Jump to content

ఉర్సులా వాన్ డెర్ లేయన్

వికీపీడియా నుండి
ఉర్సులా వోన్ దెర్ లేయెన్
2024 నాటి అధికారిక పోర్ట్రయిట్
యూరోపియన్ కమీషన్ ప్రెసిడెంట్
Assumed office
2019 డిసెంబరు 1
కమిషన్వాన్ దెర్ లేయన్ కమీషన్ I & II
అంతకు ముందు వారుజీన్-క్లాడ్ జంకర్
German federal cabinet
జర్మనీ రక్షణ మంత్రి
In office
2013 డిసెంబర్ 17 – 2019 జులై 17
ఛాన్సలర్ఏంజెలా మెర్కెల్
అంతకు ముందు వారుథామస్ దె మైజైర్
తరువాత వారుఅన్నేగ్రెట్ క్రాంప్-కారెన్‌బవర్
జర్మనీ లేబర్ & సోషల్ అఫైర్స్ మంత్రి
In office
2009 నవంబరు 30 – 2013 డిసెంబరు 17
ఛాన్సలర్ఏంజెలా మెర్కెల్]
అంతకు ముందు వారుఫ్రాంజ్ జోసెఫ్ జంగ్
తరువాత వారుఆండ్రియా నహ్లెస్
జర్మనీ ఫ్యామిలీ అఫైర్స్, సీనియర్ సిటిజన్స్, విమెన్ & యూత్ మంత్రి
In office
2005 నవంబరు 22 – 2009 నవంబరు 30
ఛాన్సలర్ఏంజెలా మెర్కెల్
అంతకు ముందు వారురెనట్ ష్మిత్
తరువాత వారుక్రిస్టినా ష్రోడర్
Party roles
క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ ఆఫ్ జర్మనీకి ఉప నాయకురాలు
In office
2010 నవంబరు 15 – 2019 నవంబరు 22
Serving with
నాయకుడు
అంతకు ముందు వారుక్రిస్టియన్ వుల్ఫ్
తరువాత వారుసిల్వియా బ్రెహెర్
Lower Saxony cabinet
జర్మనీలోని లోయర్ శాక్సోనీ రాష్ట్రపు సోషల్ అఫైర్స్, విమెన్ & ఫ్యామిలీస్ & హెల్త్ మంత్రి
In office
2003 మార్చి 4 – 2005 నవంబరు 22
మినిస్టర్-ప్రెసిడెంట్క్రిస్టియన్ వుల్ఫ్
అంతకు ముందు వారుగిట్టా ట్రాయెర్నిష్ట్
తరువాత వారుమెక్తిల్డ్ రాస్-లుట్మాన్
Parliamentary constituencies
లోయర్ శాక్సానీ నుంచి జర్మనీ బుండెస్టాగ్ (ఫెడరల్ పార్లమెంట్) సభ్యురాలు
In office
2009 అక్టోబర్ 27 – 2019 జులై 31
అంతకు ముందు వారుమల్టీ-మెంబర్ డిస్ట్రిక్ట్
తరువాత వారుఇన్‌గ్రిడ్ పెహ్‌ల్‌మన్
నియోజకవర్గంక్రిస్టియన్ డెమోక్రాట్ యూనియన్ లిస్ట్
లియార్తా నియోజకవర్గం నుంచి లోయర్ శాక్సానీ రాష్ట్రపు లాండ్‌టాగ్ (పార్లమెంట్) సభ్యురాలు
In office
2003 మార్చి 4 – 2005 డిసెంబరు 7
అంతకు ముందు వారుగెర్‌హర్డ్ స్క్రోడర్ (1998)
తరువాత వారుడొరొతీ ప్రూస్‌నెర్
వ్యక్తిగత వివరాలు
జననం
ఉర్సులా గెర్ట్రడ్ ఆల్బ్రెష్ట్

(1958-10-08) 1958 అక్టోబరు 8 (వయసు: 68)
బ్రస్సెల్స్, బెల్జియం
పౌరసత్వంజర్మనీ
రాజకీయ పార్టీక్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ (1990 నుంచి)
ఇతర రాజకీయ
పదవులు
యూరోపియన్ పీపుల్స్ పార్టీ
జీవిత భాగస్వామి
సంతానం7
వృత్తి
  • రాజకీయ నాయకురాలు
  • వైద్యురాలు
  • రీసెర్చ్ ఫెలో
సంతకం

ఉర్సులా గెర్ట్రుడ్ వాన్ డెర్ లేయెన్ (జన్మనామం: ఉర్సులా గెర్ట్రడ్ ఆల్బ్రెష్ట్) (జననం 1958 అక్టోబరు 8) ఒక జర్మన్ రాజకీయవేత్త, వైద్యురాలు, ఆమె 2019 నుండి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా పనిచేస్తోంది.[a] ఆమె 2005 నుంచి 2019 వరకూ జర్మన్ ఫెడరల్ ప్రభుత్వంలో పనిచేసింది, ఏంజెలా మెర్కెల్ మంత్రివర్గంలో పలు పదవులను నిర్వహించింది, యూరోపియన్ కమీషన్ అధ్యక్షురాలు కాకముందు ఆఖరుగా జర్మన్ ఫెడరల్ రక్షణ మంత్రిగా పనిచేసింది. ఆమె సెంటర్-రైట్ క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ (CDU), దాని అనుబంధ యూరోపియన్ రాజకీయ పార్టీ, యూరోపియన్ పీపుల్స్ పార్టీ (ఈపీపీ)ల్లో సభ్యురాలు. 2024 మార్చి 7న, 2024 యూరోపియన్ పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించడానికి ఈపీపీ ఆమెను తన స్పిట్జెన్కండిడాట్ హోదాలో ఎన్నుకుంది. జూలై 2024లో కమిషన్కు నాయకత్వం వహించడానికి ఆమె తిరిగి ఎన్నికైంది.[1]

వాన్ డెర్ లేయెన్ బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరంలో పుట్టిపెరిగింది. ఆమె తల్లిదండ్రులు జర్మన్లు. ఆమె తండ్రి ఎర్నెస్ట్ ఆల్బ్రెష్ట్ మొట్టమొదటి యూరోపియన్ సివిల్ సర్వెంట్లలో ఒకడు. ఆమె పెరిగేప్పుడు ఇంట్లో జర్మన్, ఫ్రెంచ్ భాషలు రెండూ మాట్లాడేవారు. 1971లో ఆమె తండ్రి జర్మన్ రాజకీయాల్లో పాల్గొనడం మొదలుపెట్టడంతో కుటుంబంతో సహా ఆమె జర్మనీ తరలివెళ్ళి స్థిరపడింది. 1978లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఆమె పట్టభద్రురాలైంది, 1987లో ఆమె హనోవర్ మెడికల్ స్కూల్ నుండి వైద్యురాలిగా లైసెన్స్ పొందింది. తోటి వైద్యుడు హైకో వోన్ డెర్ లేయెన్ను పెళ్ళిచేసుకుని, 1990లలో కుటుంబంతో కలిసి యునైటెడ్ స్టేట్స్‌లో నాలుగు సంవత్సరాలు నివసించింది. జర్మనీకి తిరిగి వచ్చిన తరువాత ఆమె 1990ల చివరలో హనోవర్ ప్రాంతంలో స్థానిక రాజకీయాలలో పాల్గొంది. 2003 నుండి 2005 వరకు లోయర్ సాక్సోనీ రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసింది.

2005లో, వాన్ డెర్ లేయెన్ జర్మనీ ఫెడరల్ క్యాబినెట్లో చేరింది. మొదట కుటుంబ వ్యవహారాలు & యువజన మంత్రిగా 2005 నుండి 2009 వరకు, తరువాత 2009 నుండి 2013 వరకు కార్మిక & సామాజిక వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. ఈ క్రమంలో చివరగా 2013 నుండి రక్షణ మంత్రిగా పనిచేసింది.[2] ఆమె మంత్రి పదవి నుంచి దిగేనాటికి, మెర్కెల్ ఛాన్సలర్ అయినప్పటి నుంచి నిరంతరంగా మెర్కెల్ మంత్రివర్గంలో పనిచేసిన ఏకైక మంత్రిగా నిలిచింది. వాన్ డెర్ లేయెన్ 2010 నుండి 2019 వరకు CDU ఉప నాయకురాలిగా పనిచేసింది. అంతేకాక, జర్మనీ ఛాన్సలర్ పదవికి మెర్కెల్ తర్వాత పొందడానికి, జెన్స్ స్టోల్టెన్బర్గ్ తరువాత నాటో సెక్రటరీ జనరల్ కావడానికి ముఖ్యమైన అభ్యర్థిగా ఆమెను చాలామంది పరిగణించారు. బ్రిటిష్ రక్షణ కార్యదర్శి మైఖేల్ ఫాలన్ 2019లో ఆమెను నాటో కమ్యూనిటీలో "స్టార్ ప్రెజన్స్" అనీ, "ఐదేళ్ళకు పైగా నాటో మంత్రుల అధినాయకురాలు (doyenne)" అనీ అభివర్ణించాడు.[3] 2023లో, మళ్లీ ఈ పాత్ర పోషించడానికి ముఖ్యపోటీదారుగా పరిగణనకు వచ్చింది.[4]

2 జూలై 2019న, వాన్ డెర్ లేయెన్ను యూరోపియన్ కమిషన్ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా యూరోపియన్ కౌన్సిల్ ప్రతిపాదించింది.[5][6] ఆమెను ఆ ఏడాది జూలై 16న యూరోపియన్ పార్లమెంటు ఆ పదవికి ఎన్నుకుంది. డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించి, ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.[7][b]  ఆమె పదవీకాలంలో కోవిడ్-19 మహమ్మారి, యూరోపియన్ గ్రీన్ డీల్, రష్యా-ఉక్రేనియన్ యుద్ధం, గ్రీన్‌లాండ్ ని అమెరికాలో విలీనం చేస్తానని అమెరికా బెదిరింపులు వంటివి ఎదుర్కోవాల్సి వచ్చింది. రష్యన్ ఫెడరేషన్ కోసం ప్రత్యేక అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి తన కమిషన్ పని చేస్తుందని 2022 నవంబరులో ఆమె ప్రకటించింది.[9] 2025 ఆగస్టులో EU-US మధ్య పరస్పర, న్యాయమైన, సమతుల్య వాణిజ్యంపై ఒప్పందం ప్రకటన ఫ్రాన్స్, జర్మనీ నుండి వచ్చే విమర్శలకు గురైంది.

18 జూలై 2024న, వాన్ డెర్ లేయెన్ని యూరోపియన్ పార్లమెంటు కమిషన్ అధ్యక్షురాలిగా తిరిగి ఎన్నిక చేశారు, యూరోపియన్ పార్లమెంటులో 401 మంది సభ్యుల సంపూర్ణ మెజారిటీతో ఎన్నికయ్యారు, 2019 నాటి ఆమె ఎన్నికతో పోలిస్తే ఈసారి 30 ఓట్లు ఎక్కువ పడ్డాయి.[10] ఆమె 2022, 2023, 2024, 2025 సంవత్సరాల్లో ఫోర్బ్స్ వారు ప్రకటించే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నిలిచింది.[11][12][13]

గమనికలు

[మార్చు]
  1. ↑ German pronunciation: [ˈʊʁzula ˈɡɛʁtʁuːt fɔn dɐ ˈlaɪən] ⓘ
  2. ↑ యూరోపియన్ కమీషన్ అధ్యక్ష పదవి ఎన్నికల విధానం యూరోపియన్ యూనియన్ ఒప్పందం తాలూకు 17 (7) అధికరణంలో నమోదై ఉంది.[8]

మూలాలు

[మార్చు]
  1. ↑ Gozzi, Laura (18 July 2024). "Ursula von der Leyen secures five more years in top EU job". BBC News. Retrieved 18 July 2024.
  2. ↑ Arne Delfs (22 January 2014), "Merkel Succession Beckons After Von der Leyen's Defence Posting", Businessweek.
  3. ↑ Fallon, Michael (3 July 2019). "Yes, Ursula von der Leyen is an EU federalist, but she knows she can't afford to alienate Britain". The Telegraph. Archived from the original on 11 January 2022.
  4. ↑ Barnes, Joe (4 July 2023). "Joe Biden pushes for Ursula von der Leyen to be Nato chief". The Telegraph (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0307-1235. Retrieved 28 November 2023.
  5. ↑ "First woman nominated to lead EU Commission". BBC (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2 July 2019. Retrieved 2 July 2019.
  6. ↑ Barigazzi, Jacopo; Herszenhorn, David M.; Bayer, Lili; de La Baume, Maïa; Momtaz, Rym (2 July 2019). "EU leaders pick Germany's von der Leyen to lead Commission". POLITICO. Retrieved 2 July 2019.
  7. ↑ "MEPs back von der Leyen as EU Commission head". BBC News. 16 July 2019.
  8. ↑ మూస:CELEX
  9. ↑ "Statement by President von der Leyen on Russian accountability and the use of Russian frozen assets". European Commission. Retrieved 1 December 2022.
  10. ↑ "EU-Parlament wählt von der Leyen erneut zur EU-Kommissionspräsidentin". Tagesschau (in జర్మన్). 18 July 2024. Retrieved 18 July 2024.
  11. ↑ "The World's Most Powerful Women 2022". Forbes (in ఇంగ్లీష్). 6 December 2022. Archived from the original on 28 November 2023. Retrieved 29 December 2023.
  12. ↑ "The World's Most Powerful Women 2023". Forbes (in ఇంగ్లీష్). 5 December 2023. Archived from the original on 5 December 2023. Retrieved 29 December 2023.
  13. ↑ "Forbes World's Most Powerful Women – Ranked 2024 List". Forbes (in ఇంగ్లీష్). Archived from the original on 2026-01-18.