Jump to content

రామకృష్ణ మఠం

వికీపీడియా నుండి
(రామకృష్ణ మిషన్ నుండి దారిమార్పు చెందింది)
రామకృష్ణ మఠం చిహ్నం

రామకృష్ణ మఠం, అనేది 19వ శతాబ్దానికి చెందిన బెంగాల్‌కు చెందిన ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస పురుషుల కోసం ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం పేరు. దీనికి అనుబంధ సంస్థయైన రామక్రిష్ణ మిషన్, ఆయన ప్రియశిష్యుడైన స్వామీ వివేకానంద ఆయన తత్వాలను వ్యాప్తి చేయడానికి స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ. ఈ రెండు సంస్థల ప్రధాన కార్యాలయాలు పశ్చిమ బెంగాల్ లోని బేలూర్ మఠం దగ్గర ఉన్నాయి. రామకృష్ణ మిషన్ ను మే 1, 1897లో స్థాపించడం జరిగింది. ఇవి రెండూ న్యాయపరంగా, ఆర్థిక పరంగా రెండు ప్రత్యేక సంస్థలైనప్పటికీ, చాలా కార్యక్రమాలను కలిసే రూపొందిస్తాయి, కాబట్టి వీటిని జంట సంస్థలుగా పరిగణించవచ్చు. ఈ జంట సంస్థల ప్రధాన లక్ష్యం సర్వమత సామరస్యం, సామాజిక సమానత్వం, వెల్లివిరియడం. జాతి, వర్గ, కుల, మత, ప్రాంతీయ, లింగ భేదాలు లేకుండా మానవాళి సుఖశాంతులతో జీవించడం, మానవుని సర్వతోముఖాభివృద్ధి. రామకృష్ణ మఠానికి చెందిన సన్యాసులు, భక్తులు కలిసి ప్రధానంగా భారతదేశంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీనికి భారతదేశంలో, విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్నాయి.[1]

ప్రధాన లక్ష్యాలు

[మార్చు]
  • ప్రతీ మానవునిలో దివ్యత్వాన్ని గురించి ప్రచారం చెయ్యడం
  • అన్ని మతాల లక్ష్యం ఒకటే నని ప్రపంచానికి చాటడం
  • పనిని దైవంగా భావించి నిర్వర్తించడం, మానవసేవయే మాధవ సేవయని తెలియజేయడం
  • విద్య, వైద్య సేవల ద్వారా సామాన్యుల సమస్యలను తీర్చడం
  • జ్ఞాన, భక్తి, కర్మ రాజయోగాలను పాటించడం ద్వారా పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దడం మొదలైనవి.

సామాజిక సేవ

[మార్చు]

వైద్య సేవలు

[మార్చు]
  • క్షయ, కుష్టు వ్యాధి వంటి వాటికి ప్రత్యేక చికిత్సలు
  • కంటికి, నరాలకు సంబంధించిన వ్యాధులకు వైద్యం
  • మానసిక వ్యాధులకు ప్రత్యేక ట్రీట్‌మెంట్లు


విద్యా సేవలు

[మార్చు]

హైదరాబాదు మఠంలో విద్యార్థులకు అత్యంత తక్కువ ఫీజులతో ఆంగ్లము నేర్పేందుకు అతిపెద్ద విద్యాలయము ఉంది.

  • దీనిలో పదవతరగతిలో అత్యంత కనిష్ఠ మార్కులతో పాసయిన విద్యార్థులకు మొదటి అవకాశం కల్పిస్తారు.
  • మూడు విభాగాలలో శిక్షణ కల్పిస్తారు.

ప్రచురణలు

[మార్చు]
పత్రికలు
×పేరుప్రచురణ జరుగుతున్న
సంవత్సరం
భాషప్రచురణ కాలంకేంద్రం
1 ప్రబుద్ధ భారత110thఇంగ్లీష్ప్రతి మాసంMayavati Archived 2019-10-01 at the Wayback Machine
2 ఉద్బోధన్107thబెంగాలీప్రతి మాసంKolkata Bagbazar
3 వేదాంత కేసరి92ndఇంగ్లీష్ప్రతి మాసంChennai Mylapore Archived 1999-04-17 at the Wayback Machine
4 ప్రబుద్ధ కేరళం90thమలయాళంప్రతి మాసంThrissur Kerala
5 శ్రీ రామకృష్ణ విజయం85thతమిళంప్రతి మాసంChennai Mylapore Archived 1999-04-17 at the Wayback Machine
6 శ్రీ రామకృష్ణ ప్రభ62ndతెలుగుప్రతి మాసంHyderabad, Domalguda Archived 2008-05-14 at the Wayback Machine
7 బుల్లెటిన్56thఇంగ్లీష్ప్రతి మాసంKolkata Golpark
8 జ్యోతి53rdఇంగ్లీష్3 నెలలకు ఒకమారుDurban, South Africa
9 జీవన్ వికాస్49thమరాఠీప్రతి మాసంNagpur Maharasthra
10 సమాజ్ శిక్ష48thబెంగాలీప్రతి మాసంKolkata Narendrapur
11 వివేక్ జ్యోతి43rdహిందీప్రతి మాసంRaipur
12 వేదాంత39thఫ్రెంచ్3 నెలలకు ఒకమారుFrance Gretz
13 ఆశ్రమవాణి23rdహిందీప్రతి మాసంIndore
14 శ్రీ రామకృష్ణ జ్యోత్18thగుజరాతీప్రతి మాసంRajkot
15 దివ్యయాన్ సమాచార్13thహిందీప్రతి మాసంRanchi Morhabadi
16 నిర్వణ13thఇంగ్లీష్3 నెలలకు ఒకమారుSingapore Archived 2012-03-25 at the Wayback Machine
17 వివేకప్రభ6thకన్నడప్రతి మాసంMysore

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-05. Retrieved 2008-10-09.

ఇవికూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]