|
| సినిమాటోగ్రఫీ | |
| నిడివి | 42–139 నిమిషాలు |
| బడ్జెట్ | $27 కోట్లు (సీజన్ 4)[3] |
| విడుదల | |
| అసలు నెట్వర్క్ | నెట్‌ఫ్లిక్స్ |
| అసలు విడుదల | 2016 జులై 15 |
స్ట్రేంజర్ థింగ్స్ (English: Stranger Things; తెలుగు అనువాదం: వింత విషయాలు) అనేది ఒక అమెరికన్ సైన్స్ ఫిక్షన్, భయానక, మిస్టరీ టెలివిజన్ ధారావాహిక. దీని సృష్టికర్తలు డఫర్ బ్రదర్స్. మంకీ మాసాకర్ ప్రొడక్షన్స్, 21 ల్యాప్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా నిర్మించబడిన మొదటి సీజన్‌ను 15 జూలై 2016న నెట్‌ఫ్లిక్స్లో విడుదల చేశారు. రెండవ, మూడవ సీజన్లు వరుసగా అక్టోబరు 2017, జూలై 2019లో వచ్చాయి. నాల్గవ సీజన్ రెండు భాగాలుగా మే, జూలై 2022లో విడుదలైంది.
కథాంశం
[మార్చు]స్ట్రేంజర్ థింగ్స్ 1980ల కాలంలో ఇండియానా లోని కల్పిత నగరమైన హాకిన్స్ నేపథ్యంలో సాగుతుంది. నగరానికి సమీపంలో ఉన్న హాకిన్స్ నేషనల్ లాబొరేటరీ పైకి యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ కోసం శాస్త్రీయ పరిశోధనలు చేస్తుంది. కానీ, ఈ ప్రయోగశాల రహస్యంగా మానవులను ఉపయోగించి పారానార్మల్, అతీంద్రియ ప్రయోగాలను కూడా నిర్వహిస్తుంటుంది. వారు అనుకోకుండా ఒక ప్రత్యామ్నాయ కోణానికి ప్రవేశ ద్వారాన్ని సృష్టిస్తారు, దీనినే వారు అప్‌సైడ్ డౌన్ అని పిలుస్తారు. ఈ ద్వారం, ఆ కోణపు ఉనికి హాకిన్స్ నివాసితులను అసాధారణ రీతిలో ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి.[4]
మొదటి సీజన్ నవంబరు 1983లో ప్రారంభమవుతుంది. అప్‌సైడ్ డౌన్ నుండి వచ్చిన ఒక జీవి విల్ బైర్స్‌ను అపహరిస్తుంది. అతని తల్లి జాయిస్, నగర పోలీసు చీఫ్ జిమ్ హాప్పర్, వాలంటీర్ల బృందం అతని కోసం వెతుకుతారు. ఈ క్రమంలో ''ఎలెవెన్'' అనే పేరు గల ఒక చిన్న అమ్మాయి ప్రయోగశాల నుండి తప్పించుకుని విల్ స్నేహితులను కలుస్తుంది. విల్‌ను కనుగొనడానికి వారు చేసే ప్రయత్నాలలో ఎలెవెన్ వారికి సహాయపడుతుంది.
నటీనటులు
[మార్చు]- వినోనా రైడర్ – జాయిస్ బైర్స్
- డేవిడ్ హార్బర్ – హాప్పర్
- ఫిన్ వోల్ఫ్హార్డ్ – మైక్ వీలర్
- మిల్లీ బాబీ బ్రౌన్ – ఎలెవెన్/జేన్ హాప్పర్ ("ఎల్")
- గాటెన్ మటరాజో – డస్టిన్ హెండర్సన్
- కాలేబ్ మెక్‌లాఫ్లిన్ – లూకాస్ సింక్లైర్
- నటాలియా డయ్యర్ – నాన్సీ వీలర్
- చార్లీ హీటన్ – జోనాథన్ బైర్స్
- కారా బ్యూనో – కరెన్ వీలర్
- మాథ్యూ మోడిన్ – మార్టిన్ బ్రెన్నర్
- నోహ్ ష్నాప్ – విల్ బైర్స్
- సాడీ సింక్ – మాక్స్ మేఫీల్డ్
- జో కీరీ – స్టీవ్ హారింగ్టన్
మూలాలు
[మార్చు]- ↑ "Stranger Things". Ricardo Diaz - Cinematographer. Archived from the original on 23 డిసెంబర్ 2021. Retrieved 5 జూలై 2024.
{{cite web}}: Check date values in:|archivedate=(help) - ↑ "caleb Heymann". Retrieved 5 జూలై 2024.
- ↑ రూపేష్, నాయర్. "Season 4 of Stranger Things Reportedly Costed $30 Million Per Episode". IGN India. Retrieved 5 జూలై 2024.
- ↑ కైట్లిన్, గల్లాఘర్. "'Stranger Things' Location Adds To The Spookiness". Bustle. Retrieved 5 జూలై 2024.