BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్‌తో ఆందోళనలు, దిల్లీ, ముంబైలలో పోలీసులు అలర్ట్
ప్రతిపాదిత నిరసన ప్రదర్శనకు ముందుగానే పోలీసులు జంతర్ మంతర్‌కు వెళ్లే రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేశారు.
మరణశిక్ష కోసం రెండుసార్లు విషం ఎక్కించినా ఆమె చనిపోలేదు, మరి ఇప్పుడేం చేస్తారు? ఆమె ఎలా ఉన్నారు?
ఈ పరిణామం తర్వాత ఆమె మరణశిక్షను తగ్గించాలని ఆమె తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేస్తున్నారు. 1996లో కొలీన్ స్లెమ్మర్ అనే 19 ఏళ్ల యువతిని క్రూరంగా హింసించి హత్య చేసిన కేసులో ప్రస్తుతం 50 ఏళ్ల వయసున్న పైక్‌కు కోర్టు మరణశిక్ష విధించింది.
తెల్లకాగితం రివ్యూ: సందేశాత్మక టీనేజ్ లవ్ స్టోరీ మెప్పించిందా?
నిజానికి ఈ తరహా కథలను ఆ వయసు దాటి వచ్చిన ప్రేక్షకులు కూడా ఆస్వాదించేలా మెచ్యూర్డ్‌గా రాసుకుంటే కనెక్షన్ ఇంకా బలంగా ఉండేది.
కాళోజీ యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికెట్లతో అడ్మిషన్లంటూ వివాదం
మొత్తం విద్యార్ధులతో 37 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు స్థానికత అర్హతకు సరిపోవడం లేదని, అందువల్ల వారిని ఎస్టీ కేటగిరీ కింద గుర్తించలేమని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్జాన విశ్వవిద్యాలయం ప్రకటించింది.
‘ఇస్లామిక్ తీవ్రవాద భావజాల ప్రభావం’ తోనే కోపైలట్ దాడి, వెల్లడించిన ప్రధాని నెతన్యాహు
దాడి చేసింది ఒమన్‌కు చెందిన వ్యక్తి అని, విమానాన్ని కూల్చివేయాలనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించి ఉంటాడని ఫాక్స్ న్యూస్‌కు నెతన్యాహు చెప్పారు.
స్వాతంత్య్ర దినోత్సవాల కోసం 23 ఏనుగుల వేటకు అనుమతి ఇచ్చిన బోట్స్వానా ప్రభుత్వంపై విమర్శలు
ఈ నిర్ణయం జంతు సంరక్షణ చర్యలను బలహీనపరుస్తుందని బోట్స్వానాలోని ఎలిఫెంట్ ప్రొటెక్షన్ సొసైటీ హెచ్చరించింది.
ఫ్లైదుబయ్ విమాన దాడి: ఆ 17 నిమిషాల్లో ఏం జరిగింది?
తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్, కాక్‌పిట్ తలుపు తెరిచి తోటి ప్రయాణికులు, మరో పొజిషనింగ్ పైలట్ సహాయంతో ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. సరిగ్గా చెప్పాలంటే, ఆయన చూపిన తెగువ వల్లే 174 మంది ప్రాణాలు దక్కాయి.
లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని ఇద్దరు బాలికలు ఎలా పట్టించారంటే..
హాస్టల్ నుంచి ఆ విద్యార్థినులను నిబంధనలకు విరుద్ధంగా బయటకు పంపడంతో పాటు, ఆ రిటైర్డ్ ఉద్యోగి వద్దకు వెళ్లాలని వారికి సూచించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాస్టల్ వంట మనిషిని సస్పెండ్ చేసినట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎస్ నిర్మల జ్యోతి బీబీసీతో చెప్పారు
న్యూస్ పేపర్లు, కాగితాల్లో చుట్టిన ఆహారం తింటున్నారా? మీ కడుపులో ఏం జరుగుతుందో తెలుసా
ఫుడ్ అమ్మేవారు, హోటల్స్, ఇతర ఆహారం అమ్మే వ్యాపారులకు భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల ముఖ్యమైన సూచనలు జారీ చేసింది. బోండాలు, బజ్జీలు, సమోసాలు వంటి ఆహార పదార్థాలను వార్తాపత్రికలు, ఇతర ప్రింటెడ్ పేపర్లలో చుట్టి ఇవ్వడం లేదా వాటిపైన వడ్డించడం ఆరోగ్యానికి హానికరమని తెలిపింది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
‘‘ఆ ఇల్లు ఆయన ఆలోచనలకు పుట్టిల్లు’’ -వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న గురజాడ నివాసం ఇప్పుడెలా ఉంది?
ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని చెప్పిన వ్యక్తి జ్ఞాపకాలను పదిల పరచుకున్న ఆ ఇల్లు ఇప్పుడు స్మారక గ్రంథాలయంగా మారింది. అక్కడ ఆయన జీవిత విశేషాలను భద్ర పరిచి ప్రదర్శనకు ఉంచారు.
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































