లారీ ఎల్లిసన్
లారెన్స్ జోసెఫ్ ఎల్లిసన్ | |
|---|---|
2016లో లారీ ఎల్లిసన్ | |
| జననం | లారెన్స్ జోసెఫ్ ఎల్లిసన్ 1944 ఆగస్టు 17 న్యూయార్క్ నగరం, అమెరికా |
| విద్య |
|
| వృత్తి |
|
| Title | ఒరాకిల్ కార్పొరేషన్ సహ-వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ [1] |
| జీవిత సహచరిs | అడ్డా క్విన్
(m. 1967; div. 1974)నాన్సీ వీలర్ జెంకిన్స్
(m. 1977; div. 1978)బార్బరా బూత్
(m. 1983; div. 1986)మెలనీ క్రాఫ్ట్
(m. 2003; div. 2010)నికితా ఖాన్
(m. 2015; div. 2020)జోలిన్ (కెరెన్) జు (m. 2023) |
| పిల్లలు | 6, డేవిడ్, మేగన్ లతో సహా |
లారీ ఎల్లిసన్ (ఆంగ్లం: Larry Ellison; 1944 ఆగస్టు 17), ఒక అమెరికన్ బిలియనీర్, పెట్టుబడిదారుడు. అతను అమెరికన్ కంప్యూటర్ టెక్నాలజీ కంపెనీ అయిన ఒరాకిల్ కార్పొరేషన్ సహ-వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.[2]
జూన్ 2023 నాటికి, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అతను $135 బిలియన్ల అంచనా నికర విలువతో ప్రపంచంలో నాల్గవ అత్యంత ధనవంతుడిగా జాబితా చేయబడ్డాడు.[3] హవాయి ద్వీపసమూహంలో ఆరవ అతిపెద్ద ద్వీపమైన లనాయ్లో అతనికి 98% వాటా ఉంది. మిగిలిన 2% ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది.[4]
జీవిత చరిత్ర
[మార్చు]ఆయన 1944 ఆగస్టు 17న న్యూయార్క్ నగరంలో, పెళ్లికాని యూదు తల్లి అయిన ఫ్లోరెన్స్ స్పెల్మన్కు జన్మించాడు. అతని తండ్రి యునైటెడ్ స్టేట్స్ ఆర్మీలో ఇటాలియన్-అమెరికన్ పైలట్. తొమ్మిది నెలల వయస్సులో, ఎల్లిసన్‌కు న్యుమోనియా సోకింది. అతని తల్లి అతన్ని బంధువులకు దత్తతకు ఇచ్చేసింది. అతనికి 48 ఏళ్లు వచ్చే వరకు తన తల్లిని మళ్లీ కలుసుకోలేదు.
1970ల ప్రారంభంలో, అతను ఆంపెక్స్ సాల్ట్ కంపెనీలో పనిచేసాడు. అక్కడ, ఐబిఎంలో రిలేషనల్ డేటాబేస్లను అభివృద్ధి చేస్తున్న ఎడ్గార్ ఎఫ్. కాడ్ పరిశోధన అతన్ని బాగా ఆకట్టుకుంది. 1977లో, అతను తన భాగస్వాములతో కలిసి ఒరాకిల్ను స్థాపించాడు. ఆ తర్వాత ఒరాకిల్, మధ్యస్థ, తక్కువ-స్థాయి సిస్టమ్‌ల కోసం ఒక విజయవంతమైన డేటాబేస్ విక్రేతగా మారింది. దీని ఫలితంగా ఆయన, ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించాడు.
యూరోపియన్ యూనియన్ 2010 జనవరి 21న సన్ మైక్రోసిస్టమ్స్‌ను ఒరాకిల్ స్వాధీనం చేసుకోవడానికి ఆమోదం తెలిపింది. ఈ స్వాధీనం ద్వారా ఒరాకిల్‌కు ప్రసిద్ధ MySQL డేటాబేస్‌పై కూడా నియంత్రణ లభించింది. వారు ఒరాకిల్ కార్పొరేషన్లో 42.9% వాటాను కలిగి ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "Lawrence J. Ellison – Executive Biography". Oracle. Archived from the original on July 8, 2015. Retrieved July 17, 2015.
- ↑ "दुनिया के 10 सबसे अमीर शख्स दौलत इतनी की ख्वाब में भी न सोची जाए..." एबीपी न्यूज़ (in హిందీ). 14 जनवरी 2023. Retrieved 29 जून 2023.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(help) - ↑ "AI का कमाल, अमीरी में पहली बार बिल गेट्स से आगे निकले लैरी एलिसन, जानिए कितनी पहुंच गई नेटवर्थ". नवभारत टाइम्स (in హిందీ). Retrieved 29 जून 2023.
{{cite news}}: Check date values in:|access-date=(help) - ↑ "एलन मस्क के अलावा दुनिया के ये पांच अरबपति, जिनके पास खुद का एक शहर". एबीपी न्यूज़ (in హిందీ). 18 मार्च 2023. Retrieved 29 जून 2023.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(help)